PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-nimmagadda6f051f6f-5272-4fc6-bc2f-de31f66669ba-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-nimmagadda6f051f6f-5272-4fc6-bc2f-de31f66669ba-415x250-IndiaHerald.jpgఏపీ రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఇన్నాళ్లూ నిమ్మగడ్డను సపోర్ట్ చేసిన చంద్రబాబు ఇప్పుడు ఆయన కూడా సరిగ్గా పని చేయడం లేదని మండిపడుతున్నారు. ఏకంగా ఆయన తీరు సరిగ్గా లేదని.. అక్రమాలు అడ్డుకోలేకపోతున్నారని హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల సందర్భంగా నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డంకులు సృష్టించడం, బలవంతంగా ఉపసంహరింపచేయడం జరుగుతున్నా నిమ్మగడ్డ తగిన చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. నిమ్మగడ్డ తన అధికారాలు ఉపయోగించుకోవాలని ఆదేశిchandrababu-nimmagadda;hari;hari music;tiru;andhra pradesh;high court;marchజగడ్డ: నిమ్మగడ్డకు హైకోర్టుతో షాక్ ఇప్పించిన చంద్రబాబు ?జగడ్డ: నిమ్మగడ్డకు హైకోర్టుతో షాక్ ఇప్పించిన చంద్రబాబు ?chandrababu-nimmagadda;hari;hari music;tiru;andhra pradesh;high court;marchSat, 13 Feb 2021 08:00:00 GMTఏపీ రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఇన్నాళ్లూ నిమ్మగడ్డను సపోర్ట్ చేసిన చంద్రబాబు ఇప్పుడు ఆయన కూడా సరిగ్గా పని చేయడం లేదని మండిపడుతున్నారు. ఏకంగా ఆయన తీరు సరిగ్గా లేదని.. అక్రమాలు అడ్డుకోలేకపోతున్నారని హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల సందర్భంగా నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డంకులు సృష్టించడం, బలవంతంగా ఉపసంహరింపచేయడం జరుగుతున్నా నిమ్మగడ్డ తగిన చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటీషన్‌పై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. నిమ్మగడ్డ తన అధికారాలు ఉపయోగించుకోవాలని ఆదేశించింది. అన్ని అధికారాలనూ వినియోగించి, ఎప్పటికప్పుడు యంత్రాంగానికి తగిన ఆజ్ఞలు జారీ చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ప్రస్తుతం జరుగుతున్న, భవిష్యత్తులో జరగనున్న ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహిస్తారని ఆశిస్తూ ఈ ఆదేశాలిచ్చింది. ఇదే అంశాలకు సంబంధించి పలు వ్యాజ్యాలు దాఖలైన నేపథ్యంలో ఈ తరహా ఉత్తర్వులిస్తున్నామని పేర్కొంది. పిటిషనర్లు సమర్పించిన ఫిర్యాదులు, వినతులను పరిగణనలోకి తీసుకొని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది.

స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పాక్షిక ఎన్నికలు ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యానికి పునాది అన్న హైకోర్టు...  అభ్యర్థులు ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా పోటీ చేయడం... భయాందోళన, బెదిరింపులకు గురికాకుండా ఓటు హక్కును వినియోగించుకోగలిగే ఎన్నికలు ప్రజాస్వామ్య పితామహుల ఆకాంక్షగా వర్ణించింది.నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించేందుకు, తగిన విధంగా వ్యవహరించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు విస్తృతాధికారాలను ఇచ్చారని హైకోర్టు గుర్తుచేసింది.

ఎన్నికల నిర్వహణలో కమిషనర్‌ అధికారాల గురించి చెబుతూ.. అధికరణ 324లో పర్యవేక్షణ, మార్గదర్శకం, నియంత్రణ అనే పదాన్ని వినియోగించారని కోర్టు తెలిపింది.  ఆ పదాలు ఉత్త పదాలేమీ కాదు. ప్రజాస్వామ్యపరంగా వైవిధ్యమైన భారతదేశం లాంటి పెద్ద దేశంలో అనేక పరిస్థితులను ఎదుర్కోవడానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాజ్యాంగం అధికారం కల్పించిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది హైకోర్టు.. ఆ తర్వాత కేసు తదుపరి విచారణను మార్చి 5వ తేదీకి వాయిదా వేసింది.


జగడ్డ: ఈరోజు ఎన్నికల్లో బాబోరి టీడీపీ వైసీపీకి పోటీ ఇచ్చేనా...?

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>