SatireVijayaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/nimmagadda-cs-dgp-panchayat-elections-jagan-naidu3443ac67-7cef-41bc-9769-d234ae136a40-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/nimmagadda-cs-dgp-panchayat-elections-jagan-naidu3443ac67-7cef-41bc-9769-d234ae136a40-415x250-IndiaHerald.jpgసీన్ కట్ చేస్తే మొదటివిడత పంచాయితి ఎన్నికల నిర్వహణలో నిమ్మగడ్డ ఫెయిలయ్యారంటు చంద్రబాబునాయుడు మండిపోతున్నారు. నిమ్మగడ్డ అసమర్ధుడని, ప్రభుత్వానికి భయపడుతున్నారని రెచ్చిపోతున్నారు. నిమ్మగడ్డకు వ్యతిరేకంగా రాష్ట్రపతి, కేంద్ర ఎన్నికల కమీషనర్, కేంద్ర హోంశాఖ మంత్రికి చంద్రబాబు వరుసబెట్టి ఫిర్యాదులు చేశారు. మొదటివిడత ఎన్నికలు ప్రశాతంగా, సజావుగా జరిగిందని నిమ్మగడ్డ చీఫ్ సెక్రటరి, డీజీపీలను అభినందించటం మరీ విచిత్రం. ఇదే స్పూర్తితో మిగిలిన ఎన్నికలను కూడా నిర్వహించాలని నిమ్మగడ్డ కోరటమే చంద్రబాబు మంటకు కారణమnimmagadda cs dgp panchayat elections jagan naidu;cbn;amala akkineni;kumaar;shatru;fire;central governmentహెరాల్డ్ సెటైర్ : నిమ్మగడ్డకు ప్రభుత్వానికి మధ్యే అసలేం జరుగుతోంది ?హెరాల్డ్ సెటైర్ : నిమ్మగడ్డకు ప్రభుత్వానికి మధ్యే అసలేం జరుగుతోంది ?nimmagadda cs dgp panchayat elections jagan naidu;cbn;amala akkineni;kumaar;shatru;fire;central governmentSat, 13 Feb 2021 07:00:00 GMTక్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మితృలుండరనే నానుడి కాస్త అటుఇటుగా ప్రభుత్వం-నిమ్మగడ్డ-చంద్రబాబునాయుడు విషయంలో నిజమవుతోందా ? తాజాగా జరిగిన డెవలప్మెంట్ ఏమిటంటే చీఫ్ సెక్రటరీ, డీజీపీలు స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పంచాయితి ఎన్నికలు ముగియగానే పెండింగ్ లో ఉన్న జడ్టీటీసీ, ఎంపిటీసీ ఎన్నికలను, తర్వాత మున్సిపల్ ఎన్నికలను కూడా నిర్వహించేయాలంటు ప్రతిపాదన పెట్టారు. మొన్నటి వరకు నిమ్మగడ్డ పదవిలో ఉన్నంతవరకు ఎన్నికలను నిర్వహించేదే లేదన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరించిన విషయం తెలిసిందే.




సీన్ కట్ చేస్తే మొదటివిడత పంచాయితి ఎన్నికల నిర్వహణలో నిమ్మగడ్డ ఫెయిలయ్యారంటు చంద్రబాబునాయుడు మండిపోతున్నారు. నిమ్మగడ్డ అసమర్ధుడని, ప్రభుత్వానికి భయపడుతున్నారని రెచ్చిపోతున్నారు. నిమ్మగడ్డకు వ్యతిరేకంగా రాష్ట్రపతి, కేంద్ర ఎన్నికల కమీషనర్, కేంద్ర హోంశాఖ మంత్రికి చంద్రబాబు వరుసబెట్టి ఫిర్యాదులు చేశారు. మొదటివిడత ఎన్నికలు ప్రశాతంగా, సజావుగా జరిగిందని నిమ్మగడ్డ చీఫ్ సెక్రటరి, డీజీపీలను అభినందించటం మరీ విచిత్రం. ఇదే స్పూర్తితో మిగిలిన ఎన్నికలను కూడా నిర్వహించాలని నిమ్మగడ్డ కోరటమే చంద్రబాబు మంటకు కారణమైపోయింది.




ఒకవైపు ఎన్నికల్లో అరాచకాలు జరిగాయని చంద్రబాబు ప్రభుత్వం మండిపోతుంటే నిమ్మగడ్డ మాత్రం ఎన్నికల ప్రశాంతంగా జరిగిందని కితాబు ఇచ్చారంటే దేనికి సంకేతాలు. నిమ్మగడ్డతో భేటి సందర్భంగా పెండింగ్ లో ఉన్న ఎన్నికలను కూడా నిర్వహించేస్తే సంక్షేమ పథకాల అమలుకు ఇబ్బందులుండవని చీఫ్ సెక్రటరీ చెప్పారు. ఆ విషయంలో తొందరలోనే నిర్ణయం తీసుకుంటానని నిమ్మగడ్డ బదులివ్వటంతో చంద్రబాబు రగిలిపోతున్నారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే ఇంతకాలం ఉప్పు-నిప్పుగా ఉన్న ప్రభుత్వం, నిమ్మగడ్డ మధ్య సయోధ్య కుదరటం. అలాగే ఒకేమాట, ఒకేబాటగా ఉన్న నిమ్మగడ్డపైనే చంద్రబాబు మండిపోతు కేంద్రానికి ఫిర్యాదులు చేయటం ఆశ్చర్యంగా ఉంది. తాజాగా చీఫ్ సెక్రటరీ ప్రతిపాదన చూసిన తర్వాత నిమ్మగడ్డపై ప్రభుత్వానికి నమ్మకం పెరిగిపోతోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.




రెండో దశ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం.. ఎక్కడెక్కడ అంటే..?

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>