KidsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/children7f692db3-9990-4745-a1b0-0397f65ecd0b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/children7f692db3-9990-4745-a1b0-0397f65ecd0b-415x250-IndiaHerald.jpgపిల్లలు ఆరోగ్యాంగా ఎదగాలంటే పిల్లలకు సరైన పోషకాలు ఉన్న ఆహారం అందించాలి. అయితే పిల్లలకు అందించే పోషకాహారంలో నెయ్యి ఒక్కటి. దీనిని పిల్లలకు పెట్టడం వలన వారికీ ఎదుగుదల మంచిగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక నెయ్యి తీసుకొంటే కొలెస్ట్రాల్ సమస్య వస్తుందని అందరి నమ్మకం. అయితే ఇది అందర్నీ బాధిస్తుందని మాత్రం చెప్పలేం. ముందు నుంచి కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు నెయ్యి వాడకం తగ్గించాలి. children;tara;sathwara;aqua;cholesterol;ghee;neemబుడుగు: పిల్లల ఎదుగుదలకు విలువలైన పౌష్టికాహారం ఇదే..!?బుడుగు: పిల్లల ఎదుగుదలకు విలువలైన పౌష్టికాహారం ఇదే..!?children;tara;sathwara;aqua;cholesterol;ghee;neemSat, 13 Feb 2021 17:00:00 GMTనెయ్యి ఒక్కటి. దీనిని పిల్లలకు పెట్టడం వలన వారికీ ఎదుగుదల మంచిగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక నెయ్యి తీసుకొంటే కొలెస్ట్రాల్ సమస్య వస్తుందని అందరి నమ్మకం. అయితే ఇది అందర్నీ బాధిస్తుందని మాత్రం చెప్పలేం. ముందు నుంచి కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు నెయ్యి వాడకం తగ్గించాలి. ఒక్కోసారి శరీరంలో కొవ్వు శాతం పెరగడానికి శారీరక మార్పులు, ఇతర ఆహార పదార్థాలు కూడా కారణమయ్యే అవకాశం ఉంది.

అంతేకాదు నెయ్యి బలహీనంగా ఉన్నవారికి చాలా మేలు చేస్తుంది. పిత్తం, వాతాన్ని తగ్గిస్తుంది. చర్మానికి కాంతిని ఇస్తుంది. మెదడు పనితీరు మెరుగు పరుస్తుంది. నిపుణులు దీన్ని మానసిక సమస్యలకు ఔషధంగా కూడా ఇస్తారు. ఇంకా తీసుకొన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.

ఇక ఆకలి మందగించినప్పుడు మిరియాల పొడిలో నెయ్యి కలిపి మొదటి ముద్దలో తీసుకొంటే చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఎదిగే పిల్లలకు ఎముక పుష్టిగా ఉండేందుకు గ్లాసు పాలలో చెంచా నెయ్యి వేసి తాగిస్తే మంచిది. అరటి పండు గుజ్జులో, కొద్దిగా పాలు, కొద్దిగా నెయ్యి కలిపి పిల్లలకు తినిపిస్తే అవయవాలు దృఢంగా అవుతాయి. బరువు పెరుగుతారు. పొడి చర్మతత్వం, ఎగ్జిమా, సొరియాసిస్ వంటి సమస్యలతో బాధపడేవారు పావు చెంచా వేప గింజల పొడిలో, పావు చెంచా నెయ్యి జోడించి మొదటి ముద్దతో కలిపి తింటే సత్వర ఉపశమనం దొరుకుతుంది.

అంతేకాదు కాలిన బొబ్బల మీద నెయ్యిని పైపూతగా రాస్తుంటే మచ్చలు పడకుండా త్వరగా మానిపోతాయి. ముక్కు నుంచి రక్తస్రావమవుతోంటే రంధ్రాల్లో మూడు నాలుగు చుక్కలు నెయ్యి వేస్తే ఫలితం కనిపిస్తుంది. పనిపిల్లలకు నెయ్యి లేదా వెన్నను ఒంటికి రాసి కాసేపయ్యాక స్నానం చేయిస్తే చర్మం మృదువుగా మారుతుంది. క్షయవ్యాధి, మలబద్ధకం, విరేచనాలు, జ్వరంతో బాధపడేవారు, వృద్ధులు నెయ్యికి దూరంగా ఉండాలి.




ఘోరం.. దోపిడీ దొంగలు ఎంతటి దారుణానికి పాల్పడ్డారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

బ్రాహ్మ‌ణ ఘోష‌: వెలంప‌ల్లి పై ఎందుకింత వ్య‌తిరేక‌త‌..?

కాపు వేద‌న‌: కాపుల ముఖాల్లో ఇక `వెలుగు` చూడ‌లేమా ?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్.. పేరు గొప్ప‌.. ఊరు దిబ్బ‌కేనా ?

సమంత, నాగ చైతన్య ఉంటున్న ఇల్లు చూసారా.. ఇంద్రభవనం కూడా ఎందుకు పనికి రాదు

"అవి మానుకో "..సమంతకు గట్టి వార్నింగ్ ఇచ్చిన నాగార్జున..??

బుల్లితెర ప్రభాకర్ కి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>