PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionseb166f95-5edf-4614-be3b-7351c664c025-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionseb166f95-5edf-4614-be3b-7351c664c025-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో రెండవ విడత పోలింగు ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఉదయం పోలింగు కొంచెం మందకొడిగా సాగినప్పటికీ, ఇప్పుడిప్పుడే పోలింగు శాతం జోరందుకుంది. రెండవ విడత ఎన్నికల్లో అయినా మరిన్ని స్థానాలు గెలుపొందడానికి టీడీపీ నాయకులు వ్యూహాలు రచిస్తున్నారు.jagan-nimmagadda-elections;tiru;jagan;andhra pradesh;district;ananthapuram;police;village;bike;minister;air;anantapuram;tdp;local language;ycpజగడ్డ: అనంతపురంలో మంత్రాలతో ఓటర్లను మారుస్తున్న వైసీపీ కార్యకర్తలు...?జగడ్డ: అనంతపురంలో మంత్రాలతో ఓటర్లను మారుస్తున్న వైసీపీ కార్యకర్తలు...?jagan-nimmagadda-elections;tiru;jagan;andhra pradesh;district;ananthapuram;police;village;bike;minister;air;anantapuram;tdp;local language;ycpSat, 13 Feb 2021 12:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో మొదటి విడత స్థానిక ఎన్నికలు ఒకటి రెండు చోట్ల మినహా ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికలలో ఎవరూ ఊహించని విధంగా వైసీపీ ప్రభంజనాన్ని సృష్టించింది. దాదాపుగా రెండు జిల్లాల్లో మినహా మిగతా జిల్లాలో ఫ్యాన్ గాలి మాములుగా లేదు. ప్రతి పక్ష పార్టీలు సైతం నోరెళ్లబెట్టేలా వైసీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకున్నారు ప్రజలు. దీనిని బట్టి ఈ రెండు సంవత్సరాల జగన్ పాలనను స్వాగతించారనిపిస్తోంది. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం గురించి మరియు వైసీపీ గురించి చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది.

అయితే ఇవన్నీ ఇలా ఉంటే రాష్ట్రంలో రెండవ విడత పోలింగు ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఉదయం పోలింగు కొంచెం మందకొడిగా సాగినప్పటికీ, ఇప్పుడిప్పుడే పోలింగు శాతం జోరందుకుంది. రెండవ విడత ఎన్నికల్లో అయినా మరిన్ని స్థానాలు గెలుపొందడానికి టీడీపీ నాయకులు వ్యూహాలు రచిస్తున్నారు. ఇది ఇలా ఉంటే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బట్టువానిపల్లి మరియు వర్లి గ్రామాలలో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే ఇవాళ ఉదయం 6.30 గంటల నుండి పోలింగు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

అదే గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ పెద్దన్న చుట్టుపక్కలున్న పోలింగు కేంద్రాల చుట్టూ బైక్ లో తిరుగుతూ, ఒక్కో సెంటర్ దగ్గర  అక్షింతలను చల్లడం ఇప్పుడు వివాదాస్పదం అయింది. దీనితో అక్కడి టీడీపీ కి చెందిన మద్దతుదారులు వైసీపీ కి చెందిన కార్యకర్తలే కావాలని ఇలా చేయిస్తున్నారని, వారు మంత్రించిన అక్షింతలను చల్లడం ద్వారా ఓటర్లంతా వైసీపీకి ఓటు వేసేలాగా చేస్తున్నారని వివాదాన్ని సృష్టించారు. ఇది తెలిసిన అక్కడ గ్రామంలోని ప్రజలంతా ఈ విషయం గురించి జోరుగా చర్చలు మొదలుపెట్టేశారు. ఇప్పటికైతే దీని గురించి ఎన్నికల అధికారులు కానీ, ఇటు పోలీసులు కానీ స్పందించినట్టు తెలియలేదు. మరి ఈ వివాదం ఎంత దూరం వెళుతుందో తెలియాల్సి ఉంది. రెండవ విడతలో ఎన్నికలు కూడా ప్రస్తుతానికి ప్రశాంతంగానే జరుగుతున్నాయి.


వెబ్ సైట్ లాంచ్ చేసిన సజ్జల... ఇదీ వైసీపీ లెక్క

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>