PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/panchayat-elections0c3c2d91-d99b-4026-8c0f-91cb455c2e22-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/panchayat-elections0c3c2d91-d99b-4026-8c0f-91cb455c2e22-415x250-IndiaHerald.jpgఆంద్ర ప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల సమరం హోరాహోరీగా సాగుతుంది. పల్లె పోరే అయినప్పటికి సార్వత్రిక ఎన్నికల వలే ప్రధాన రాజకీయ పార్టీలు రాజకీయ వేడిని రాజేస్తున్నాయి. ఇకా తొలి దశలో వైసీపీ హవా కొనసాగించినప్పటికి కొన్ని చోట్ల టి‌డి‌పి, జనసేన పార్టీలు కూడా గట్టిగానే పోటీ ఇచ్చాయి. ఇక రెండవ దశ ఎన్నికల్లో 539 చోట్ల సర్పంచి పదవులు ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. దాంతో రెండో విడతలో 2,786 పంచాయతీలు, 20,817 వార్డులకు పోలింగ్‌ జరిగింది.panchayat elections;bharatiya janata party;janasena;panchayati;mla;letter;tdp;ycp;janasena partyపల్లె పోరు : వైసీపీ కి గట్టి షాక్ ఇచ్చిన కోడుమూరు!!పల్లె పోరు : వైసీపీ కి గట్టి షాక్ ఇచ్చిన కోడుమూరు!!panchayat elections;bharatiya janata party;janasena;panchayati;mla;letter;tdp;ycp;janasena partySun, 14 Feb 2021 19:00:00 GMT ఆంద్ర ప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల సమరం హోరాహోరీగా సాగుతుంది. పల్లె పోరే అయినప్పటికి సార్వత్రిక ఎన్నికల వలే ప్రధాన రాజకీయ పార్టీలు రాజకీయ వేడిని రాజేస్తున్నాయి. ఇకా తొలి దశలో వైసీపీ హవా కొనసాగించినప్పటికి కొన్ని చోట్ల టి‌డి‌పి, జనసేన పార్టీలు కూడా గట్టిగానే పోటీ ఇచ్చాయి. ఇక రెండవ దశ ఎన్నికల్లో  539 చోట్ల సర్పంచి పదవులు ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. దాంతో రెండో విడతలో 2,786 పంచాయతీలు, 20,817 వార్డులకు పోలింగ్‌ జరిగింది.

 రెండవ దశ ఫలితాల విషయానికొస్తే  వైసీపీ తరుపున బరిలోకి దిగిన సర్పంచ్‌ అభ్యర్థులు 2,471 మంది విజయం సాధించగా, టీడీపీ మద్దతు దారులు 523 చోట్ల విజయ కేతనం ఎగుర వేశారు . బీజేపీ, జనసేన మద్దతుదారులు 45 చోట్ల గెలుపొందగా ఇతరులు 90 చోట్ల గెలుపొంది తమ సత్తా నిరూపించుకున్నారు. పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలే అయినప్పటికి ప్రధాన పార్టీలు గెలుపు తమదంటే తమది అంటూ పరస్పర సవాళ్ళతో హోరెత్తిస్తున్నాయి. అయితే కొన్ని చోట్ల అధికార వైసీపీ కి మాత్రం గట్టి షాకే తగిలింది. ముఖ్యంగా ముఖ్యంగా వైసీపీ కి అడ్డా ఉండే కర్నూలు జిల్లాలో పలు చోట్ల వైసీపీ ఘోర పరాజయం పాలైంది.

 ముఖ్యంగా కోడుమూరు మేజర్‌ గ్రామపంచాయతీలో వైసీపీకి గట్టి షాక్‌ తగిలింది. ఇక్కడ వైసీపీ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి బలపర్చిన అభ్యర్థి కె.శారదమ్మపై టీడీపీ మద్దతు అభ్యర్థి భాగ్యరత్న 672 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. కోడుమూరులో 19,204 మంది ఓటర్లు ఉండగా 13,780 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీడీపీ మద్దతు అభ్యర్థి భాగ్యరత్నకు 6153 ఓట్లు, వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హర్షవర్థన్‌రెడ్డి మద్దతుతో పోటీ చేసిన కె.శారదమ్మకు 5481 ఓట్లు, ఎమ్మెల్యే సుధాకర్‌ మద్దతుతో పోటీ చేసిన సుశీలకు 1137 ఓట్లు, బీజేపీ మద్దతుతో పోటీ చేసిన ఉమామహేశ్వరమ్మకు 124 ఓట్లు పోలయ్యాయి. 885 మంది నోటాకు ఓటు వేశారు. .


సంచలనం... ఏపీలో జగన్ పెట్రోల్ ధరలు తగ్గిస్తారా...?

స్టార్ హీరో అయ్యాక అబ్బాస్ పెట్రోల్ బంక్ లో ఎందుకు పని చేయాల్సి వచ్చింది

మూడు వారాల గ్యాప్ లో ... మూడు సునామీలు ....బాక్సాఫీస్ రచ్చ రచ్చే .... ??

RC15 కి మ్యూజిక్ డైరెక్టర్ అతనేనా?

హమ్మా.. మళ్లీ మెగాస్టార్ సరసన ఈ బ్యూటీ ఛాన్స్ కొట్టేసిందిగా..

జగడ్డ: కృష్ణా జిల్లాలో రగడ దేనికి సంకేతం...?

హీరోయిన్ కాబోతున్న తెలుగు టిక్ టాక్ స్టార్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>