PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/panchayth-election9b49dbc3-6fcc-4fb5-b7c4-7ab2cf11890f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/panchayth-election9b49dbc3-6fcc-4fb5-b7c4-7ab2cf11890f-415x250-IndiaHerald.jpgఅధికార పార్టీ నేతలకు మద్దతుగా పోలీసు అధికారులు.. పోటీలో ఉన్న ఇతర పార్టీల అభ్యర్థులను బెదిరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. చివరికి వైసీపీ నుంచి రెబెల్ గా పోటీ చేసిన వారిని కూడా వేధిస్తున్నారని తెలుస్తోంది. తాజాగా గుంటూరు జిల్లా రొంపిచెర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్, వైసీపీ సీనియర్ నేత.. సీఎం జగన్మోహన్ రెడ్డికి పంపిన సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది.panchayth election;lakshmi;andhra pradesh;district;police;panchayati;mla;wife;lakshmi devi;vegetable market;narasaraopet;ycp;petta;srinivasa reddy gopireddy;partyతుపాకీ పెట్టి బెదిరించిన సీఐ!తుపాకీ పెట్టి బెదిరించిన సీఐ!panchayth election;lakshmi;andhra pradesh;district;police;panchayati;mla;wife;lakshmi devi;vegetable market;narasaraopet;ycp;petta;srinivasa reddy gopireddy;partySat, 13 Feb 2021 19:31:00 GMTఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. అయితే పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ప్రజా ప్రతినిధుల బెదిరింపుల మాత్రం ఆగడం లేదని తెలుస్తోంది. అధికార పార్టీ నేతలకు మద్దతుగా పోలీసు అధికారులు.. పోటీలో ఉన్న ఇతర పార్టీల అభ్యర్థులను బెదిరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. చివరికి వైసీపీ నుంచి రెబెల్ గా పోటీ చేసిన వారిని కూడా వేధిస్తున్నారని తెలుస్తోంది.  తాజాగా గుంటూరు జిల్లా రొంపిచెర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్, వైసీపీ సీనియర్ నేత..  సీఎం జగన్మోహన్ రెడ్డికి పంపిన  సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది.

           రొంపిచెర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ అంజయ్య... గోగులపాడు వైసీపీ సర్పంచ్ గా పోటీ చేయాలని భావించారు. అయితే ఎమ్మెల్యే గోపిరెడ్డి మాత్రం...మరొకరిని బరిలో నిలిపారు. దీంతో గోగులపాడులో వైసీపీ రెబల్ అభ్యర్థిగా అంజయ్య  పోటీ చేస్తున్నారు. పోటీ నుంచి తప్పుకోవాలని అంజయ్యను.. ఎమ్మెల్యే కోరినా పట్టించుకోలేదు. దీంతో అతనిపై బెదిరింపులకు దిగారని చెబుతున్నారు. సీఐ కృష్ణయ్య తుపాకీ పెట్టి చంపుతానని బెదిరించాడని ఆరోపిస్తూ సీఎం జగన్‌కు రొంపిచెర్ల మార్కెట్ యార్డు ఛైర్మన్ అంజయ్య సెల్ఫీ వీడియో పంపారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి టీడీపీకి పని చేసిన వారిని గోగులపాడు సర్పంచ్‌గా నిలబెట్టారని... తొలి నుంచి వైసీపీలో ఉన్న తాము కూడా పోటీకి దిగామని తెలిపారు. పోటీ నుంచి తప్పుకోవాలని సీఐ కృష్ణయ్యతో ఎమ్మెల్యే గోపిరెడ్డి వేధించారని వాపోయారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి, సీఐ కృష్ణయ్య నుంచి తమ కుటుంబాన్ని కాపాడాలని వేడుకుంటూ అంజయ్య వీడియోలో సీఎం జగన్‌ను వేడుకున్నారు.


    అంతేకాదు గోగులపాడు వైసీపీ సర్పంచ్ రెబల్ అభ్యర్థిగా అంజయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేనల్లుడు లక్ష్మీ నారాయణ రాజకీయ వత్తిడితో తన భర్తని  నరసరావుపేట టూ టౌన్ సీఐ కృష్ణయ్య తీసుకెళ్లారని అంజయ్య భార్య లక్ష్మీ ఆరోపిస్తున్నారు. అయితే  సమయం ముగిసినా అంజయ్య ప్రచారం చేయడంతో అదుపులోకి తీసుకున్నామని  రొంపిచర్ల పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో అంజయ్య సెల్ఫీ వీడియో వైరల్‌గా మారింది.






షాకింగ్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కమ్మ సామాజిక వర్గ నేత...?

రీ ఎంట్రీ కి సిద్ధమైన స్టార్ హీరో భార్య..

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఊపేసిన ఫ్యాన్..!

రెండవ పెళ్ళికి సిద్దమైన బాలీవుడ్ హాట్ హీరోయిన్...

వ‌ర్క‌వుట్ కాని.. బాబు.. `ఆందోళ‌న`‌.. రెండో విడ‌త దారుణం..!

బ్రేకింగ్‌: నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక‌.. టీడీపీ అభ్య‌ర్థి ఖ‌రారు

కొడాలి ఇలాకాలో ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ... వింత గెలుపు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>