PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pregnant-woman881e89ed-5267-43a9-bdb1-16a525f98b96-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pregnant-woman881e89ed-5267-43a9-bdb1-16a525f98b96-415x250-IndiaHerald.jpgనిండు గర్భిణిని తన భర్తే సజీవ దహనం చేశాడు. అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు నిలదీసినందుకు కనికరం లేకుండా కడతేడ్చాడు. పెళ్లే 12 ఏళ్ల తర్వాత గర్భవతి అయినా ఆమెను పట్టించుకోవడం మరిచాడు. గర్భివతి కానప్పుడు అత్తారింటి వాళ్లు హేళన చేయడం.. భర్త వేధింపులకు పాల్పడటం జరిగేది. దీంతో ఆమె భర్త కూడా మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. pregnant woman;women;anjali;district;police;husband;wife;woman;local languageనిండు గర్భిణి సజీవ దహనం చేసిన భర్త.. ఎందుకంటే..!?నిండు గర్భిణి సజీవ దహనం చేసిన భర్త.. ఎందుకంటే..!?pregnant woman;women;anjali;district;police;husband;wife;woman;local languageSat, 13 Feb 2021 07:00:00 GMTభర్త వేధింపులకు పాల్పడటం జరిగేది. దీంతో ఆమె భర్త కూడా మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఎందుకిలా చేస్తున్నావని గర్భిణి భార్య అడిగినందుకు ఈ దారుణానికి ఒడిగట్టాడు ఆ భర్త.

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావో జిల్లా నాథుకెడకు చెందిన అఖిలేష్‌కు.. కాన్పూర్‌ నవాబ్‌గంజ్‌కు చెందిన అంజలితో 12 ఏళ్ల కిందట వివాహమైంది. అయితే ఇన్నేళ్లైనా ఆమెకు సంతానం కలగకపోవడంతో భర్త అడ్డదారులు తొక్కాడు. ఆమెకు పిల్లలు కలగడం లేదని మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పిల్లలు పుట్టడం లేదని అంజలిని ప్రతిరోజు వేధించేవాడు. ఈ క్రమంలో ఇటీవలే అంజలి గర్భం దాల్చింది.

అంజలికి తొమ్మిది నెలలు నిండాయి. కానీ అంజలి తరచూ భర్త అక్రమ సంబంధం గురించి నిలదీసేది. వేరే మహిళ దగ్గరికి వెళ్లినప్పుడు మందలించేది. దీంతో ఆమె భర్త తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. దీంతో అంజలిని చంపాలనుకున్నాడు. అంజలిని వైద్యుడికి దగ్గరికి తీసుకెళ్తా అని బుధవారం సాయంత్రం ఇంటి నుంచి బయలు దేరాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కూర్చొబెట్టాడు. అక్కడ ఉన్న ఇటుకలు తీసుకుని అంజలిపై దాడికి పాల్పడ్డాడు. గర్భిణి అని కనికరం లేకుండా ఇటుకతో కొట్టి చంపాడు. కొన ఊపిరితో ఉన్న ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించి.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

మరుసటి రోజు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో ఆనవాళ్లు గుర్తించేందుకు ప్రయత్నించారు. గర్భవతి కావడంతో నిందితుడు అఖిలేశ్ ఇంటికి వెళ్లి చూశారు. అయితే అక్కడ అఖిలేశ్ లేకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


రెండో దశ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం.. ఎక్కడెక్కడ అంటే..?

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>