PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/hyderabad-ut-asad5739387f-a33e-408d-b1c6-b03f54611826-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/hyderabad-ut-asad5739387f-a33e-408d-b1c6-b03f54611826-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాజధానిగా ఉన్న హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కానుందా? నరేంద్ర మోడీ సర్కార్ ఆ దిశగా కసరత్తు చేస్తుందా? .. హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ వ్యాఖ్యలతో ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ హైదరాబాద్ ను యూటీ చేస్తారనే ప్రచారం జరిగింది. hyderabad ut asad;modi;seema;hyderabad;bharatiya janata party;jagan;andhra pradesh;telangana;narendra modi;mp;rayalaseema;parliment;mla;minister;central government;reddy;party;narendraయూటీగా హైదరాబాద్! షర్మిల పార్టీ అందుకేనా? కలంయూటీగా హైదరాబాద్! షర్మిల పార్టీ అందుకేనా? కలంhyderabad ut asad;modi;seema;hyderabad;bharatiya janata party;jagan;andhra pradesh;telangana;narendra modi;mp;rayalaseema;parliment;mla;minister;central government;reddy;party;narendraSun, 14 Feb 2021 21:09:53 GMTతెలంగాణ రాజధానిగా ఉన్న హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కానుందా? నరేంద్ర మోడీ సర్కార్ ఆ దిశగా కసరత్తు చేస్తుందా? .. హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ వ్యాఖ్యలతో ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ హైదరాబాద్ ను యూటీ చేస్తారనే ప్రచారం జరిగింది. కొందరు సీమాంధ్ర నేతలు కూడా ఈ డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఈ డిమాండ్ కనుమరుగైంది. తాజాగా అసద్ లోక్ సభలో చేసిన ప్రసంగంతో మళ్లీ యూటీ అంశం రాజకీయ కాక రేపుతోంది.

అసద్ వ్యాఖ్యలతో కొత్త చర్చ వస్తోంది. తెలంగాణలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి.. వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతుండటం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్ మారే అవకాశం ఉందన్న సమాచారం ఉండటం వల్లే షర్మిల పార్టీ పెట్టడానికి సిద్ధమయ్యారనే అనుమానాలు వస్తున్నాయి. హైదరాబాద్ యూటీ అయితే తమ పట్టు నిలుపుకోవాలనే లక్ష్యంతోనే జగన్.. షర్మిలను రంగంలోకి దింపారని కొందరు చెబుతున్నారు.

 కేంద్రంలోని మోడీ ప్రభుత్వం భవిష్యత్తులో హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తుందని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఖండించారు.  హైదరాబాద్‌ను యూటీ చేసే ఆలోచన కేంద్రానికి లేదని తేల్చిచెప్పారు. జవాబు చెప్పేలోపే ఓవైసీ పార్లమెంట్ నుంచి పారిపోయాడని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. అబద్ధాలు ప్రచారం చేయడం.. ఎంఐఎం, టీఆర్ఎస్‌కు అలవాటుగా మారిందని కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

 అసదుద్దీన్‌ ఓవైసీపై గోషామహాల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌ అయ్యారు. అసదుద్దీన్‌కు పిచ్చి పట్టిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌ను యూటీ చేస్తారని పార్లమెంట్‌లో మాట్లాడటం సరికాదన్నారు. అభివృద్ధి గురించి మాట్లాడకుండా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌ను యూటీ చేసే ఆలోచన కేంద్రానికి ఏమాత్రం లేదని స్పష్టం చేశారు.

మజ్లీస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ శనివారం పార్లమెంట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ భవిష్యత్తులో హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం మార్చే ప్రమాదం ఉందన్నారు. లోక్‌సభలో జమ్మూకశ్మీర్‌ విభజన చట్టం సవరణ బిల్లుపై జరిగిన చర్చలో అసదుద్దీన్ ఈ వ్యాఖ్యలు  చేశారు.







బిజెపి వాళ్ళ నోరు కుట్టేసిందా...?

స్టార్ హీరో అయ్యాక అబ్బాస్ పెట్రోల్ బంక్ లో ఎందుకు పని చేయాల్సి వచ్చింది

మూడు వారాల గ్యాప్ లో ... మూడు సునామీలు ....బాక్సాఫీస్ రచ్చ రచ్చే .... ??

RC15 కి మ్యూజిక్ డైరెక్టర్ అతనేనా?

హమ్మా.. మళ్లీ మెగాస్టార్ సరసన ఈ బ్యూటీ ఛాన్స్ కొట్టేసిందిగా..

జగడ్డ: కృష్ణా జిల్లాలో రగడ దేనికి సంకేతం...?

హీరోయిన్ కాబోతున్న తెలుగు టిక్ టాక్ స్టార్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>