WomenMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/doctor-shocking-reply-to-husband-about-wife95df535a-26c0-4580-b32a-d0ce4846b61c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/doctor-shocking-reply-to-husband-about-wife95df535a-26c0-4580-b32a-d0ce4846b61c-415x250-IndiaHerald.jpgచాలా మంది భార్యంటే చిన్నచూపు. ఎందుకంటే భర్త ఉద్యోగం చేస్తున్నాడని, భార్య ఇంట్లోనే ఉంటూ తిని కూర్చుంటుంది. హౌస్ వైఫ్ అంటే ఇంటి బాధ్యతలు చూసుకునే వాళ్లు అనే అపోహలో బతికేస్తుంటారు. కానీ మీరు పొరబడుతున్నారు. నా భార్య పని చేయడం లేదు అని చెప్తే సైకాలజిస్ట్ ఇచ్చిన సమాధానం తో ఖంగు తిన్న భర్తhusband about wife;meera;korcha;husband;wife;houseనా భార్య పని చేయడం లేదు అని చెప్తే సైకాలజిస్ట్ ఇచ్చిన సమాధానం తో ఖంగు తిన్న భర్తనా భార్య పని చేయడం లేదు అని చెప్తే సైకాలజిస్ట్ ఇచ్చిన సమాధానం తో ఖంగు తిన్న భర్తhusband about wife;meera;korcha;husband;wife;houseSat, 13 Feb 2021 10:54:51 GMTభర్త ఉద్యోగం చేస్తున్నాడని, భార్య ఇంట్లోనే ఉంటూ తిని కూర్చుంటుంది. హౌస్ వైఫ్ అంటే ఇంటి బాధ్యతలు చూసుకునే వాళ్లు అనే అపోహలో బతికేస్తుంటారు. కానీ మీరు పొరబడుతున్నారు. ఇంట్లోనే ఉంటూ ఎంతో పని చేసే ఇల్లాలి గురించి.. భర్త అడిగిన ప్రశ్నకు ఓ సైకాలజిస్ట్ ఇచ్చిన సమాధానాలు చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. వీరి సంభాషణ చదివిన తర్వాత అసలు పని చేసే వాళ్లు ఎవరో మీకే అర్థమవుతుందని సైకాలజిస్ట్ తెలిపారు.

భర్త: గుడ్ మార్నింగ్ సర్.
సైకాలజిస్ట్: వెరీ గుడ్ మార్నింగ్.. చెప్పండి మీకేం సమస్య ఉంది..?
భర్త: సర్.. ఇంట్లో నా భార్య ఏ పని చేయడం లేదు..?
సైకాలజిస్ట్: ఓకే.. మీరేం చేస్తుంటారు..?
భర్త: నేను ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగిని
సైకాలజిస్ట్: ఓకే.. మీ భార్య ఏం చేస్తుంటుంది..?
భర్త: ఏం చేయదు సర్.. హౌస్ వైఫ్.
సైకాలజిస్ట్: మీ ఇంట్లో అందరి కంటే తొందరగా ఎవరు నిద్రలేస్తారు. మీరా.. మీ భార్యా..?
భర్త: నా భార్యే సర్.. ఉదయాన్నే టిఫిన్.. ఇంటి పనులు చేయాలిగా..
సైకాలజిస్ట్: మీ పిల్లలున్నారా.. ఉంటే వారిని స్కూల్‌కి తీసుకెళ్తారు..?
భర్త: నా భార్యే తీసుకెళ్తుంది సర్.
సైకాలజిస్ట్: పిల్లలు స్కూల్‌కి వెళ్లిన తర్వాత మీ భార్య ఏం చేస్తుంది..?
భర్త: ఇంటి పని చేస్తుంది. ఇల్లు శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం, గిన్నెలు తోమడం, మిగిలినవి.
సైకాలజిస్ట్: మీ పిల్లలకు హోంవర్క్ ఎవరు చేయిస్తారు..?
భర్త: ఆఫీస్ నుంచి వచ్చే సరికి నేను అలసిపోయి ఉంటాను. నా భార్యనే పిల్లలకు హోం వర్క్ చేయిస్తుంది.
సైకాలజిస్ట్: మరి రాత్రికి డిన్నర్ ఎవరు ప్రిపేర్ చేస్తారు..?
భర్త: ఇంకెవరు.. నా భార్యే వండుతుంది.
సైకాలజిస్ట్: ఇంట్లో తొందరగా ఎవరు నిద్రపోతారు..?
భర్త: నేనే పడుకుంటాను. నా భార్య అప్పటి పని పూర్తి చేసుకుని, పిల్లల్ని పడుకోబెట్టి.. తను నిద్ర పోతుంది.
సైకాలజిస్ట్: దీన్ని బట్టి చూస్తే ఎవరు ఎక్కువ పని చేస్తున్నట్లు..?
భర్త: (విషయం అర్థమై మౌనంగా ఉంటాడు.)
సైకాలజిస్ట్: మీరు ఉద్యోగం చేస్తున్నారు. మీ ఉద్యోగానికి టైమింగ్స్ ఉంటాయి. కానీ మీ భార్యకు ఏ టైమింగ్ ఉండదు. రోజూ విశ్రాంతి లేకుండా పని చేస్తుంది. మీ భార్య ఇంటి బాధ్యతలు తీసుకుంది కాబట్టే.. మీరు ఆఫీస్‌లో ప్రశాంతంగా ఉద్యోగం చేయగలుగుతున్నారు. మీరు ఇచ్చిన సమాధానాలే ఓ సారి గుర్తి తెచ్చుకుని రియలైజ్ అవ్వండి. అంతా మీకే అర్థమవుతుంది.


మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..

శ్రీరామ రాజ్యం చిన్నారి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>