Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/rohit-sharma-centuries-for-his-wifee140479b-90c1-470d-8cd6-90daf6bab819-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/rohit-sharma-centuries-for-his-wifee140479b-90c1-470d-8cd6-90daf6bab819-415x250-IndiaHerald.jpg‘పట్టు చిక్కే వరకే కష్టం.. ఒక్కసారి చిక్కిందో.. ఇక ఆపడం ఎవరి తరం కాదు..’ టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకు ఈ డేలాగ్ సరిగ్గా సరిపోతుందేమో. మరీ ముఖ్యంగా గ్యాలరీలో తన భార్య రితికా సజ్‌దేహ్‌ ఉన్నారంటే ఇక రోహిత్ ఆపడం ప్రత్యర్థులకు కష్టమే. బౌలర్లకు బౌండరీలతో చుక్కలు చూపిస్తాడు. గ్రౌండ్‌లో పరుగుల..rohit sharma;ali;rohit;mumbai;patti;twitter;wife;international;paruguహిట్ మ్యాన్ సీక్రెట్ ఇదే.. భార్య కోసమే భారీ సెంచరీలు..!హిట్ మ్యాన్ సీక్రెట్ ఇదే.. భార్య కోసమే భారీ సెంచరీలు..!rohit sharma;ali;rohit;mumbai;patti;twitter;wife;international;paruguSun, 14 Feb 2021 12:57:00 GMTఇంటర్నెట్ డెస్క్: ‘పట్టు చిక్కే వరకే కష్టం.. ఒక్కసారి చిక్కిందో.. ఇక ఆపడం ఎవరి తరం కాదు..’ టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకు ఈ డేలాగ్ సరిగ్గా సరిపోతుందేమో. మరీ ముఖ్యంగా గ్యాలరీలో తన భార్య రితికా సజ్‌దేహ్‌ ఉన్నారంటే ఇక రోహిత్ ఆపడం ప్రత్యర్థులకు కష్టమే. బౌలర్లకు బౌండరీలతో చుక్కలు చూపిస్తాడు. గ్రౌండ్‌లో పరుగుల వరద పారిస్తాడు. టెస్టు అయినా, వన్డే మ్యాచ్ అయినా.. తనకు తేడా లేదంటూ.. బ్యాటుకు పనిచెబుతాడు. సెంచరీలు బాదేస్తాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు 40 శతకాలు సాధించిన రోహిత్.. అందులో నాలుగు భారీ శతకాలు మాత్రం తన భార్యకు ఇచ్చిన స్వీట్ గిఫ్ట్‌లుగా చెప్పుకోవచ్చు. ప్రత్యేక సందర్భాల్లో హిట్‌మ్యాన్‌ సాధించిన ఈ సెంచరీలు తన భార్యకు ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలనడంలో ఎలాంటి అనుమానం లేదు.

2017లో తమ వెడ్డింగ్ డే సందర్భంగా రోహిత్‌(208) శ్రీలంకపై వన్డేల్లో మూడోసారి డబుల్ సెంచరీ బాదాడు. అదే ఏడాది ఆమె పుట్టినరోజు సందర్భంగా లంకతోనే జరిగిన మరో వన్డేలో సెంచరీ కొట్టాడు. ఇక 2018లో ‘వాలెంటైన్స్‌ డే’ సందర్భంగా దక్షిణాఫ్రికాపై వన్డేలో శతకం బాదిన రోహిత్.. తాజాగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులోనూ వ్యాలెంటైన్స్ డే రోజునే.. భారీ శతకం ‌161 సాధించాడు. దీంతో రెండోసారి ‘వాలెంటైన్స్‌ డే’ శతకం బాదిన హిట్ మ్యాన్.. తన భార్యకు మొత్తంగా నాలుగోసారి సూపర్ గిఫ్ట్స్ ఇచ్చాడు. ఈ విషయాలను ముంబయి ఇండియన్స్‌ ఫ్రాంఛైజీ ఈ తన ట్విటర్‌లో పంచుకొని సంతోషం వ్యక్తం చేసింది.

ఇక తొలి రోజు టీమ్‌ఇండియా 86 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన స్థితిలో రోహిత్‌ ఆపద్బాంధవుడిలా మారాడు. రహానె(67)తో కలిసి నాలుగో వికెట్‌కు 162 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలోనే 130 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న రోహిత్.. చివరికి జాక్‌లీచ్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద మోయిన్‌ అలీ చేతికి చిక్కాడు. టెస్టుల్లో రోహిత్‌కిది ఏడో సెంచరీ కాగా.. ఈ సెంచరీలన్నీ భారత్‌లో సాధించినవే కావడం గమనార్హం.
" draggable="true">







పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు ను ఇలా తగ్గించుకోవచ్చు..!

జగడ్డ: కృష్ణా జిల్లాలో రగడ దేనికి సంకేతం...?

హీరోయిన్ కాబోతున్న తెలుగు టిక్ టాక్ స్టార్

సింగర్ సునీతను రామ్ రెండో పెళ్లికి ఎలా ఒప్పించాడో తెలుసా..??

హమ్మా..ఈ తెలుగు అందం మెల్లిగా సెటిల్ అయిపోతుందిగా.?

షాకింగ్ రోల్ లో శ్రియ...తట్టుకోగలరా..?

బాబు వైఖ‌రి ఇలా ఉంటే క‌ష్ట‌మే.. త‌ల ప‌ట్టుకుంటోన్న త‌మ్ముళ్లు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>