PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/cm-kcr63f53385-4c70-4da5-8c94-0dc5bd1578f8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/cm-kcr63f53385-4c70-4da5-8c94-0dc5bd1578f8-415x250-IndiaHerald.jpgహాలియాలో ఇటీవలే టీఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హాజరయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆయన వచ్చిందే తడవుగా జిల్లా ప్రజలపై సభలో ఒక రేంజ్ లో వరాల వర్షం కురిపించారు. సరిగ్గా ఏడాదిన్నర క్రితం 2019 చివరిలో హుజూర్‌నగర్ ఉప ఎన్నిక సమయంలో కూడా సీఎం కేసీఆర్ ఇవే హామీలు అక్కడి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చారని, కానీ అవి అమలుకు మాత్రం నోచుకోలేదు అని చెప్పుకుంటున్నారు.kcr;koti;kcr;amala akkineni;nagarjuna akkineni;varsha;korcha;2019;district;huzur nagar;partyఎన్నికలు మారినా సీఎం కేసీఆర్ వరాల హామీలు మాత్రం మారట్లేదట!ఎన్నికలు మారినా సీఎం కేసీఆర్ వరాల హామీలు మాత్రం మారట్లేదట!kcr;koti;kcr;amala akkineni;nagarjuna akkineni;varsha;korcha;2019;district;huzur nagar;partySat, 13 Feb 2021 22:40:00 GMTతెలంగాణ రాష్ట్రంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు సమీపిస్తున్న వేళ హాలియాలో ఎన్నికల హడావుడి నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే హాలియాలో ఇటీవలే టీఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హాజరయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆయన వచ్చిందే తడవుగా జిల్లా ప్రజలపై సభలో ఒక రేంజ్ లో వరాల వర్షం కురిపించారు. పంచాయతీలకు నిధులు.. మున్సిపాలిటీలకు కోట్లు.. చివరి ఎకరాకూ నీళ్లు.. ఇలా అనేక వరాల హామీలు ఇచ్చేశారు సీఎం కేసీఆర్. అయితే ఇప్పుడు ఈ వరాల హామీలపైనే ప్రజలందరూ ఎవరికి తోచిన విధంగా వారు తెగ చర్చలు నడుపుతున్నారట. అసలు విషయం ఏంటంటే.. సరిగ్గా ఏడాదిన్నర క్రితం 2019 చివరిలో హుజూర్‌నగర్ ఉప ఎన్నిక సమయంలో కూడా సీఎం కేసీఆర్ ఇవే హామీలు అక్కడి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చారని, కానీ అవి అమలుకు మాత్రం నోచుకోలేదు అని చెప్పుకుంటున్నారు.

ఆవిధంగా అప్పుడు హుజూర్ నగర్ నియోజకవర్గానికే పరిమితమయ్యారని.. అయితే ఈసారి మాత్రం మరింతగా డోసు పెంచి జిల్లా మొత్తంపైనే వరాల జల్లు కురిపించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హుజూర్ నగర్‌ ఉప ఎన్నిక సందర్భంగా నియోజకవర్గంలోని వందకి పైగా పంచాయతీలకు రూ.20 లక్షలు, మండల కేంద్రాలకు రూ.30 లక్షలు, మున్సిపాలిటీకి ఏకంగా రూ.25 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. నాలుగు రోజుల కిందట జరిగిన హాలియా సభలోనూ ఇంచుమించు అవే హామీలు ఇచ్చారన్న విమర్శలొస్తున్నాయి. జిల్లాలోని ఒక్కో పంచాయతీకి రూ.20 లక్షలు, నల్గొండకు రూ.10 కోట్లు, మిర్యాలగూడకి రూ.5 కోట్లు, మిగిలిన మున్సిపాలిటీలకు కోటి చొప్పున ఇస్తామని హామీలు ఇచ్చారని చెప్పుకుంటున్నారు. గత ఎన్నికల సమయంలో కుర్చీ వేసుకుని కూర్చుని అయినా కృష్ణపట్టి నీరిస్తామని చెప్పారని.. ఇప్పుడు ఎడమ కాలువ నుంచి చివరిక ఎకరా వరకూ నీళ్లు వచ్చేట్టు చేస్తామన్నారట. 'ఎన్నికలు మారాయి కానీ హామీలు మాత్రం ఏం మారలేదు' అంటూ సెటైర్లు వేస్తున్నారు.






రేపు యూట్యూబ్ దద్దరిల్లిపోవడం ఖాయం అంటున్నారు ....??

రీ ఎంట్రీ కి సిద్ధమైన స్టార్ హీరో భార్య..

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఊపేసిన ఫ్యాన్..!

రెండవ పెళ్ళికి సిద్దమైన బాలీవుడ్ హాట్ హీరోయిన్...

వ‌ర్క‌వుట్ కాని.. బాబు.. `ఆందోళ‌న`‌.. రెండో విడ‌త దారుణం..!

బ్రేకింగ్‌: నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక‌.. టీడీపీ అభ్య‌ర్థి ఖ‌రారు

కొడాలి ఇలాకాలో ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ... వింత గెలుపు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>