ViralSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-flying-aeroplane-rules-confused363a9a3b-b479-4cb7-90f0-d0f57359520f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-flying-aeroplane-rules-confused363a9a3b-b479-4cb7-90f0-d0f57359520f-415x250-IndiaHerald.jpgవిదేశాల్లో విద్య, ఉద్యోగ అవకాశాల కోసం కలలు కన్న యువత ఆశలపై మహమ్మారి నీళ్లు చల్లింది. ఈ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వీరంతా పలురకాలుగా ఇబ్బందులకు గురి అవుతున్నా కానీ భారత్‌లోని ధనవంతులకు మాత్రం విదేశీ పౌరసత్వం పొందాలన్న ఆకాంక్ష ఇసుమంతైనా తగ్గలేదు సరికదా.. 2019తో పోలిస్తే కోవిడ్ ప్రభావం ఎక్కువున్న 2020లో భారీగా పెరగడం విశేషం. గతేడాది విదేశీ పౌరసత్వం కోరుకునే భారతీయుల సంఖ్య 62.6 శాతం పెరిగింది.foreign citizenship;vidya;india;pakistan;canada;australia;austria;hong kong;portugal;singapore;american samoa;director;european union;international;dubai;coronavirusకరోనా సంక్షోభంలో కూడా వారికి విదేశీ పౌరసత్వంపై మక్కువ తగ్గలేదే!కరోనా సంక్షోభంలో కూడా వారికి విదేశీ పౌరసత్వంపై మక్కువ తగ్గలేదే!foreign citizenship;vidya;india;pakistan;canada;australia;austria;hong kong;portugal;singapore;american samoa;director;european union;international;dubai;coronavirusSat, 13 Feb 2021 23:00:00 GMTపై చదువులు చదవటానికి అలాగే ఉద్యోగావకాశాల కోసం యువతీయువకులు ఎప్పటికప్పుడు విదేశాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విదేశీ ప్రయాణాలపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపింది. విదేశాల్లో విద్య, ఉద్యోగ అవకాశాల కోసం కలలు కన్న యువత ఆశలపై మహమ్మారి నీళ్లు చల్లింది. ఈ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వీరంతా పలురకాలుగా ఇబ్బందులకు గురి అవుతున్నా కానీ భారత్‌లోని ధనవంతులకు మాత్రం విదేశీ పౌరసత్వం పొందాలన్న ఆకాంక్ష ఇసుమంతైనా తగ్గలేదు సరికదా.. 2019తో పోలిస్తే కోవిడ్ ప్రభావం ఎక్కువున్న 2020లో భారీగా పెరగడం విశేషం. గతేడాది విదేశీ పౌరసత్వం కోరుకునే భారతీయుల సంఖ్య 62.6 శాతం పెరిగింది.



విదేశీ పౌరసత్వం సాధారణంగా లభించదు. కానీ, పలు దేశాలు పెట్టుబడులు, వ్యాపారాలను ప్రారంభించడం ద్వారా విదేశీయులకు పౌరసత్వం కల్పిస్తాయి. అయితే, అది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని అయినా భారతీయ ధనికులు మాత్రం ఉత్సాహం చూపుతున్నారు. భారత్‌కు చెందిన 7 వేల మంది గతేడాది పెట్టుబడి పెట్టడం ద్వారా విదేశీ పౌరసత్వం కోసం విచారించినట్టు న్యూ వరల్డ్ వెల్త్ అనే సంస్థ విడుదల చేసిన అంతర్జాతీయ ఆర్థిక వలస సమీక్ష (గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ) నివేదికలో వెల్లడయ్యింది. ఈ జాబితాలో భారత్ రెండో స్థానంలో నిలవగా.. 2019లో ఆరో స్థానంలో ఉంది. అప్పుడు కేవలం 1,500 మంది మాత్రమే విదేశీ పౌరసత్వం గురించి విచారించినట్టు నివేదిక పేర్కొంది. విదేశీ పౌరసత్వం కోరుకుంటున్నవారిలో పాకిస్థాన్ (3), దక్షిణాఫ్రికా (4), నైజీరియా (5) ఉన్నట్టు తెలిపింది. కెనడా, పోర్చుగల్, ఆస్ట్రియా, మాల్టా, టర్కీల పౌరసత్వంపైనే భారతీయ ధనికులు ఎక్కువగా మొగ్గుచూపినట్టు తెలిపింది. వాస్తవానికి అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా పౌరసత్వాలపై భారతీయులు ఎక్కువగా ఆసక్తి ప్రదర్శిస్తారని, ఈసారి కరోనా నేపథ్యంలో కెనడా మినహా మిగతా దేశాలపై అంతగా ఆసక్తి చూపించలేదని నివేదిక వివరించింది.




కెనడా, ఆస్ట్రేలియా పౌరసత్వం లభించాలంటే చాలా సమయం పడుతుందని హెన్లీ అండ్ పార్ట్‌నర్ సంస్థ దక్షిణాసియా టీమ్ డైరెక్టర్ నిర్భయ్ హందా చెప్పారు. మరోవైపు చాలా మంది ఆస్ట్రియా పౌరసత్వం కోసం విచారించినట్టు హందా పేర్కొన్నారు. ఆస్ట్రియా పాస్‌పోర్ట్‌తో 187 దేశాలకు వీసా లేకుండా వెళ్లే అవకాశం ఉండడంతో ఎక్కువగా దానిపై ఆసక్తి చూపుతారని వివరించారు. అంతేకాదు, ఐరోపా సమాఖ్యలోని ఏ దేశంలోనైనా ఉండేందుకు మాల్టా, ఆస్ట్రియా పౌరసత్వాలు అవకాశం కల్పిస్తాయన్నారు. భారత్ ఇప్పటి వరకూ ద్వంద్వ పౌరసత్వం, పెట్టుబడుల ద్వారా పౌరసత్వం కల్పించడం లేదు. పోర్చుగల్ గోల్డెన్ రెసిడెన్స్ పెర్మిట్ ప్రోగ్రామ్ కింద కనీసం 3,50,000 యూరోలను రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెడితే ఐరోపా పౌరసత్వం లభిస్తుంది. దుబాయ్, హాంకాంగ్, సింగపూర్ వంటి అంతర్జాతీయ ఆర్థిక కేంద్రాలలో ప్రొఫెషనల్ ఎన్నారైలు అధికంగా ఉంటారు. ఈ దేశాలలో వారు శాశ్వత నివాసం లేదా పౌరసత్వం పొందలేకపోతే వేరే దేశాలను ఎంపిక చేసుకుంటారు.




ఆ విషయంలో రంగంలోకి దిగిన మహేష్ బాబు ....ఫ్యాన్స్ కి పండగే .....??

రీ ఎంట్రీ కి సిద్ధమైన స్టార్ హీరో భార్య..

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఊపేసిన ఫ్యాన్..!

రెండవ పెళ్ళికి సిద్దమైన బాలీవుడ్ హాట్ హీరోయిన్...

వ‌ర్క‌వుట్ కాని.. బాబు.. `ఆందోళ‌న`‌.. రెండో విడ‌త దారుణం..!

బ్రేకింగ్‌: నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక‌.. టీడీపీ అభ్య‌ర్థి ఖ‌రారు

కొడాలి ఇలాకాలో ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ... వింత గెలుపు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>