MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/can-souls-go-there-and-tolerate03b8fdea-810e-490a-8491-6c6c765c9cc2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/can-souls-go-there-and-tolerate03b8fdea-810e-490a-8491-6c6c765c9cc2-415x250-IndiaHerald.jpgటాలీవుడ్‌ నుంచి చాలామంది హీరోలు బాలీవుడ్‌కి వెళ్తున్నారు. పాన్‌ ఇండియన్‌ స్టార్స్‌గా ఎదగాలని స్కెచ్చులేస్తున్నారు. మరి హిందీ మార్కెట్‌లో హిందీ హీరోలని తట్టుకుని మన తెలుగు హీరోలు నార్త్‌లో జెండా పాతగలరా అనే సందేలాలు ఇపుడు నెలకొన్నాయి. బాలీవుడ్‌లో చాలారోజుల నుంచి కపూర్, ఖాన్స్ డామినేషన్ నడుస్తోంది. వీళ్లని దాటుకొని బాలీవుడ్‌లో సూపర్‌స్టార్డమ్‌ అందుకున్న హీరోలు ఇప్పటివరకు లేరు. ఇలాంటి మార్కెట్‌కి మన తెలుగులో వరుస కట్టి వెళ్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ 'బాహుబలి'గా అక్కడ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడుcan souls go there and tolerate;prabhas;allu arjun;ram pothineni;cinema;telugu;bahubali;dance;hindi;bunny 1;arjun 1;father;ghajiniమనోళ్లు అక్కడికి వెళ్లి తట్టుకోగలుగుతారా..?మనోళ్లు అక్కడికి వెళ్లి తట్టుకోగలుగుతారా..?can souls go there and tolerate;prabhas;allu arjun;ram pothineni;cinema;telugu;bahubali;dance;hindi;bunny 1;arjun 1;father;ghajiniSat, 13 Feb 2021 20:38:10 GMTహిందీ మార్కెట్‌లో హిందీ హీరోలని తట్టుకుని మన తెలుగు హీరోలు నార్త్‌లో జెండా పాతగలరా అనే సందేలాలు ఇపుడు నెలకొన్నాయి.

బాలీవుడ్‌లో చాలారోజుల నుంచి కపూర్, ఖాన్స్ డామినేషన్ నడుస్తోంది. వీళ్లని దాటుకొని బాలీవుడ్‌లో సూపర్‌స్టార్డమ్‌ అందుకున్న హీరోలు ఇప్పటివరకు లేరు. ఇలాంటి మార్కెట్‌కి మన తెలుగులో వరుస కట్టి వెళ్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ 'బాహుబలి'గా అక్కడ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. 'ఆదిపురుష్' లాంటి స్ట్రయిట్‌ హిందీ మూవీస్‌ చేస్తూ నార్త్ స్టార్స్‌తో పోటీ పడుతున్నాడు.

ప్రభాస్ రూట్‌లోనే రామ్ చరణ్‌ కూడా పాన్‌ ఇండియన్‌ మూవీస్‌తో బాలీవుడ్‌ని టార్గెట్ చేస్తున్నాడు. కెరీర్‌ బిగినింగ్‌లో స్ట్రయిట్ హిందీ ఫిల్మ్ 'జంజీర్' చేశాడు చెర్రీ. అయితే ఈ మూవీకి నెగటివ్ రెస్పాన్స్ రావడంతో తెలుగుకే పరిమితమయ్యాడు. మళ్లీ ఇప్పుడు 'ట్రిపుల్‌ ఆర్'తో బాలీవుడ్‌కి వెళ్తున్నాడు. ఈ సినిమాతో మైదలైన బాలీవుడ్‌ ప్రయాణాన్ని మరో రేంజ్‌కి తీసుకెళ్లడానికి శంకర్‌తో భారీ సినిమా చేస్తున్నాడు.

అల్లు అర్జున్ కూడా నార్త్‌ మార్కెట్‌పై ఫోకస్ పెట్టాడు. డబ్బింగ్‌ సినిమాలు, డ్యాన్సులతో నార్త్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయిన బన్ని ఇప్పుడు 'పుష్ప'తో ముంబాయి ప్లైట్ ఎక్కుతున్నాడు. ఇక అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్‌కి బాలీవుడ్‌లో మంచి రిలేషన్స్‌ ఉన్నాయి. అక్కడ 'గజిని' లాంటి సినిమాలతో బ్లాక్‌బస్టర్స్‌ కొట్టాడు. సో ఈ బ్యాక్‌గ్రౌండ్‌ని బేసుకుని 'పుష్ప'తో సాలిడ్‌ స్టార్డమ్ అందుకోవాలనుకుంటున్నాడట బన్ని.

బాక్సాఫీస్‌ దగ్గర అల్టిమేట్‌గా నిలబడేది కథే. స్టోరీ బావుంటేనే సినిమా సూపర్ హిట్ అవుతుంది. కంటెంట్‌ లేనప్పుడు ఎంత పెద్ద కటౌట్‌ ఉన్నా కలెక్షన్లు రావు. సో తెలుగు నుంచి హిందీకి వెళ్తోన్న హీరోలు కథని నమ్ముకుంటే, ఆపోజిట్‌లో ఎంత పెద్ద స్టార్‌ ఉన్నా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆటోమెటిక్‌గా అదరగొట్టేస్తారు.  


రీ ఎంట్రీ కి సిద్ధమైన స్టార్ హీరో భార్య..

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఊపేసిన ఫ్యాన్..!

రెండవ పెళ్ళికి సిద్దమైన బాలీవుడ్ హాట్ హీరోయిన్...

వ‌ర్క‌వుట్ కాని.. బాబు.. `ఆందోళ‌న`‌.. రెండో విడ‌త దారుణం..!

బ్రేకింగ్‌: నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక‌.. టీడీపీ అభ్య‌ర్థి ఖ‌రారు

కొడాలి ఇలాకాలో ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ... వింత గెలుపు

కాపు వేదన : జగనోరి వల్లే..ముద్రగడ వెనక్కి తగ్గరా ,,??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>