Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/rohit-sharma493cfe7b-e920-42c1-a9cc-d9d8bd63887a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/rohit-sharma493cfe7b-e920-42c1-a9cc-d9d8bd63887a-415x250-IndiaHerald.jpg ఆసీస్ సిరీస్‌లో చివరి రెండు టెస్టుల్లో ఆడినా.. అంతగా రాణిచలేదు. చెప్పుకొదగిన స్కోర్లు చేయలేదు. ఇంగ్లండ్‌తో స్వదేశంలో ఇటీవల జరిగిన టెస్టు మ్యాచ్‌లోనూ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో అసలు జట్టులో స్థానం ఉంటుందా..? లేదా..? అనే విషయంలోనే నీలినీడలు కమ్ముకున్నాయి. ఇలాంటి తరుణంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ..rohit sharma;rani;rohit;virat kohli;audi;rohit sharma;kamma;media;chennai;paruguరోహిత్ హిట్.. సెంచరీతో సూపర్ హిట్రోహిత్ హిట్.. సెంచరీతో సూపర్ హిట్rohit sharma;rani;rohit;virat kohli;audi;rohit sharma;kamma;media;chennai;paruguSat, 13 Feb 2021 13:32:58 GMTచెన్నై: ఆసీస్ సిరీస్‌లో చివరి రెండు టెస్టుల్లో ఆడినా.. అంతగా రాణిచలేదు. చెప్పుకొదగిన స్కోర్లు చేయలేదు. ఇంగ్లండ్‌తో స్వదేశంలో ఇటీవల జరిగిన టెస్టు మ్యాచ్‌లోనూ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో అసలు జట్టులో స్థానం ఉంటుందా..? లేదా..? అనే విషయంలోనే నీలినీడలు కమ్ముకున్నాయి. ఇలాంటి తరుణంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తనేంటో నిరూపించుకున్నాడు. మరోసారి సెంచరీతో సత్తాచాటి తన బ్యాట్ పవర్ ఏంటో నిరూపించాడు.  బ్యాట్స్‌మన్‌గా హిట్ కావడమే కాకుండా.. సెంచరీతో సూపర్ హిట్ అనిపించుకున్నాడు.

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ సెంచరీతో అదరగొట్టాడు. కేవలం 130 బంతుల్లోనే సెంచరీ సాధించి తన బ్యాటింగ్ సత్తా ఏంటో చాటి చెప్పాడు. ఈ సెంచరీతో జట్టు వైస్ కెప్టెన్ ఆజింక్య రహానే నమ్మకాన్ని కూడా రోహిత్ నిలబెట్టాడు. శుక్రవారం జరిగిన ఓ మీడియా సమావేశంలో రోహిత్ శర్మను రహానే వెనకేసుకొచ్చాడు.

నాలుగైదు ఇన్నింగ్స్‌ చూసి ఆటగాడి సత్తాను అంచనా వేయలేమని, అది సరైన చర్య కూడా కాదని, రోహిత్ మంచి ఆటగాడని, అతడు అద్భుతంగా ఆడగలడన్న నమ్మకం తనకుందని రహానే అన్నాడు. రహానే ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే రోహిత్ సెంచరీతో అదరగొట్టడం, అది కూడా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ధాటిగా ఆడి సెంచరీ సాధించడం.. అభిమానుల్లో ఎక్కడలేని ఆనందాన్ని కలిగిస్తోంది.

ఇదిలా ఉండే రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభంలోనే టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్(0) డకౌట్‌గా వెనుదిరిగడంతో బాధ్యతంగా రోహిత్‌పై పడింది. అయితే రోహిత్ మునుపటిలా కాకుండా ఆచి తూచి ఆడుతూనే బౌండరీలు రాబట్టాడు. ఇక ఛతేశ్వర్ పుజారా(21) కూడా ఈ మ్యాచ్‌లో అంతగా రాణించలదు. కెప్టెన్ కోహ్లీ కూడా ఈ మ్యాచ్‌లో దారుణంగా డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో లంచ్ సమయానికి టీమిండియా స్కోరు 106 పరుగులకు 3 వికెట్లతో కష్టాల్లో నిలిచింది. అయితే లంచ్ తర్వాత రోహిత్, రహానే ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపిస్తున్నారు.


మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..

శ్రీరామ రాజ్యం చిన్నారి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>