Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajamoulif2b34ca4-8733-463c-af86-ee8c648d1c88-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajamoulif2b34ca4-8733-463c-af86-ee8c648d1c88-415x250-IndiaHerald.jpgఆర్ఆర్ఆర్ విషయంలో నిర్మాత బోనీకపూర్, దర్శకుడు రాజమౌళి మధ్య వివాదం ఇంకా సర్దుమణిగినట్లు లేదు. ఇంతకుముందే ఆర్ఆర్ఆర్ విడుదల తేదీ విషయంలో జక్కన్నపై బోనీకపూర్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజగా మరోసారి అదే విషయంలో బోనీకపూర్ మళ్లీ నోరు విప్పాడు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌లో అజయ్‌దేవ్‌గణ్‌ కీలకపాత్ర పోషిస్తున్నాడని, అలాగే తన నిర్మాణంలోనే..rajamouli;boney kapoor;rajamouli;bollywood;rrr movie;cinema;producer;interview;producer1;hero‘రాజమౌళిని నమ్మలేను..’ ఇంత మాట అన్నాడేంటి..?‘రాజమౌళిని నమ్మలేను..’ ఇంత మాట అన్నాడేంటి..?rajamouli;boney kapoor;rajamouli;bollywood;rrr movie;cinema;producer;interview;producer1;heroSat, 13 Feb 2021 12:27:32 GMTఇంటర్నెట్ డెస్క్: ఆర్ఆర్ఆర్ విషయంలో నిర్మాత బోనీకపూర్, దర్శకుడు రాజమౌళి మధ్య వివాదం ఇంకా సర్దుమణిగినట్లు లేదు. ఇంతకుముందే ఆర్ఆర్ఆర్ విడుదల తేదీ విషయంలో జక్కన్నపై బోనీకపూర్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజగా మరోసారి అదే విషయంలో బోనీకపూర్ మళ్లీ నోరు విప్పాడు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌లో అజయ్‌దేవ్‌గణ్‌ కీలకపాత్ర పోషిస్తున్నాడని, అలాగే తన నిర్మాణంలోనే వస్తున్న బాలీవుడ్ సినిమా ‘మైదాన్‌’లోనూ అజయ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడని, అయితే ఈ రెండు సినిమాలనూ ఒకేసారి విడుదల చేస్తే తనకు నష్టం కలుగుతుందని బోనీకపూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 ‘విడుదల తేదీల విషయమై ఇటీవల రాజమౌళితో ఫోన్‌లో మాట్లాడాను. విడుదల తేదీతో తనకు సంబంధం లేదని.. అది నిర్మాతల ఇష్ట ప్రకారం జరిగిందని ఆయన చెప్పారు. కానీ, ఆయన మాటల్ని నేను నమ్మాలనుకోవడం లేదు. నాకు తెలిసి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదల గురించి అజయ్‌కు కూడా ముందుగా సమాచారం ఇచ్చారని నేను అనుకోవడం లేదు. ఇండస్ట్రీలో మంచి పేరున్న రాజమౌళి నుంచి ఇలాంటి సమస్య ఎదుర్కోవల్సి వస్తుందని ఎన్నడూ ఊహించలేదు’ అంటూ బోనీకపూర్‌ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘మైదాన్‌’ విడుదల తేదీలపై గత కొన్నిరోజుల నుంచి కోల్డ్‌వార్‌ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా బోనీకపూర్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఒకే నెలలో, అది కూడా కేవలం రెండు రోజుల తేడాతో ఒకే హీరో నటించిన చిత్రాలను విడుదలకు రావడం దురదృష్టకరమని బోనీకపూర్ ఆవేదన వ్యక్తం చేశారు.

‘ఈ చిత్రాన్ని గతేడాదిలోనే విడుదల చేయాలనుకున్నాం. అయితే కరోనా కారణంగా షూటింగ్‌ నిలిచిపోయింది. సినిమా కోసం మేము అనుకున్న దానికంటే భారీగానే ఖర్చుపెట్టాం. ఈ ఏడాదిలో చిత్రీకరణ తిరిగి ప్రారంభించిన సమయంలోనే అక్టోబర్‌ 15న ‘మైదాన్‌’ విడుదల చేస్తామని ప్రకటించాం. మా సినిమా విడుదల తేదీని ప్రకటించిన కొన్ని రోజులకే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ని అక్టోబర్‌ 13న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం వెల్లడిచింది. ఒకే హీరోకు చెందిన రెండు భారీ ప్రాజెక్ట్‌లు కేవలం రెండు రోజుల తేడాతో విడుదల కావడం ఏంటి..? ఇది పూర్తిగా అనైతికం’ అంటూ బోనీకపూర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.




నెట్టింట తెగ వైరల్ అవుతున్న ప్రభాస్ సోలార్ బైక్ ఫోటో..

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>