PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap cm chandra babu .-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap cm chandra babu .-415x250-IndiaHerald.jpgచంద్ర‌బాబు వ్యూహం స‌క్సెస్ అయిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. మెజారిటీ పంచాయ‌తీలు వైసీపీ వైపే ఉన్నాయ‌నే ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపించింది. గుంటూరు జిల్లా య‌డ్ల‌పాడు, విజ‌య‌న‌గ‌రం జిల్లా మ‌సిమండ‌, చిత్తూరు జిల్లా కోళ్ల‌బైలు వంటి చోట్ల అత్యంత స్వ‌ల్పంగా టీడీపీ పంచాయ‌తీల్లో విజ‌యం ద‌క్కించుకుంది త‌ప్ప‌.. ఎక్క‌డా కూడా చంద్ర‌బాబు ఊహించిన ఫ‌లితం మాత్రం క‌నిపించ‌డం లేదు. వైసీపీ భారీ ఎత్తున పంచాయ‌తీల‌ను త‌న ఖాతాలో వేసుకుంటోంది. దీంతో అస‌లు చంద్ర‌బాబు ఏం ఆశించారు.. ఏం జ‌రుగుతోంది? అనే అనే వాద‌న తెర‌మీదికి chandra babu;view;district;court;letter;tdp;ycp;partyవ‌ర్క‌వుట్ కాని.. బాబు.. `ఆందోళ‌న`‌.. రెండో విడ‌త దారుణం..!వ‌ర్క‌వుట్ కాని.. బాబు.. `ఆందోళ‌న`‌.. రెండో విడ‌త దారుణం..!chandra babu;view;district;court;letter;tdp;ycp;partySat, 13 Feb 2021 18:45:00 GMTటీడీపీ అధినేత చంద్ర‌బాబు `ఆందోళ‌న` వ‌ర్కువుట్ కాలేదు. తొలివిడ‌త పంచాయ‌తీఎన్నిక‌ల్లో పార్టీ ఘోరం గా దెబ్బ‌తిన్న నేప‌థ్యంలో రెండో విడ‌త‌లో అయినా పుంజుకునేలా ఆయ‌న వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఈ క్ర‌మంలోనే త‌మ‌కు అన్యాయం చేస్తున్నార‌ని.. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏక‌గ్రీవాల‌ను బ‌ల‌వంతంగా చేసు కుంటున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు సైతం సంధించారు. ఇది పార్టీకి సింప‌తీగా మారుతుంద‌ని అనుకున్నారు. కానీ.. ఎక్క‌డా ఆ ప‌రిస్థితి రెండో విడ‌త పంచాయ‌తీ ఎన్నిక‌ల్లోనూ క‌నిపించ‌లేదు.

తాజాగా వ‌స్తున్న రెండో విడ‌త పంచాయ‌తీ ఎన్నిక‌ల ఫలితాల స‌ర‌ళిని గ‌మ‌నిస్తే.. చంద్ర‌బాబు వ్యూహం స‌క్సెస్ అయిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. మెజారిటీ పంచాయ‌తీలు వైసీపీ వైపే ఉన్నాయ‌నే ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపించింది. గుంటూరు జిల్లా య‌డ్ల‌పాడు, విజ‌య‌న‌గ‌రం జిల్లా మ‌సిమండ‌, చిత్తూరు జిల్లా కోళ్ల‌బైలు వంటి చోట్ల అత్యంత స్వ‌ల్పంగా టీడీపీ పంచాయ‌తీల్లో విజ‌యం ద‌క్కించుకుంది త‌ప్ప‌.. ఎక్క‌డా కూడా చంద్ర‌బాబు ఊహించిన ఫ‌లితం మాత్రం క‌నిపించ‌డం లేదు. వైసీపీ భారీ ఎత్తున పంచాయ‌తీల‌ను త‌న ఖాతాలో వేసుకుంటోంది. దీంతో అస‌లు చంద్ర‌బాబు ఏం ఆశించారు.. ఏం జ‌రుగుతోంది? అనే అనే వాద‌న తెర‌మీదికి వ‌చ్చింది.

తొలి విడ‌త‌లో చంద్ర‌బాబు ఆశించిన పంచాయ‌తీలకు త‌ర్వాత‌.. వ‌చ్చిన లెక్కకు మ‌ధ్య చాలా వ్య‌త్యాసం క‌నిపించింది. దీంతో రెండో విడ‌త‌లో అయినా.. పార్టీ పుంజుకుంటుంద‌ని ధీమాగా ఉన్నా.. ఎక్క‌డో ఆవేద‌న వుంది. ఈ నేప‌థ్యంలో పార్టీ శ్రేణుల్లో ఒకింత ఊపు తెచ్చేలా.. వైసీపీపై విరుచుకుప‌డ్డారు. ఎక్క‌డిక‌క్క‌డ వైసీపీ నాయ‌కులు రెచ్చిపోయార‌ని.. ప్ర‌జ‌లు అంతా గ‌మ‌నిస్తున్నార‌ని ఆందోళ‌న చేశారు. ఇక‌, కోర్టుల దృష్టికి కూడా తొలి ద‌శ పంచాయ‌తీ ఎన్నిక‌ల విష‌యాన్ని తీసుకువెళ్లారు. అయిన‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు ఆశించిన మేర‌కు ఫ‌లితం ద‌క్క‌లేదు. రెండో ద‌శ ఫ‌లితాలు చూస్తే.. తొలి ద‌శే బెట‌ర్ అనేలా ఉండ‌డం గ‌మ‌నార్హం. అందుకే.. బాబు ఆందోళ‌న వ‌ర్క‌వుట్ కాలేద‌నే కామెంట్లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.




బ్రేకింగ్‌: నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక‌.. టీడీపీ అభ్య‌ర్థి ఖ‌రారు

కొడాలి ఇలాకాలో ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ... వింత గెలుపు

కాపు వేదన : జగనోరి వల్లే..ముద్రగడ వెనక్కి తగ్గరా ,,??

బ్రేకింగ్‌: కృష్ణాలో టీడీపీ ఘోర ప‌రాజ‌యం... ఎంత దారుణం అంటే..

బ్రాహ్మ‌ణ ఘోష‌: వెలంప‌ల్లి పై ఎందుకింత వ్య‌తిరేక‌త‌..?

కాపు వేద‌న‌: కాపుల ముఖాల్లో ఇక `వెలుగు` చూడ‌లేమా ?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్.. పేరు గొప్ప‌.. ఊరు దిబ్బ‌కేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>