EditorialVijayaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/is-naidu-shocked-nimmagadda-by-complying-to-center4f92ccbd-43a3-452a-8f73-1c0267a36576-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/is-naidu-shocked-nimmagadda-by-complying-to-center4f92ccbd-43a3-452a-8f73-1c0267a36576-415x250-IndiaHerald.jpgఅయితే ఇప్పటి పంచాయితి ఎన్నికల మొదటి విడత ఎన్నికలు పూర్తవ్వగానే నిమ్మగడ్డ విషయంలో చంద్రబాబు వైఖరి ఒక్కసారిగా మారిపోయింది. ఎన్నికల నిర్వహణలో నిమ్మగడ్డ ఫెయిల్యూర్లపై చంద్రబాబు నిప్పులు చెరుగుతున్నారు. నిమ్మగడ్డ చేతకానితనం వల్లే వైసీపీ రెచ్చిపోతోందంటు మండిపోయారు. తాము ఎన్ని ఫిర్యాదులు చేసినా కమీషనర్ పట్టించుకోలదంటు నానా మాటలన్నారు. ఇందుకు కారణాలు ఏమిటయ్యా అని ఆరాతీస్తే మొదటి విడత ఎన్నికల్లో సొంత జిల్లా చిత్తూరులో 112 పంచాయితీలు ఏకగ్రీవంగా వైసీపీ మద్దతుదారుల ఖాతాలో పడ్డాయి. ఇదికాకుండా ఎన్నికలు జరిగిchandrababu nimmagadda amitshah modi cec sec jagan;cbn;kumaar;district;chittoor;government;chittor;fire;central government;ycpహెరాల్డ్ ఎడిటోరియల్ : నిమ్మగడ్డకే చంద్రబాబు షాకిచ్చాడా ?హెరాల్డ్ ఎడిటోరియల్ : నిమ్మగడ్డకే చంద్రబాబు షాకిచ్చాడా ?chandrababu nimmagadda amitshah modi cec sec jagan;cbn;kumaar;district;chittoor;government;chittor;fire;central government;ycpSat, 13 Feb 2021 05:00:00 GMTచంద్రబాబునాయుడు వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. అవసరమైనపుడు వాడుకోవటం తర్వాత తీసి అవతల పారేయటం ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి బాగా అలవాటే. ఈ విషయం స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో మరోసారి రుజువైంది.  ఇంతకీ విషయం ఏమిటంటే నిమ్మగడ్డ అసమర్ధుడని, ఎన్నికలను సజావుగా నిర్వహించటంలో ఫెయిలయ్యారంటు ఏకంగా రాష్ట్రపతి, కేంద్ర ఎన్నికల కమీషన్, కేంద్ర హోంశాఖ మంత్రికే ఫిర్యాదులు చేయటం. నిన్నటి వరకు చంద్రబాబు+నిమ్మగడ్డ ఒకటే అన్నట్లుగా ఉండేవారు.  పోయిన ఏడాది మార్చిలో స్ధానికసంస్ధల ఎన్నికల ప్రక్రియ మొదలైన దగ్గర నుండి ఇద్దరిదీ ఒకటే మాట ఒకటే బాటగా ఉందన్న విషయం అందరికీ తెలిసిందే.




అయితే ఇప్పటి పంచాయితి ఎన్నికల మొదటి విడత ఎన్నికలు పూర్తవ్వగానే నిమ్మగడ్డ విషయంలో చంద్రబాబు వైఖరి ఒక్కసారిగా మారిపోయింది. ఎన్నికల నిర్వహణలో నిమ్మగడ్డ ఫెయిల్యూర్లపై చంద్రబాబు నిప్పులు చెరుగుతున్నారు. నిమ్మగడ్డ చేతకానితనం వల్లే వైసీపీ రెచ్చిపోతోందంటు మండిపోయారు. తాము ఎన్ని ఫిర్యాదులు చేసినా కమీషనర్ పట్టించుకోలదంటు నానా మాటలన్నారు. ఇందుకు కారణాలు ఏమిటయ్యా అని ఆరాతీస్తే మొదటి విడత ఎన్నికల్లో సొంత జిల్లా  చిత్తూరులో 112 పంచాయితీలు ఏకగ్రీవంగా వైసీపీ మద్దతుదారుల ఖాతాలో పడ్డాయి. ఇదికాకుండా ఎన్నికలు జరిగిన పంచాయితీల్లో కూడా అత్యధికం వైసీపీ మద్దతుదారులే గెలిచారు. దీన్ని చంద్రబాబు అవమానంగా భావించినట్లున్నారు.




చిత్తూరు, గుంటూరు జిల్లాల్లోని ఏకగ్రీవ ఫలితాలను ప్రకటించవద్దని ముందు చెప్పిన నిమ్మగడ్డ రెండు రోజుల తర్వాత వాటికి ఓకే చెప్పేశారు. దాంతో అప్పటి నుండి చంద్రబాబు మండిపోతున్నారు. అంతకుముందు ప్రభుత్వానికి నిమ్మగడ్డ మధ్య వివాదాలు రేగినపుడు చంద్రబాబు కమీషనర్ కే మద్దతుగా నిలబడ్డారు. తప్పు కమీషనర్ దే అయినా చంద్రబాబు మాత్రం ప్రభుత్వంపైనే ఆరోపణలు చేశారు. అలాంటిది ఇపుడు హఠాత్తుగా ఎన్నికల నిర్వహణపై రెచ్చిపోవటంతో పాటు ఏకంగా రాష్ట్రపతి, కేంద్రఎన్నికల కమీషనర్, కేంద్రహోంశాఖ మంత్రికి ఫిర్యాదులు చేయటమంటే నిమ్మగడ్డకు షాక్ కొట్టినట్లే లెక్క. సరే చంద్రబాబు ఫిర్యాదుతో ఏమవుతుందన్నది వేరే సంగతి. ఏదేమైనా నిమ్మగడ్డకు చంద్రబాబు ఫిర్యాదు చేయటమే ఆశ్చర్యంగా ఉంది.




మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..

శ్రీరామ రాజ్యం చిన్నారి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>