EditorialParisa Rama Krishna Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/editorial/77/canada-responsec46a3044-2fcd-47fb-abc6-ab2029eb3c56-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/editorial/77/canada-responsec46a3044-2fcd-47fb-abc6-ab2029eb3c56-415x250-IndiaHerald.jpgఈ "వ్యాక్సీన్ మైత్రి ఇనిషియేటివ్" ద్వారా మూడు రకాలుగా వ్యాక్సీన్లు ప్రపంచానికి అందుతున్నాయి. మొదటిది పేద దేశాలకు ఉచితంగా, ప్రైస్-సెన్సిటివ్ దేశాలకు కొంత ఆర్ధిక వెసులుబాటు ధరలకు సరపరా అవుతున్నాయి. ఇతరులు ప్రత్యక్షంగా వ్యాక్సీన్ తయారీ కేంద్రాలతో అనుసంధానం అయ్యారని వార్తలను ప్రసారం చేసింది పిటిఐ అని చెప్పారు. canada response;chiranjeevi;amala akkineni;anand lyricst;anand malayalam actor;anand music;anitha singer;sampada;satya;india;canada;mp;smart phone;prime minister;parliment;producer;minister;population;producer1;letter;butter;anand deverakonda;shadow;narendraఎడిటోరియల్: “కోవిడ్ వ్యాక్సీన్” కోసం భారత్ ను ఎందుకు సంప్రదించ లేదు? కెనడా మంత్రి అనితా ఆనంద్ ను ప్రశ్నించిన ఎంపి వార్నర్ఎడిటోరియల్: “కోవిడ్ వ్యాక్సీన్” కోసం భారత్ ను ఎందుకు సంప్రదించ లేదు? కెనడా మంత్రి అనితా ఆనంద్ ను ప్రశ్నించిన ఎంపి వార్నర్canada response;chiranjeevi;amala akkineni;anand lyricst;anand malayalam actor;anand music;anitha singer;sampada;satya;india;canada;mp;smart phone;prime minister;parliment;producer;minister;population;producer1;letter;butter;anand deverakonda;shadow;narendraSun, 14 Feb 2021 09:15:00 GMT
భారత్ ను కరోన వాక్సిన్ సరపరా చేయమని ఎందుకు అడగ లేదు? "వాక్సీన్ మైత్రి స్కీం" ద్వారా అభ్యర్ధించక పోవటం లొని ఔచిత్యం ఏమిటి? అని మినిస్టర్ ఫర్ ప్రొక్యూర్మెంట్, అనిత అనంద్ ను కెనడా పార్లమెంట్ లో "ప్రతిపక్ష చట్ట నిర్మాత" (ప్రతిపక్ష ఎంపి) మైకెల్ రెంపెల్ గార్నర్ ఒక సమావేశంలొ నిలబెట్టి ప్రశ్నించారు. గార్నర్ ఆరోగ్యశాఖ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడు, షాడో మినిస్టర్ కూడా!



ప్రపంచం అంతటికి టీకా డోసులు కాదన కుండా సరపరా చెసే భారత్ ను, భారతీయ సంతతి వారై ఉండి మీరు ఎందుకు ప్రధాని నరేంద్ర మోడీని అభ్యర్ధించ లేదు? ఒకవేళ ప్రధాని జస్టిన్ ట్రూడో అయినా అభ్యర్ధించి ఉన్నారా? మనకు కావలసినంత పరిమాణం నిర్ణీత సమయం లో వ్యాక్సీన్ సరపరా చేయగల దేశం ప్రపంచంలో భారత్ ఒక్కటే అని తెలుసు కదా!  


అనిత అనంద్ భారత పంజాబి సంతతికి చెందిన వ్యక్తి. ఈమె కెనడా అధ్యక్షుడు ట్రూడొ మంత్రి వర్గంలో “వస్తు & సేవలు సేకరణ” మంత్రిగా పనిచేస్తున్నారు. ఒక్కసారిగా ఊహించని ఈ ప్రశ్నకు అనిత ఆనంద్ షాక్ కు గురై  “అదనపు టీకా డోసులకోసం నేను అనేక దేశాలను సంప్రదించే పనిలోనే ఉన్నాను.  ప్రపంచంలొ కోవిడ్ -19 వ్యాక్సీన్ సరపరా చేసే సంస్థలు, దేశాలతో క్రమం తప్పకుండా, సంప్రదింపులు జరుపుతున్నాను” అని సమాధానం ఇచ్చారు.


