PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/suicide618bd5a4-0ef5-4af6-b2cf-45d1bb2a6da8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/suicide618bd5a4-0ef5-4af6-b2cf-45d1bb2a6da8-415x250-IndiaHerald.jpgప్రాణాలు కాపాడే అంబులెన్స్‌లోనే ఓ ఎస్ఐ ప్రాణాలు తీసుకున్నాడు. అంబులెన్స్‌లో ఆసుపత్రికి వెళ్తుండగా మార్గం మధ్యలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 39 ఏళ్ల రాజ్‌వీర్ సింగ్ పోలీస్ డిపార్ట్‌మెంట్లో ఎస్‌ఐగా పనిచేస్తున్నాడు. suicide;meera;delhi;police;capital;wife;traffic police;local languageదారుణం: అంబులెన్స్‌లో ఉరేసుకొని ఎస్ఐ ఆత్మహత్య.. ఎందుకంటే..!?దారుణం: అంబులెన్స్‌లో ఉరేసుకొని ఎస్ఐ ఆత్మహత్య.. ఎందుకంటే..!?suicide;meera;delhi;police;capital;wife;traffic police;local languageSat, 13 Feb 2021 21:00:00 GMTరాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 39 ఏళ్ల రాజ్‌వీర్ సింగ్ పోలీస్ డిపార్ట్‌మెంట్లో ఎస్‌ఐగా పనిచేస్తున్నాడు. అతడు కొన్ని రోజులుగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అందుకోసమే ఐదు రోజులగా సెలవుల్లో ఉన్నాడు. ఐతే శుక్రవారం కూడా ఆస్పత్రికి వెళ్లేందుకు అంబులెన్స్‌కు కాల్ చేశాడు. అనంతరం ఓ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఆయన్ను అడ్మిట్ చేసుకోలేదు. మరో రెండు ఆస్పత్రుల్లోనూ ఇదే అనుభవం ఎదురయింది.

ఇక చివరకు ఐహెచ్‌బీఎస్ ఆస్పత్రికి తరలిస్తుండగా అంబులెన్స్‌లోనే రాజ్‌వీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అంబులెన్స్ కర్టెన్, ఇతర వస్తువుల సాయంతో ఉరివేసుకొని మరణించాడు. తనను చేర్పించుకునేందుకు మూడు ఆస్పత్రులు నిరాకరించినందున.. మనస్థాపంతోనే మరణించినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ''ఎస్ఐ ఆత్మహత్య ఘటనపై శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు పోలీసులకు సమాచారం అందింది. ఆస్పత్రికి వెళ్తుండగా వస్త్రంతో ఉరివేసుకున్నట్లు గుర్తించాం. రాజ్‌వీర్ ఐదు రోజుల నుంచి సెలవులో ఉన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. '' అని ఢిల్లీ సౌత్‌ఈస్ట్ డీసీపీ ఆర్‌పీ మీరా తెలిపారు.

అయితే రాజ్‌వీర్‌ సింగ్‌ తన కుటుంబంతో కలిసి ఢిల్లీ ద్వారకాలలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు. సౌత్ ఈస్ట్ డిస్ట్రిక్ట్‌ లైన్స్‌లో ఎస్ఐగా పనిచేస్తున్నాడు. ఆయనకు తల్లిదండ్రులు, భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రాజ్‌వీర్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రాజ్‌వీర్ సింగ్‌ను అడ్మిట్ చేసుకునేందుకు మూడు ఆస్పత్రులు ఎందుకు నిరాకరించాయి? ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులేంటి? అనే కోణాలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.


షాకింగ్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కమ్మ సామాజిక వర్గ నేత...?

రీ ఎంట్రీ కి సిద్ధమైన స్టార్ హీరో భార్య..

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఊపేసిన ఫ్యాన్..!

రెండవ పెళ్ళికి సిద్దమైన బాలీవుడ్ హాట్ హీరోయిన్...

వ‌ర్క‌వుట్ కాని.. బాబు.. `ఆందోళ‌న`‌.. రెండో విడ‌త దారుణం..!

బ్రేకింగ్‌: నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక‌.. టీడీపీ అభ్య‌ర్థి ఖ‌రారు

కొడాలి ఇలాకాలో ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ... వింత గెలుపు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>