Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rahul-gandhif9eae475-9365-4736-b785-aefed015ec0a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rahul-gandhif9eae475-9365-4736-b785-aefed015ec0a-415x250-IndiaHerald.jpgకాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ భూకంపంలో చిక్కుకున్నారు. ఆయన ఇంట్లో ఉండగానే భూకంపం రావడంతో వస్తువులన్నీ కదిలాయి. ఈ విషయాన్ని రాహుల్ గాంధీనే స్వయంగా వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారత్‌లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి భూమి..rahul gandhi;allu aravind;chakravarthy;rahul new;rahul;delhi;k l rahul;rahul gandhi;himachal pradesh;jammu and kashmir - srinagar/jammu;mohandas karamchand gandhi;arvind kejriwal;omar abdullah;congress;capital;chief minister;job;rahul sipligunj;central government;earhquake;punjab;paruguభూకంపంలో చిక్కుకున్న రాహుల్ గాంధీ.. ఇంట్లో వస్తువులన్నీ కదలడంతో..భూకంపంలో చిక్కుకున్న రాహుల్ గాంధీ.. ఇంట్లో వస్తువులన్నీ కదలడంతో..rahul gandhi;allu aravind;chakravarthy;rahul new;rahul;delhi;k l rahul;rahul gandhi;himachal pradesh;jammu and kashmir - srinagar/jammu;mohandas karamchand gandhi;arvind kejriwal;omar abdullah;congress;capital;chief minister;job;rahul sipligunj;central government;earhquake;punjab;paruguSat, 13 Feb 2021 14:55:21 GMTన్యూఢిల్లీ: కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ భూకంపంలో చిక్కుకున్నారు. ఆయన ఇంట్లో ఉండగానే భూకంపం రావడంతో వస్తువులన్నీ కదిలాయి. ఈ విషయాన్ని రాహుల్ గాంధీనే స్వయంగా వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారత్‌లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి భూమి కంపించింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో రాహుల్ గాంధీ నివశిస్తున్న ప్రాంతంలో కూడా భూమి కంపించింది. ఆ సమయంలో రాహుల్ తన ఇంట్లోనే ఉన్నారట.

చరిత్రకారుడు దీపేశ్ చక్రవర్తి, చికాగో యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ చదువుతున్న ఓ విద్యార్థినితో రాహుల్ గాంధీ శుక్రవారం ఆన్‌లైన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతున్న సమయంలోనే.. రాహుల్ ఇంటి పరిసరాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఆ ప్రకంపనలను గుర్తించిన రాహుల్.. వీడియోలో మాట్లాడుతూనే ఆ విషయాన్ని ప్రస్తావించారు. ‘భూమి కంపిస్తున్నట్లుంది. గది మొత్తం కదులుతోంది’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ క్లిప్ విపరీతంగా వైరల్ అవుతోంది.

ఇదిలా ఉంటే తజకిస్థాన్‌ కేంద్రంగా ఈ భూకంపం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం అర్థ రాత్రి సమయంలో తజికిస్తాన్‌లో ఈ భూకంపం సంభవించినట్లు తెలిపారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైందని, ఆ భూకంపం ప్రభావమే మన దేశంపై కూడా పడిందని వెల్లడించారు. రాజధాని ఢిల్లీతో పాటు పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో ప్రకంపనలు వచ్చాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో నివశించే ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

భూకంపానికి సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘ఢిల్లీ భూకంపం సంభవించింది. ప్రజలంతా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నా’ అంటూ కేజ్రీవాల్ ఆ పోస్ట్ చేశారు. ఇక జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఈ భూకంపంపై సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘భూకంపం వల్ల తాను తన ఇంటి నుంచి బయటికి వచ్చేశాను. భూమి కదిలిపోయింది’ అంటూ ఆ పోస్ట్‌లో పేర్కొన్నాడు.


మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..

శ్రీరామ రాజ్యం చిన్నారి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>