PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsd1a61529-e2d7-42d3-9731-9bbb97a1dff5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsd1a61529-e2d7-42d3-9731-9bbb97a1dff5-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అధికార పార్టీని టార్గెట్ గా చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. దాదాపుగా తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తున్నది అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఇక స్థానిక సంస్థల్లో ఏకగ్రీవాల విషయంలో అధికార పార్టీ అనుసరిస్తున్న వైఖరిపై కూడా ఆగ్రహం ఉంది. అన్ని విధాలుగా అధికారులు సహాయ సహకారాలు అందిస్తున్నారు అని ఆరోపణలు ఉన్నాయి. ఇక తాజాగా టీడీపీ కీలక నేత బొండా ఉమా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. వైకాపాకు నిజాయితీగా ఎన్నికల tdp;telugu desam party;jagan;andhra pradesh;telugu;police;google;media;cbi;tdp;local language;central government;tadepalli;party;bonda umamaheswara raoగెలిచిన వాళ్ళను మేము నిలబెడతాం... మీకు దమ్ముందా...? టీడీపీ దిమ్మతిరిగే సవాల్గెలిచిన వాళ్ళను మేము నిలబెడతాం... మీకు దమ్ముందా...? టీడీపీ దిమ్మతిరిగే సవాల్tdp;telugu desam party;jagan;andhra pradesh;telugu;police;google;media;cbi;tdp;local language;central government;tadepalli;party;bonda umamaheswara raoSat, 13 Feb 2021 12:10:28 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అధికార పార్టీని టార్గెట్ గా చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. దాదాపుగా తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తున్నది అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఇక స్థానిక సంస్థల్లో ఏకగ్రీవాల విషయంలో అధికార పార్టీ అనుసరిస్తున్న వైఖరిపై కూడా ఆగ్రహం ఉంది. అన్ని విధాలుగా అధికారులు సహాయ సహకారాలు అందిస్తున్నారు అని ఆరోపణలు ఉన్నాయి. ఇక తాజాగా టీడీపీ కీలక నేత బొండా ఉమా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. 

వైకాపాకు నిజాయితీగా ఎన్నికల జరిపే దమ్ముందా? అని ఆయన నిలదీశారు. జగన్ కు ప్రజల్లో చరిష్మా ఉంటే ఏకగ్రీవాలకు ఎందుకు వెళుతున్నారు అని ఆయన ప్రశ్నించారు. పుంగనూరు, మాచర్లలో బలవంతపు ఏకగ్రీవాల రద్దుచేసి ఎన్నికలు నిర్వహించే దమ్ము వైకాపా కు ఉందా? అని ఆయన సవాల్ చేసారు. తెదేపా బలపరిచి గెలిచిన అభ్యర్ధులను మేం ప్రదర్శనకు పెడుతాం అని ఆయన అన్నారు. మీరు 2640 మందితో తాడేపల్లి లో పెట్టగలరా? అని సవాల్ విసిరారు. 6093 అని కొడితే జగన్ చరిష్మా గురించి గూగుల్ చెప్తుంది అని అన్నారు. 

చిన్నాన్న హత్యపై సీబీఐ విచారణ ఉపసంహరణతోనే మీ చరిష్మా ఎంటో బహిర్గతమైంది అని ఆయన ఎద్దేవా చేసారు. అధికారంలోకి వచ్చాక షర్మిల జగనన్న వదిలేసిన బాణం అయింది అని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ఫోబియా పట్టుకున్న నేతలు ఓటమి భయంతో వణికిపోతున్నారు అని అన్నారు. పోలీసుల్ని అడ్డంపెట్టుకుని అధికార యంత్రాంగాన్ని బెదిరించి ఎన్నికల్లో పోటీచేసిన మీరు జీరోలు అని ఆయన ఆరోపించారు. దమ్ము, ధైర్యంతో కుట్రలు, బెదిరింపులను తట్టుకుని పోటీ చేసిన తెదేపా అభ్యర్థులు హీరోలు అని అన్నారు. ఒకరు చెప్పిన అబద్దం మరొకరు చెప్పకుండా అబద్ధాలతో ఎదురుదాడి చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. కేంద్ర బలగాలు, మీడియా సమక్షంలో పుంగనూరు లో ఎన్నికల నిర్వహణకు సిద్ధమా? అని సవాల్ చేసారు.



మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..

శ్రీరామ రాజ్యం చిన్నారి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>