Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/money-moneyf826fafb-6754-4057-a89a-445f1336ebd3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/money-moneyf826fafb-6754-4057-a89a-445f1336ebd3-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు ఎంతలా పెరిగిపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే సైబర్ నేరగాళ్ల ఆటలు ఎప్పటికప్పుడు కట్టిస్తూ ఇక సైబర్నేరాల పై పోలీసులు ఉక్కుపాదం మోపినప్పటికి కూడా సైబర్ నేరాలు మాత్రం ఎక్కడా తగ్గుముఖం పట్టడం లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏదో ఒక విధంగా ప్రజలను బురిడీ కొట్టించి భారీగా డబ్బులు దండుకోవడానికి సైబర్ నేరగాళ్లు సరికొత్త ప్రయత్నాలతో తెరమీదికి వస్తూనే ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏం చేయాలన్న కూడా ప్రస్తుతం భయపడిపోతున్నారు జనాలు. ఏం చేస్తే సైబర్ money;maya;hyderabad;rbi;smart phone;police;bank;car;army;jawaanకారు కొనాలనుకున్న జవాన్.. కానీ మూడున్నర లక్షలు మాయం..ఏం జరిగిందంటే..?కారు కొనాలనుకున్న జవాన్.. కానీ మూడున్నర లక్షలు మాయం..ఏం జరిగిందంటే..?money;maya;hyderabad;rbi;smart phone;police;bank;car;army;jawaanSat, 13 Feb 2021 08:00:00 GMT


 ఈ క్రమంలోనే ఏం చేయాలన్న కూడా ప్రస్తుతం భయపడిపోతున్నారు జనాలు. ఏం చేస్తే సైబర్ దాడి జరిగి ఖాతా ఖాళీ అయిపోతుందో  అని ఆందోళన చెందుతున్నారు. ఇక సామాన్య ప్రజలు సెలబ్రిటీలు అన్న తేడా లేకుండా అందరినీ మోసం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఇక ఇటీవలే ఏకంగా ఒక ఆర్మీ జవాన్ ను  మోసం చేసి లక్షలు కాజేసింది  సైబర్ ముఠా. ఓఎల్ఎక్స్ లో సెకండ్ సేల్స్ పేరుతో ఆర్మీ జవాను ను  ముగ్గులోకి దించిన రాజస్థానీ ముఠా 3.5 లక్షలు కాచేసింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది.


 హైదరాబాద్ నగరానికి చెందిన ఓ ఆర్మీ జవాన్ ఓఎల్ఎక్స్  వెబ్ సైట్ లో కారు కొనుగోలు చేయాలి అని భావించాడు. ఈ క్రమంలోనే ఇక ఆ కారుకు సంబంధించి యజమానుల కాంటాక్ట్ నెంబర్ అక్కడ ఉండడంతో అది తీసుకుని వారికి కాల్ చేశాడు. అయితే ఇక వారిద్దరి మధ్య డీల్ కుదిరింది. ఇక అడ్వాన్స్గా రెండు లక్షలు చెల్లిస్తేనే కార్ డెలివరీ చేస్తాము అంటూ కారు యజమాని తెలిపాడు.  కార్ డెలివరీ చేసే సమయంలో మిగతా డబ్బులు ఇవ్వాలి అని చెప్పడంతో ఆర్మీ జవాన్ దానికి అంగీకరించాడు.


 ఈ క్రమంలోనే ఇక కారు యజమాని చెప్పిన బ్యాంకు ఖాతాకు తన బ్యాంకు ఖాతా నుంచి రెండు లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు.. ఇక ఆ తర్వాత ఆర్మీ జవాన్ కు మళ్లీ ఫోన్ వచ్చింది కారుపై బ్యాంకులో రుణం ఉందని  ఇంకో లక్షన్నర చెల్లిస్తే బ్యాంక్ లోన్ క్లోజ్ చేసి కార్ డెలివరీ చేస్తాము అని చెప్పడంతో..  ఇక ఆ మొత్తాన్ని కూడా పంపించాడు ఆర్మీ జవాన్. ఇక ఆ తర్వాత నుంచి ఫోన్ స్విచాఫ్ రావడంతో మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇది రాజస్థానీ సైబర్ కేటుగాళ్ల పని అని గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు.


జగడ్డ: ఈరోజు ఎన్నికల్లో బాబోరి టీడీపీ వైసీపీకి పోటీ ఇచ్చేనా...?

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>