PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ap-electionscdbba722-9529-40cd-bd80-81e110c24636-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ap-electionscdbba722-9529-40cd-bd80-81e110c24636-415x250-IndiaHerald.jpgసీఏఏ వ్యతిరేక నిరసనలు చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు గత ఏడాది ఇచ్చిన తీర్పుపై 12 మంది హక్కులు కార్యకర్తలు రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రివ్యూ పిటిషన్‌‌పై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు..‘అన్ని సందర్భాల్లో, ప్రతి చోట నిరసన తెలియజేయడం కుదరదు.. కొన్నిసార్లు ఆకస్మిక నిరసనలు తెలపొచ్చు.. కానీ, ఇతరుల హక్కకులను ప్రభావితం చేసే బహిరంగ ప్రదేశాలలో సుదీర్ఘమైన అసమ్మతి లేదా నిరసన కొనసాగించడం సాధ్యం కాదు’ అని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది.supreme court;krishna;october;central governmentఇతరుల హక్కులను ప్రభావితం చేసే నిరసనలు ఆమోదయోగ్యం కాదు - సుప్రీంకోర్టుఇతరుల హక్కులను ప్రభావితం చేసే నిరసనలు ఆమోదయోగ్యం కాదు - సుప్రీంకోర్టుsupreme court;krishna;october;central governmentSat, 13 Feb 2021 17:40:00 GMTకేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సీఏఏ (సిటిజన్స్ అమెండ్ మెంట్ యాక్ట్) విషయమై దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తుండటం ఇటీవలే తీవ్రంగా చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా సర్వోన్నత న్యాయస్థానం స్పందిస్తూ...  ‘నిరసన తెలియజేయడం, అసమ్మతిని వ్యక్తం చేసే హక్కు కొన్ని విధులతో వస్తుంది... అది ఎల్లప్పుడు, ప్రతిచోటా నిర్వహించడం కుదరదు’ అని సుప్రీంకోర్టు శుక్రవారం వ్యాఖ్యానించింది. ఢిల్లీలోని షాహీన్ బాగ్‌‌లో‌ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు చట్టవిరుద్దమని ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్‌ కొట్టివేసిన సుప్రీంకోర్టు.. ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.




అయితే షాహీన్ బాగ్ వద్ద జరిగిన సీఏఏ వ్యతిరేక నిరసనలు చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు గత ఏడాది ఇచ్చిన తీర్పుపై 12 మంది హక్కులు కార్యకర్తలు రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రివ్యూ పిటిషన్‌‌పై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు..‘అన్ని సందర్భాల్లో, ప్రతి చోట నిరసన తెలియజేయడం కుదరదు.. కొన్నిసార్లు ఆకస్మిక నిరసనలు తెలపొచ్చు.. కానీ, ఇతరుల హక్కకులను ప్రభావితం చేసే బహిరంగ ప్రదేశాలలో సుదీర్ఘమైన అసమ్మతి లేదా నిరసన కొనసాగించడం సాధ్యం కాదు’ అని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది.




నిరసనల కోసం బహిరంగ ప్రదేశాలను ఆక్రమించరాదని, ప్రజా నిరసనలు "నిర్ణీత ప్రదేశాలలో మాత్రమే ఉండాలి అని జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ కృష్ణ మురారీ ధర్మాసనం పునరుద్ఘాటించింది. "అసమ్మతి, ప్రజాస్వామ్యం కలిసిపోతాయని, ఇలాంటి నిరసనలు ఆమోదయోగ్యం కాదని ఉన్నత న్యాయస్థానం గతేడాది అక్టోబరులో ఇచ్చిన తీర్పులో నొక్కి చెప్పింది. సీఏఏ వ్యతిరేక ఆందోళనలకు ఢిల్లీలోని షహీన్ బాగ్ మూల కేంద్రంగా నిలిచిన విషయం తెలిసిందే. డిసెంబరు 2019లో ప్రారంభమైన ఈ ఆందోళనల్లో మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మూడు నెలలకుపైగా ఈ ఆందోళనలు కొనసాగాయి. ఈ ఆందోళనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ ఆందోళనలో పాల్గొన్న 80 ఏళ్ల వృద్ధరాలు బిల్కిస్ దాదీని టైమ్స్ మ్యాగిజైన్ 100 మంది ప్రభావిత వ్యక్తుల జాబితాలో చేర్చింది.




ఘోరం.. దోపిడీ దొంగలు ఎంతటి దారుణానికి పాల్పడ్డారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

బ్రేకింగ్‌: కృష్ణాలో టీడీపీ ఘోర ప‌రాజ‌యం... ఎంత దారుణం అంటే..

బ్రాహ్మ‌ణ ఘోష‌: వెలంప‌ల్లి పై ఎందుకింత వ్య‌తిరేక‌త‌..?

కాపు వేద‌న‌: కాపుల ముఖాల్లో ఇక `వెలుగు` చూడ‌లేమా ?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్.. పేరు గొప్ప‌.. ఊరు దిబ్బ‌కేనా ?

సమంత, నాగ చైతన్య ఉంటున్న ఇల్లు చూసారా.. ఇంద్రభవనం కూడా ఎందుకు పనికి రాదు

"అవి మానుకో "..సమంతకు గట్టి వార్నింగ్ ఇచ్చిన నాగార్జున..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>