PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-eletions97b9b512-61fb-4358-8a37-8fae799047c9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-eletions97b9b512-61fb-4358-8a37-8fae799047c9-415x250-IndiaHerald.jpgఏపీలో పంచాయతీ ఎన్నికలు మాత్రమే జరుగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు కాదు, అంతకంటే ఏపీ ముఖ్యమంత్రిని నిర్ణయించే ఎన్నికలు అసలే కాదు, కానీ బడా నాయకుల హడావుడి చూస్తే మాత్రం చావో రేవో అన్నట్లుగా ఈ ఎన్నికలను తీసుకున్నట్లుగా సీన్ కనిపిసోంది. తెలుగుదేశం అయితే ఈ ఎన్నికలను సవాల్ గా తీసుకుని మరీ బరిలోకి దూకుతోంది. jagan-nimmagadda-eletions;cbn;andhra pradesh;telugu;panchayati;parliment;industry;letter;tdp;local language;ycp;partyజగడ్డ : పంచాయతీ ఎన్నికల వేళ బాబు బిగ్ సౌండ్...?జగడ్డ : పంచాయతీ ఎన్నికల వేళ బాబు బిగ్ సౌండ్...?jagan-nimmagadda-eletions;cbn;andhra pradesh;telugu;panchayati;parliment;industry;letter;tdp;local language;ycp;partySat, 13 Feb 2021 08:46:02 GMTపంచాయతీ ఎన్నికలు మాత్రమే జరుగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు కాదు, అంతకంటే ఏపీ ముఖ్యమంత్రిని నిర్ణయించే ఎన్నికలు అసలే కాదు, కానీ బడా నాయకుల హడావుడి చూస్తే మాత్రం చావో రేవో అన్నట్లుగా ఈ ఎన్నికలను తీసుకున్నట్లుగా సీన్ కనిపిసోంది. తెలుగుదేశం అయితే ఈ ఎన్నికలను సవాల్ గా తీసుకుని మరీ బరిలోకి దూకుతోంది.

రెండవ విడత ఎన్నికల వేళ చంద్రబాబు గట్టిగానే ఓటర్లకు పిలుపు ఇచ్చారు. నిజానికి ఇలా పిలుపు  ఇవ్వవచ్చో లేదో ఎన్నికల నిబంధలనలకు అది అనుకూలమో ప్రతికూలమో కూడా తెలియదు కానీ వైసీపీ మద్దతుదారులను పల్లెల్లో ఓడించి తమ మద్దతుదారులకు పట్టం కట్టాలని బాబు కోరారు. పంచాయతీ ఎన్నికల కోసం ప్రత్యేకంగా ఎన్నికల ప్రణాళికను కూడా విడుదల చేసిన చంద్రబాబు ఇపుడు ఏకంగా జనాలకే తమకు ఓటేయాలని  అప్పీల్ చేస్తున్నారు.

పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరిగేవి. ఆ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉండవు. రాజకీయ జోక్యం ఎంత తక్కువగా ఉంటే గ్రామాలు అంత బాగుంటాయి. కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా రాజకీయ రంగునే పులుముతున్నాయి. తమ పార్టీ కండువాలు కప్పించి మరీ అభ్యర్ధులతో  ప్రచారాన్ని కూడా చేయిస్తున్నాయి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు లోకల్ గా నాయకులు చేశారంటే సరే. కానీ చంద్రబాబు లాంటి ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ ఇలా వైసీపీ మద్దతుదారులు, టీడీపీ మద్దతుదారులు అంటూ పల్లె రాజకీయానికి తెర తీయడమే బాబులేదని అంతా అంటున్నారు.

ఇదిలా ఉండగా తొలి విడత ఎన్నికల్లో తెలుగుదేశం డీలా పడిందని వార్తలు వస్తున్న నేపధ్యంలో రెండవ విడత ఎన్నికల్లో పుంజుకోవాలని ఆ పార్టీ చూస్తోంది. దాంతో పల్లె పోరు లో పై చేయి కోసం బాబు ఇలా పిలుపు ఇచ్చారని భావిస్తున్నారు.  ఏది ఏమైనా పంచాయతీ ఎన్నికల్లో జనాలు తమకు నచ్చిన అభ్యర్ధిని ఎన్నుకుంటారు. గ్రామాభివృద్ధికి పాటు పడే వారు గెలుస్తారు అని ఎన్నికల సంస్కరణలు కోరుకుంటున్న వారు అభిలషిస్తున్నారు. 






బిగ్ బాస్ హోస్ట్ గా మోహన్ లాల్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాప్ కి గురవుతారు..!

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>