"నేను భారత ప్రధానితో మాట్లాడలేదు. మనవాళ్లను ఎవరిని సంప్రదించలేదు. మన ప్రధాని విషయం తెలియదు" అని సమాధానం పేలవంగా ఇచ్చారు. సహజంగా తప్పు చేసిన వాళ్లే అలాగ చేస్తారు.


"మీరు పిఎం మోడీకి ఫోన్ చేశారా?" ప్రశ్నను రెండవసారి ఘట్టిగానే అడిగారు గార్నర్.


"మరి మన ప్రధాని జస్టిన్ ట్రూడో అయినా భారత్ ను ఈ సంప్రదించారా? మోడీకి ఆయన ఫోన్ చేశారా?" ప్రశ్నల పరంపర కొనసాగింది. అనిత సమాధానం "నాకు తెలియదు"


దానికి గార్నర్ "ఈమెకు ఏమీ తెలియదు. ఈ సమాధానం భయపెట్టేదిగా ఉంది" 


భారత విదేశాంగ శాఖ మంత్రి భారత్ నుంచి వ్యాక్సీనులు పొందటానికి వ్యాక్సీన్ మైత్రి స్కీం ఉంది. దాని ద్వార సంప్రదించిన వారికి అడిగి నంత వ్యాక్సీన్ డోసులు సరపరా చేస్తున్నాము. ఇప్పటికి 15 దేశాలకు సహాయం అందించాము. ఇప్పుడింకా 25 పైగా దేశాలు వివిధ స్తాయిలలో వ్యాక్సీన్ పొందటానికి "క్యూ" లో ఉన్నాయని అన్నారు.  


ఈ "వ్యాక్సీన్ మైత్రి ఇనిషియేటివ్" ద్వారా మూడు రకాలుగా వ్యాక్సీన్లు ప్రపంచానికి అందుతున్నాయి. మొదటిది పేద దేశాలకు ఉచితంగా,  ప్రైస్-సెన్సిటివ్ దేశాలకు కొంత ఆర్ధిక వెసులుబాటు ధరలకు సరపరా అవుతున్నాయి. ఇతరులు ప్రత్యక్షంగా వ్యాక్సీన్ తయారీ కేంద్రాలతో అనుసంధానం అయ్యారని వార్తలను ప్రసారం చేసింది పిటిఐ అని చెప్పారు.


ఇప్పటి వరకు కెనడా భారత్ ను సంప్రదించలేదు. వారికి కావలసినంత భారీ మొత్తం వ్యాక్సీన్ సరపరా చేయగల దేశం భారత్ మాత్రమే. వేరే ప్రత్యామ్నాయం లేదు. కాని అడగక పోవటానికి కారణం కెనడా ప్రధానికి మొఖం చెల్లట్లేదు - అందుకే చాటేస్తున్నారు అని అర్ధమౌతుంది.
రైతు ఉద్యమం విషయంలో భారత అంతర్గత వ్యవహారాలపై "ప్రశాంత ఉద్యమాల విషయంలో భారత రైతులకు ఎప్పుడూ తాము వెన్ను దన్నుగా ఉంటామని" వ్యాఖ్య చేసి,  భారత అంతర్గత వ్యవహారాలలో తల దూర్చిన కెనడా పిఎం జస్టిన్ ట్రూడో కు భారత పీఎంతో మాట్లాడటం కొంచెం కష్టమే మరి.


అయితే ఈ విషయాన్ని కెనడా అట్టావ అధికారులతో భారత న్యూడిల్లీ అధికారులు చూసుకుంటున్నారు. అయినా ఇలాంటి వ్యాఖ్యలు భారత అంతర్గత వ్యవహారాలలొ కలగజేసుకోవటమే. అలాంటివి తగవని, అంగీకారయోగ్యం కావని, ఇరుదేశాల సంబంధాలు సమస్యల్లో పడతాయని ఖచ్చితంగా తెలియజేసింది.


