PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/this-is-the-staraight-question-about-fuel-hike4f96f8e3-8df1-4219-8244-52d1e76aceae-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/this-is-the-staraight-question-about-fuel-hike4f96f8e3-8df1-4219-8244-52d1e76aceae-415x250-IndiaHerald.jpgఅడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న పెట్రోల్ ధ‌ర‌లు సామాన్యుడి గుండెల్లో ద‌డ పుట్టిస్తున్నాయి. రోజురోజుకు పైకి ఎగ‌బాకుతూ లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.100కి చేరువ‌వుతోంది. దీంతో ప్రైవేటు ఉద్యోగులు, మ‌ధ్య‌, దిగువ త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు పెట్రోల్ ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై ఆందోళ‌న చెందుతున్నారు. పెట్రోల్‌తో పాటు డీజిల్ ధ‌ర‌లు పెరుగుతుండ‌టంతో క్ర‌మంగా నిత్యావ‌స‌రాల ధ‌ర‌ల పెరుగుద‌లల్లోనూ పెరుగుద‌ల క‌నిపిస్తోంది. తాజాగా ఐదో రోజు ధరలు పెరిగాయి. శనివారం లీటర్‌ పెట్రోల్‌పై 38 పైసలు, లీటర్‌ డీజిల్‌పై 30 పైసలు పెంచాయి చమురు సంస్petrol;dharmendra;bengaluru 1;petrol;diesel;minister;central government;96పెట్రోల్ ధ‌ర‌ల‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్రం... ఎంత‌లా పెరుగుతాయో తెలుసా..?పెట్రోల్ ధ‌ర‌ల‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్రం... ఎంత‌లా పెరుగుతాయో తెలుసా..?petrol;dharmendra;bengaluru 1;petrol;diesel;minister;central government;96Sat, 13 Feb 2021 09:58:41 GMTపెట్రోల్ ధ‌ర‌లు సామాన్యుడి గుండెల్లో ద‌డ పుట్టిస్తున్నాయి. రోజురోజుకు పైకి ఎగ‌బాకుతూ లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.100కి చేరువ‌వుతోంది. దీంతో ప్రైవేటు ఉద్యోగులు, మ‌ధ్య‌, దిగువ త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు పెట్రోల్ ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై ఆందోళ‌న చెందుతున్నారు. పెట్రోల్‌తో పాటు డీజిల్ ధ‌ర‌లు పెరుగుతుండ‌టంతో క్ర‌మంగా నిత్యావ‌స‌రాల ధ‌ర‌ల పెరుగుద‌లల్లోనూ పెరుగుద‌ల క‌నిపిస్తోంది.  తాజాగా ఐదో రోజు ధరలు పెరిగాయి. శనివారం లీటర్‌ పెట్రోల్‌పై 38 పైసలు, లీటర్‌ డీజిల్‌పై 30 పైసలు పెంచాయి చమురు సంస్థలు. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.88.44 ఉండగా, డీజిల్‌ రూ.78.74 పైసలు ఉంది. ఇక హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.91.96 ఉండగా, డీజిల్‌ 85.89 పైసలు ఉంది.


ముంబైలో పెట్రోల్‌ ధర రూ.94.93 ఉండగా, డీజిల్‌ రూ.85.70కి చేరింది. ఇక చెన్నైలో పెట్రోల్‌ ధర రూ.90.70 ఉండగా, డీజిల్‌ రూ.83.86 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్‌ ధర రూ.89.73 ఉండగా, డీజిల్‌ రూ.82.33 ఉంది. బెంగళూరులో పెట్రోల్‌ ధర రూ.91.40 ఉండగా, డీజిల్‌ ధర రూ.83.47. కొన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధరలు రూ.90 దాటగా, మరికొన్ని స్టేట్స్‌‌లో రూ.90లోపుగా ఉన్నాయి.  తమ జేబులకు భారీగా చిల్లులు పడుతుండటంతో దీనిపై వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోల్ రేట్ల తగ్గింపుపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. ఇప్పట్లో పెట్రో రేట్లు తగ్గే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. పెట్రోల్ మీద పన్నులు తగ్గించే ప్రపోజల్స్ కేంద్రానికి లేవని రాజ్యసభలో ప్రధాన్ క్లారిటీ ఇచ్చారు.



పెట్రో ధరలకు కళ్లెం వేయాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొంత ఆదాయాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. కేంద్రం ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించినా.. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ తగ్గించినా ధరలు కొంత తగ్గుతాయి. వీటిని జీఎస్టీ పరిఽధిలోకి తీసుకొస్తే వినియోగదారుడిపై భారం గణనీయంగా తగ్గిపోతుంది. జీఎస్టీలో అత్యధిక పన్ను శ్లాబు (28ు) పరిధిలోకి చేర్చినా పెట్రో ధరలు భారీగా తగ్గుతాయి.  రాష్ట్రాలు అదనపు ఆదాయాన్ని వదులుకుంటే పెట్రో ధరలను తగ్గించవచ్చని సూచించింది.


కొడాలి నానీకి నిమ్మగడ్డ రమేష్ షాక్

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>