PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsa104226c-9245-4d38-a79f-479002736d48-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsa104226c-9245-4d38-a79f-479002736d48-415x250-IndiaHerald.jpgఅదేంటో బంగారం లాంటి జిల్లాలు. అద్భుతమైన విజయాలు అందించే జిల్లాలు. దశాబ్దాల పాటు కాపు కాసిన ప్రాంతాలు. గుండెల మీద చేయి వేసుకుని ధీమాగా మావి అని చెప్పుకునే జిల్లాలు. అలాంటి జిల్లాలు రివర్స్ గేర్ వేసి రెండేళ్ళు అవుతున్నా కూడా తీరు అలాగే ఉంది. నెగిటివ్ జోరు కూడా అలాగే సాగుతోంది. jagan-nimmagadda-elections;2019;vishakapatnam;panchayati;parliment;assembly;cycle;tdp;ycpజగడ్డ : ఆ రెండు జిల్లాలను వదులుకోవాల్సిందేనా...?జగడ్డ : ఆ రెండు జిల్లాలను వదులుకోవాల్సిందేనా...?jagan-nimmagadda-elections;2019;vishakapatnam;panchayati;parliment;assembly;cycle;tdp;ycpSun, 14 Feb 2021 09:54:27 GMT
మరోసారి ఉత్తరాంధ్రాలోని రెండు జిల్లాల గురించి టీడీపీలో ప్రస్థావన వస్తోంది. అవి శ్రీకాకుళం, విజయనగరం. విశాఖ కూడా అలాగే ఉన్నా వైసీపీ మీద పోరాటంలో చాలా నయంగానే ఉంటోంది. విశాఖ సిటీ 2019 ఎన్నికల్లో నాలుగు సీట్లు తెచ్చుకుంది. రూరల్ లో కూడా టఫ్ ఫైట్ ఇస్తోంది. అదే విజయనగరం శ్రీకాకుళం జిల్లాలు మాత్రం పూర్తిగా ఏకపక్షంగా వైసీపీకి మొగ్గుతున్నాయి.

2019 ఎన్నికల వేళ విజయనగరం జిల్లాలో మొత్తం అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు కూడా వైసీపీ గెలుచుకుని సైకిల్ కి పూర్తిగా బ్రేకులేసింది. ఇపుడు పంచాయతీ ఎన్నికల్లో చూసుకుంటే అదే వైఖరి కొనసాగుతోంది అనిపిస్తోంది.  రెండవ విడతలో ఈ జిల్లాలో ఎన్నికలు జరిగితే ఏకగ్రీవాలే 60కి పైగా జరిగాయి. అందులో తొంబై  అయిదు శాతం పైగా వైసీపీకి దఖలు పడ్డాయి.

ఇక ఎన్నికలు జరిగిన 355 పంచాయతీలలో 284 పంచాయతీలు వైసీపికీ దఖలు పడ్డాయి. టీడీపీ తరఫున మద్దతుదారులు కేవలం 63 చోట్లనే గెలిచారు. ఇక్కడ ఇతరులు 28 మంది గెలవడం విశేషం. అంటే టీడీపీ తో పాటు గా వారే రేసులోకి వస్తున్నారు అన్న మాట. అదే విధంగా శ్రీకాకుళం జిల్లాలోనూ సీన్ కనిపిస్తోంది. రెండవ విడతలో శ్రీకాకుళం జిల్లాలో 41 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 236కి ఎన్నికలు జరితే 225 దాకా వైసీపీ గెలుచుకుంది అంటే రికార్డే మరి. మొత్తం శ్రీకాకుళం జిల్లలో రెండవ విడతలో 28 పంచాయతీలు మాత్రమే టీడీపీకి దక్కాయంటే ఆలోచించాల్సిందే. మొత్తానికి ఈ రెండు జిల్లాలు ఇప్పట్లో కోలుకోవా అన్న చర్చ పసుపు పార్టీలో ఉంది.




నెలకో సినిమాతో సందడి చేయనున్న స్టార్ హీరోయిన్.. ఇక ఫ్యాన్స్ కు పండగే...

ఎడిటోరియల్: “కోవిడ్ వ్యాక్సీన్” కోసం భారత్ ను ఎందుకు సంప్రదించ లేదు? కెనడా మంత్రి అనితా ఆనంద్ ను నిలబెట్టి ప్రశ్నించిన ఎంపి మైకెల్ రెంపెల్ వార్నర్

ఏపీ పంచాయతీ ఎన్నికల్లోనే అది రికార్డు విజయం..

జగడ్డ : రెండో విడతలోనూ ఎవరి లెక్కలు వారివే..

చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రికి షాక్ ఇచ్చిన ఓట‌ర్లు.... అక్క‌డ సైకిల్ గ‌ల్లంతు

వైసీపీ కీల‌క‌నేత‌కు షాక్‌.. నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో టీడీపీ ఘ‌న‌విజ‌యం

తెలంగాణ టీడీపీపై చంద్ర‌బాబు మ‌ళ్లీ ఫోక‌స్‌... ఇదిగో సాక్ష్యం..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>