ViralSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/shivaji5d5a6b16-a58f-42af-b6bc-0209b158f8ed-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/shivaji5d5a6b16-a58f-42af-b6bc-0209b158f8ed-415x250-IndiaHerald.jpgతాజాగా, విశాఖ ఉక్కుపై ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి కాకరేపే విషయాలు చెప్పారు నటుడు శివాజీ. విశాఖ స్టీల్ ప్లాంట్ వీళ్ల మూల సూత్రం కాదని.. దయచేసి ప్రజలు అర్థం చేసుకోండంటూ మరో బాంబు పేల్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది జస్ట్ రూట్ మ్యాప్ మాత్రమేనని వ్యాఖ్యానించారు. ‘‘వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టడానికి మూల సూత్రం.. గిరిజన ప్రాంతాల్లో ఉన్న బాక్సైట్‌ను తవ్వేసుకోవడానికే! అని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.sivaji;mithra;visakhapatnam;bharatiya janata party;korea, south;amaravati;andhra pradesh;gujarat - gandhinagar;narendra modi;mohandas karamchand gandhi;రాజీనామా;kadapa;vishakapatnam;media;mla;interview;hero;tdp;central government;chatrapathi shivaji;sivaji;narendraవైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకం దాని కోసమే - నటుడు శివాజీవైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకం దాని కోసమే - నటుడు శివాజీsivaji;mithra;visakhapatnam;bharatiya janata party;korea, south;amaravati;andhra pradesh;gujarat - gandhinagar;narendra modi;mohandas karamchand gandhi;రాజీనామా;kadapa;vishakapatnam;media;mla;interview;hero;tdp;central government;chatrapathi shivaji;sivaji;narendraSun, 14 Feb 2021 22:30:00 GMTఇటీవలే కేంద్ర బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రతిపాదించిన అంశం అయినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై గత రెండు వారాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రకంపనలు సృష్టిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయం ప్రతిపాదించిన నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే విశాఖ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా కూడా చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రముఖ సినీ నటుడు, గతంలో సమైక్యాంధ్ర మరియు ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసిన శివాజీ గతంలో చెప్పినట్లుగా ప్రస్తుతం పరిస్థితులు ఏర్పడుతుండటంతో మరోసారి తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.




గతంలో సుమారుగా ఏడాది క్రితం నటుడు శివాజీ మాట్లాడుతూ... ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ‘ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ ద్రవిడ’ ప్లాన్స్ చేస్తోందంటూ అప్పట్లో ప్రెస్మీట్ పెట్టి బోర్డుపై పాఠాలు చెప్పడం పెద్ద దుమారమే రేపింది. అలాగే అప్పుడు ఏడాది క్రితమే ‘‘విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయబోతున్నారని, దక్షిణ కొరియా దేశానికి చెందిన పోస్కో కంపెనీకు కట్టబెట్టబోతున్నారు.. రాసిపెట్టుకోండి’’ అని శివాజీ అన్న మాటలు వైరల్‌గా మారాయన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా, విశాఖ ఉక్కుపై ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి కాకరేపే విషయాలు చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వీళ్ల మూల సూత్రం కాదని.. దయచేసి ప్రజలు అర్థం చేసుకోండంటూ మరో బాంబు పేల్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది జస్ట్ రూట్ మ్యాప్ మాత్రమేనని వ్యాఖ్యానించారు. ‘‘వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టడానికి మూల సూత్రం.. గిరిజన ప్రాంతాల్లో ఉన్న బాక్సైట్‌ను తవ్వేసుకోవడానికే! విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం అనేది జస్ట్ రూట్ మ్యాప్ మాత్రమే. వాళ్లకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ చాలా చిన్నది.. బాక్సైట్‌ను దొబ్బేయడానికి వేస్తున్న స్కెచ్‌లే ఇవన్నీ! వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకంతో ఇది ఆగదు.’’ అని చెప్పి హీరో శివాజీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.




ఈ విషయాన్ని తాను ఊహించి చెబుతోంది కాదని మరో బాంబు పేల్చారు. బాక్సైట్ కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తున్న విషయం పూర్తిగా నిజమని, ఈ విషయం ఇంటర్నర్ సోర్స్ (అంతర్గత మిత్రుల) ద్వారా తెలిసిందని వ్యాఖ్యానించారు. ఇలా చెప్పే వారు ఎవరైనా కావొచ్చని, ఫైల్స్ మోసే ప్యూన్స్ ద్వారా కూడా ఈ నిజం బయటకు వస్తుందని వ్యాఖ్యానించారు. ఇక, ప్రదఆని నరేంద్ర మోదీపై కూడా శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఎందుకో ఆంధ్ర అనే పేరు గుజరాత్ ప్రధానికి నచ్చడం లేదు.. ఆంధ్రా బ్యాంక్‌ను తీసేశారు.. వేరే బ్యాంక్‌లో కలిపేశారు.. దేశం మొత్తం గుజరాత్ అయిపోతుంది. భారతదేశం ఏం లేదు.. గుజరాత్ దేశం కాబోతుంది. జాతిపిత నరేంద్ర మోదీ. ఆయన ఆధ్వర్యంలో ఆంధ్ర అనే పేరు ఎక్కడా కనిపించకూడదనేది వాళ్ల టార్గెట్. ప్రత్యేక హోదా కోల్పోయాం.. అని వాళ్లు అనుకుంటున్నారు.. అది ఎప్పటికీ జరగదు. అది మా హక్కు.. ఆ హక్కుని చెరిపేయలేరు. అలాగే కడప స్టీల్ ఏ దశలో ఉందో తెలియదు. అమరావతి రైల్వే లైన్‌కి వెయ్యి రూపాయిలు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌ని ఇంత అవమానకరంగా అన్యాయం చేస్తుంటే భరిస్తూనే ఉన్నాం.’’ అంటూ నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు.




రాజ్ తరుణ్ 'పవర్ ప్లే' రిలీస్ డేట్ ఫిక్స్

స్టార్ హీరో అయ్యాక అబ్బాస్ పెట్రోల్ బంక్ లో ఎందుకు పని చేయాల్సి వచ్చింది

మూడు వారాల గ్యాప్ లో ... మూడు సునామీలు ....బాక్సాఫీస్ రచ్చ రచ్చే .... ??

RC15 కి మ్యూజిక్ డైరెక్టర్ అతనేనా?

హమ్మా.. మళ్లీ మెగాస్టార్ సరసన ఈ బ్యూటీ ఛాన్స్ కొట్టేసిందిగా..

జగడ్డ: కృష్ణా జిల్లాలో రగడ దేనికి సంకేతం...?

హీరోయిన్ కాబోతున్న తెలుగు టిక్ టాక్ స్టార్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>