PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/cm-jaganf073b2ef-afc3-433d-889c-de63de956a50-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/cm-jaganf073b2ef-afc3-433d-889c-de63de956a50-415x250-IndiaHerald.jpgవైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు అంశాలు సీఎం జగన్ ని ఇబ్బంది పెడుతున్నాయి. ఒకటి ఇసుక విధానం కాగా, రెండోది మద్యం పాలసీ. టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన ఇసుక విధానంలో మార్పులు చేసి కొత్త విధానం తీసుకు రావడంతో రేట్లు అమాంతం పెరిగాయి. దీంతో గృహనిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. దీనికి కారణం వైసీపీ ప్రభుత్వ విధానాలేనంటూ విమర్శలు మొదలయ్యాయి. ఇప్పటికి కూడా ఇసుక పాలసీపై స్థిరమైన నిర్ణయానికి రాలేకపోతోంది ప్రభుత్వం. cm jagan;cbn;amala akkineni;nithya new;jagan;police;tdp;ycp;sara shrawanఅధికారులపై సీఎం జగన్ ఆగ్రహం.. కారణం ఏంటంటే..?అధికారులపై సీఎం జగన్ ఆగ్రహం.. కారణం ఏంటంటే..?cm jagan;cbn;amala akkineni;nithya new;jagan;police;tdp;ycp;sara shrawanSat, 13 Feb 2021 07:00:00 GMTవైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు అంశాలు సీఎం జగన్ ని ఇబ్బంది పెడుతున్నాయి. ఒకటి ఇసుక విధానం కాగా, రెండోది మద్యం పాలసీ. టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన ఇసుక విధానంలో మార్పులు చేసి కొత్త విధానం తీసుకు రావడంతో రేట్లు అమాంతం పెరిగాయి. దీంతో గృహనిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. దీనికి కారణం వైసీపీ ప్రభుత్వ విధానాలేనంటూ విమర్శలు మొదలయ్యాయి. ఇప్పటికి  కూడా ఇసుక పాలసీపై స్థిరమైన నిర్ణయానికి రాలేకపోతోంది ప్రభుత్వం.

ఇక మద్యం పాలసీని కూడా చాలామంది తప్పుబడుతున్నారు. తక్కువరేటుకి దొరికే మద్యాన్ని ఏపీలో ఎక్కువరేటుకి అమ్ముతున్నారని, దానివల్ల మందుబాబులు మద్యం మానివేయకపోగా.. ఇతర రాష్ట్రాలనుంచి మద్యం అక్రమ రవాణా ఎక్కువవుతోందనే వార్తలొస్తున్నాయి. ప్రతి నిత్యం గ్రామాల్లో నాటు సారాని పోలీసులు ధ్వంసం చేస్తూ వార్తల్లో నిలవడం కూడా రాష్ట్రంలో మద్యం పాలసీలో లోపాలున్నాయనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.

ఈ దశలో మద్యం మద్యం, ఇసుక వ్యవహారాలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా ఉందని, వెంటనే దీనిపై దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారట. మద్యం, ఇసుక వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేవారిని ఉపేక్షించొద్దని సీఎం జగన్ అధికారులకు సూచించారు. ఎక్కడైనా అవకతవకలు జరిగాయని సమాచారం రాగానే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. దాడుల్ని మరింత పెంచాలని ఆదేశించారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి ఏపీలోకి వస్తున్న అక్రమ మద్యాన్ని అడ్డుకునేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. రాబోయే 15 రోజుల్లో కచ్చితంగా మెరుగైన ఫలితాలు రావాలని ఆయన డెడ్ లైన్ విధించారు.

స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో పనితీరు ఇదీ..
ఇసుక, మద్యం అక్రమ రవాణాతో సంబంధమున్న 262 మంది ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు నమోదు చేసినట్టు ఈ సందర్భంగా ఎస్ఈబీ అధికారులు సీఎం జగన్ కు వివరించారు. వీరిలో 82 మంది పోలీసులు కూడా ఉన్నారని చెప్పారు. ఎస్‌ఈబీ ఏర్పాటైన తర్వాత గతేడాది మే 16 నుంచి మద్యం అక్రమాలపై 79,362 కేసులు నమోదుచేశామని, 4,85,009 లీటర్ల మద్యం పట్టుకున్నామని, 4,54,658 లీటర్ల నాటుసారా ధ్వంసం చేశామని వివరించారు. ఎస్ఈబీ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం జగన్.. మరింత కఠినంగా వ్యవహరించాలని వారికి ఆదేశాలిచ్చారు. 


రెండో దశ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం.. ఎక్కడెక్కడ అంటే..?

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>