PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bjp-also-targets-home-minister054edc21-9ddb-4bcb-8365-c63590097c5e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bjp-also-targets-home-minister054edc21-9ddb-4bcb-8365-c63590097c5e-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ బిజెపి లో చాలా వరకు కూడా అసంతృప్త నేతలు ఎక్కువగా ఉన్నారు. ప్రధానంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విషయంలో వారిలో అసంతృప్తి అనేది పెరిగిపోతుంది. చాలామంది నేతలకు సోము వీర్రాజు తో మంచి సంబంధం లేదనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. కొంత మంది నేతలతో ఆయన అసలు మాట్లాడటం లేదని వారి అభిప్రాయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదని కొంతమంది భారతీయ జనతా పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీతో కలిసి ప్రయాణం చేస్తున్న విషయంలో కూడా సోము వీర్రాజు కొంతమందికి ప్రాధాన్యత ఇవ్వకుంbjp;pawan;kalyan;srinivas;bharatiya janata party;kamma;andhra pradesh;janasena;janasena party;partyషాకింగ్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కమ్మ సామాజిక వర్గ నేత...?షాకింగ్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కమ్మ సామాజిక వర్గ నేత...?bjp;pawan;kalyan;srinivas;bharatiya janata party;kamma;andhra pradesh;janasena;janasena party;partySat, 13 Feb 2021 21:00:00 GMTఆంధ్రప్రదేశ్ బిజెపి లో చాలా వరకు కూడా అసంతృప్త నేతలు ఎక్కువగా ఉన్నారు. ప్రధానంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విషయంలో వారిలో అసంతృప్తి అనేది పెరిగిపోతుంది. చాలామంది నేతలకు సోము వీర్రాజు తో మంచి సంబంధం లేదనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. కొంత మంది నేతలతో ఆయన అసలు మాట్లాడటం లేదని వారి అభిప్రాయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదని కొంతమంది భారతీయ జనతా పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీతో కలిసి ప్రయాణం చేస్తున్న విషయంలో కూడా సోము వీర్రాజు కొంతమందికి ప్రాధాన్యత ఇవ్వకుండా తనకు అనుకూలంగా ఉండే వాళ్ళకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని అంటున్నారు.

ఇటీవల ప్రకటించిన పదవుల్లో కూడా తనకు అనుకూలంగా ఉండే వాళ్ళకు మాత్రమే పదవులు ఇచ్చారు అని ఆవేదన చాలా మందిలో కూడా వ్యక్తమయింది. అయితే ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మరొకరిని నియమించే ఆలోచన భారతీయ జనతా పార్టీ ఉంది అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఎవరిని నియమిస్తారు ఏంటనే దానిపై స్పష్టత లేకపోయినా బీజేపీ నుంచి గతంలో మంత్రిగా పనిచేసిన కామినేని శ్రీనివాస్ ని రాష్ట్ర అధ్యక్షునిగా నియమించే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది.

ఎందుకు ఏంటనేది ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ లో కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. కాపు సామాజికవర్గం కూడా ఎక్కువగానే ఉంది. కాపు సామాజిక వర్గాన్ని ఎలాగో పవన్ కళ్యాణ్ ఆకట్టుకుంటారు. కాబట్టి కమ్మ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నాలు భారతీయ జనతా పార్టీ నేతలు కామినేని శ్రీనివాస్ ద్వారా చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కృష్ణాజిల్లాలో ఆయనకు మంచి పేరు ఉందని అలాగే ఆర్థికంగా కూడా బలమైన నేత కాబట్టి ఆయన వస్తే మంచి ఫలితాలు ఉంటాయని బీజేపీ నేతలు భావిస్తున్నారట.


రీ ఎంట్రీ కి సిద్ధమైన స్టార్ హీరో భార్య..

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఊపేసిన ఫ్యాన్..!

రెండవ పెళ్ళికి సిద్దమైన బాలీవుడ్ హాట్ హీరోయిన్...

వ‌ర్క‌వుట్ కాని.. బాబు.. `ఆందోళ‌న`‌.. రెండో విడ‌త దారుణం..!

బ్రేకింగ్‌: నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక‌.. టీడీపీ అభ్య‌ర్థి ఖ‌రారు

కొడాలి ఇలాకాలో ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ... వింత గెలుపు

హీరోయిన్ కాంచన పద్మావతి అమ్మవారి కోసం చేసిన భువిరాళం..ఎన్ని కోట్ల విలువ తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>