ఎన్ని విభేదాలున్నా భారత ప్రధాని వ్యాక్సీన్ సరపరా విషయంలో భేదభావాలు చూపరని బహుశ కెనడా గ్రహించక పోయి ఉండొచ్చు. అసలు విషయమేమంటే కెనడాలో సంఖ్యాపరంగా  రెండవ అతి పెద్ద జనాభా భారతీయులు ముఖ్యంగా శిక్కులు. వారి పార్లమెంట్ లో శిక్కుల ప్రజా ప్రాతినిధ్యమూ ఎక్కువే. ట్రూడో వ్యాఖ్యలు ఓట్ల కోసం శిక్కు జనాభాను ఆకర్షించే ఎన్నికల స్టంట్ మాత్రమేనని అందరికి తెలుసు.


అంతేకాదు కేనడా శిక్కు సంస్థలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తల నుండి అతిపెద్ద మొత్తంలో డబ్బు, భారత రైతు ఉద్యమ నిర్వహణకు అందుతుందని సమాచారం. లేకుంటే రాకేష్ తికాయత్  లాంటి వాళ్ళకు, సాధారణ రైతులు అయితే "80 కోట్ల రూపాయల సంపద" ఎలా ఒనగూరుతుంది. ఖచ్చితంగా విదేశీ శక్తులు ఉద్యమ బ్రోకర్ల వెనక ఉండి నడిపిస్తున్నారనేది జగమెరిగిన సత్యం. భారత్ ను బలహీన పరచే కుట్ర మాత్రమే రైతు ఉద్యమం. పంజాబులో వ్యవసాయం ఒక వ్యాపారం.


చిరుదాన్యాలు, వివిధ రకాల బఠాణి మనకు కెనడా శిక్కు వ్యవసాయ వాణిజ్యక్షెత్రాల నుండి భారత్ కు ఎగుమతి చేస్తారు. వీటి ఆర్డర్లు, సరపరా, పంపిణీ వ్యవహారాలన్ని రాకెష్ తికాయత్ లాంటి బ్రోకర్లు నిర్వహిస్తారు. ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమంతో వారి ఎగుమతులకు శాశ్వతంగా గండిపడే పరిస్థితులు రానున్నాయి.


అందుకే పంజాబి రైతు ఉద్యమం. అంతే కాదు వివిధ దశల్లో ప్రభుత్వం చర్చల ఫలితంగా ఒక సంవత్సరం, సంవత్సరమునర పాటు రైతు చట్టాల అమలు ఆపేసి చూద్దామన్నా కూడా తగ్గని రాకేష్ తికాయత్ బృంధ వాదన సమంజసమా? న్యాయస్థాన కమిటీలను కాదనే, బికెయు వాదన దేశానికి ప్రయోజనమేనా? రైతుల పేరుతో ఈ విదేశీ ఆధారిత రైతు బ్రోకర్లతో సంప్రదింపులు జరపడం  దేశానికి మేలు చేసేదేనా? అది భారత్ గ్రహించాలి. అయినా ఎంతకాలం బ్రిటీష్ చట్టాలను మనం భరించాలి? ఇవీ సమాధానం రాబట్టల్సిన ప్రశ్నలు.





మెగా డెబ్యూలో ది బెస్ట్ ఎవరో తేలిపోయిందా?

రేవంత్ రెడ్డి హఠాత్తుగా ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు ?.. అసలు కారణం అదేనా..?

స్టార్ హీరోలను ఢీ కొట్టిన కమెడియన్...?

అప్పట్లో కన్నీళ్లు తెప్పించి, కాసుల వర్షం కురిపించిన సినిమా ఏంటో తెలుసా...!

నిహారిక పెళ్ళితో సాయి ధరమ్ తేజ్ కు ఒత్తిడి !

ఏపీ పంచాయతీ ఎన్నికల్లోనే అది రికార్డు విజయం..

జగడ్డ : రెండో విడతలోనూ ఎవరి లెక్కలు వారివే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Parisa Rama Krishna Rao]]>