MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-salaar-bikea197923b-f8d7-4316-92ec-60ebbab26fae-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-salaar-bikea197923b-f8d7-4316-92ec-60ebbab26fae-415x250-IndiaHerald.jpgయంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో కలిసి సలార్ మూవీ చేస్తున్నారు. నెల రోజుల క్రితం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రారంభమైంది. సంక్రాంతి పండుగ సమయంలో స్టార్ట్ అయిన సలార్ మూవీ ఫస్ట్ షూటింగ్ షెడ్యూల్ రామగుండంలోని సింగరేణి ఓపెన్ క్యాస్ట్ బొగ్గు గనుల్లో పూర్తయింది. prabhas salaar bike;prabhas;shruti;shruti haasan;kranthi;kranti;prasanth;prashanth neel;sruthi;vijay;makar sakranti;india;korcha;cinema;telugu;sankranthi;festival;tamil;producer;kannada;bike;hindi;february;producer1;joseph vijay;kgf;prasanth neel;prashant kishorనెట్టింట తెగ వైరల్ అవుతున్న ప్రభాస్ సోలార్ బైక్ ఫోటో..నెట్టింట తెగ వైరల్ అవుతున్న ప్రభాస్ సోలార్ బైక్ ఫోటో..prabhas salaar bike;prabhas;shruti;shruti haasan;kranthi;kranti;prasanth;prashanth neel;sruthi;vijay;makar sakranti;india;korcha;cinema;telugu;sankranthi;festival;tamil;producer;kannada;bike;hindi;february;producer1;joseph vijay;kgf;prasanth neel;prashant kishorSat, 13 Feb 2021 12:30:04 GMTప్రభాస్ కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో కలిసి సలార్ మూవీ చేస్తున్నారు. నెల రోజుల క్రితం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రారంభమైంది. సంక్రాంతి పండుగ సమయంలో స్టార్ట్ అయిన సలార్ మూవీ ఫస్ట్ షూటింగ్ షెడ్యూల్ రామగుండంలోని సింగరేణి ఓపెన్ క్యాస్ట్ బొగ్గు గనుల్లో పూర్తయింది. ఈ మూవీలో ప్రభాస్ ఓ సమరయోధుడిగా కనిపించనున్నారని తెలుస్తోంది. అయితే సలార్ మొదటి షెడ్యూల్ కంప్లీట్ అవ్వగా.. ఇప్పుడు ఆ షూటింగ్ సందర్భంగా తీసిన ఫోటోలు బయటకు వస్తున్నాయి.

తాజాగా ప్రభాస్ బైక్ పై కూర్చున్న ఓ ఫోటో నెట్టింట ప్రత్యక్షమయ్యింది. బొగ్గు గనుల ప్రదేశంలో ఒక మట్టి రోడ్డు మీద ప్రభాస్ బైక్ రైడ్ చేయడానికి రెడీ గా ఉన్నట్టు ఈ ఫోటోలో కనిపిస్తోంది. చిత్ర బృందం ప్రభాస్ ని యాక్షన్ షాట్ కోసం రెడీ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ సినిమాలో శృతి హాసన్ ప్రభాస్ సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో శృతి హాసన్ ని దొంగలు కిడ్నాప్ చేస్తారని.. అప్పుడు ప్రభాస్ దొంగలను తన బైక్ పై చేజ్ చేస్తారని.. ప్రస్తుతం లీకైన ఫోటో ఆ సన్నివేశానికి సంబంధించినదే అని కొందరు చెబుతున్నారు.

అయితే లీకైన ఈ ఫోటో ప్రస్తుతం భారత దేశ వ్యాప్తంగా విపరీతంగా వైరల్ అయ్యింది. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న సలార్ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళం భాషలలో విడుదల కాబోతున్న ఈ సినిమాని కేజీఎఫ్ నిర్మాత విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. అయితే అతి త్వరలోనే సలార్ మూవీకి సంబంధించిన భారీ షెడ్యూల్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇప్పటికే రాధేశ్యామ్ సినిమాని పూర్తి చేసిన ప్రభాస్ తన తదుపరి సినిమాలను కూడా వేగంగా పూర్తి చేయడానికి ముందడుగు వేస్తున్నారు. రాధేశ్యాం సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లిమ్ప్స్ ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన విడుదల కానున్నది.


మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..

శ్రీరామ రాజ్యం చిన్నారి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>