PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/behind-reason-for-araku-tragedyb49b67c5-a177-411c-b401-b2f1c9ccfc2d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/behind-reason-for-araku-tragedyb49b67c5-a177-411c-b401-b2f1c9ccfc2d-415x250-IndiaHerald.jpgఆ కుటుంబాలకు, కుటుంబ సభ్యులకు ఓ అలవాటు ఉంది. చిన్నదయినా, పెద్దదయినా ఏ ఫంక్షన్ జరిగినా.. అందరూ ఒకేచోట చేరుకుంటారు. దాదాపు 300మంది సభ్యులు ఒక చోట కలవాల్సిందే. అంతటి ఆప్యాయత, అనుబంధం ఆ కుటుంబాల మధ్య ఉంది. అయితే కరోనా కష్టకాలం వీరందర్నీ విడదీసింది. కలవకుండా రోజులు కూడా ఉండలేని వారిని, నెలలపాటు వేర్వేరుగా ఉంచింది. దీంతో కుటుంబ సభ్యులంతా ఇటీవల ఓ ప్రణాళిక వేసుకున్నారు. కరోనా భయం తొలగిపోయి.. ఇప్పుడిప్పుడే ప్రయాణాలు మొదలు కావడంతో అందరూ విహార యాత్రకు వెళ్దామనుకున్నారు. ఆ ఆలోచనే వారి కుటుంబాల్లో విషాదం నింaraku tragedy;darshana;paandu;tiru;visakhapatnam;hyderabad;vijayawada;vishakapatnam;bus;house;araku valleyఅరకు విషాదం: ఆ అలవాటే వారి ప్రాణాలు తీసిందా..?అరకు విషాదం: ఆ అలవాటే వారి ప్రాణాలు తీసిందా..?araku tragedy;darshana;paandu;tiru;visakhapatnam;hyderabad;vijayawada;vishakapatnam;bus;house;araku valleySat, 13 Feb 2021 09:00:00 GMT
రిజర్వ్‌బ్యాంకు అధికారిగా పనిచేసి పదవీ విరమణ పొందిన కొట్టం సత్యనారాయణ, తన కుటుంబ సభ్యులతో కలసి హైదరాబాద్ షేక్‌ పేటలో నివసిస్తున్నారు. సత్యనారాయణకు వరుసయ్యే సోదరులు నరసింహారావు, పాండులు కూడా అక్కడే ఉంటున్నారు. మరో ఇద్దరు సోదరులు మణికొండలోని పంచవటి కాలనీలో ఉంటారు. నరసింహారావు, పాండు, సత్యనారాయణ కుటుంబాల్లో మొత్తం 300 మంది సభ్యులు ఉంటారని తెలుస్తోంది. హైదరాబాద్, లేదా ఆ పరిసరాల్లో వీరి కుటుంబాలకు సంబంధించి ఏ చిన్న వేడుక జరిగినా, మొత్తం 300మంది హాజరవ్వాల్సిందే. ఐదుగురు అన్నదమ్ముల పిల్లల్లో కొందరు ప్రైవేటు ఉద్యోగాలు, మరికొందరు వ్యాపారాలు చేస్తున్నారు. కొవిడ్‌ మహమ్మారి కారణంగా ఇప్పటి వరకూ వీరు కలసి ఎక్కడికీ వెళ్లలేకపోయారు. తీరా ఇప్పుడు కరోనా భయం తగ్గడంతో.. విజయవాడ,  వైజాగ్ టూర్ కి నరసింహారావు ప్లాన్ చేయగా మిగతా కుటుంబ సభ్యులంతా సరే అన్నారు. ఈనెల 10న వీరంతా హైదరాబాద్ నుంచి బయలుదేరారు.

ముందుగా బెజాడ దుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. గురువారం రాత్రి సింహాచలం గెస్ట్ హౌస్ లో విశ్రాంతి తీసుకుని, శుక్రవారం ఉదయం అరకు వెళ్లారు. అక్కడ సరదాగా గడిపి, తిరుగు ప్రయాణంలో బొర్రా కేవ్స్ కి వచ్చారు. అక్కడినుంచి తిరిగి సింహాచలం గెస్ట్ గౌస్ కి వచ్చే క్రమంలో వీరు ప్రయాణిస్తున్న ట్రావెల్స్ బస్సు లోయలో పడిపోయింది. 80 అడుగుల లోతులో పడిపోవడంతో బస్సులో ఉన్న నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. గాయపడిన 22మందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏ చిన్న కార్యక్రమం అయినా ఒకరితో ఒకరు కలసి సరదాగా జరుపుకునే అలవాటు ఉండటంతో.. తరచూ వీరంతా ఇలా విహార యాత్రలకు వెళ్లేవారు. ఆ అనుబంధం, ఆత్మీయత నేడు వారి మధ్య దూరమయ్మయాయి. కుటుంబ సభ్యుల్లో తీరని వేదన మిగిల్చాయి. 


బిగ్ బాస్ హోస్ట్ గా మోహన్ లాల్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాప్ కి గురవుతారు..!

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>