PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/irctc2b2afc67-1030-456c-be93-5cfd88645c51-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/irctc2b2afc67-1030-456c-be93-5cfd88645c51-415x250-IndiaHerald.jpgదేశంలో ప్రయివేట్ రైళ్లు నడపడానికి కేంద్రం సిద్ధమవటమే కాకుండా ఇందుకు సంబంధించిన విధి, విధానాలను కూడా గతంలోనే ప్రకటించింది. అయితే తాజాగా, దీనిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ శుక్రవారం అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో మొత్తం 109 మార్గాల్లో 150కిపైగా ప్రయివేట్ రైళ్లు నడపడానికి రైల్వే శాఖ అనుమతించింది.indian railways;puri jagannadh;tiru;bharatiya janata party;india;vijayawada;mp;tirupati;minister;chennai;husband;vegetable market;secunderabad;central government;kachiguda;bhubaneswar109 మార్గాల్లో 150కి పైగా ప్రయివేట్ రైళ్లు నడపడానికి అనుమతించిన రైల్వే శాఖ109 మార్గాల్లో 150కి పైగా ప్రయివేట్ రైళ్లు నడపడానికి అనుమతించిన రైల్వే శాఖindian railways;puri jagannadh;tiru;bharatiya janata party;india;vijayawada;mp;tirupati;minister;chennai;husband;vegetable market;secunderabad;central government;kachiguda;bhubaneswarSat, 13 Feb 2021 21:10:00 GMTకేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి సంస్కరణల పేరుతో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ రంగాలను ప్రైవేట్ భాగస్వామ్యంతో ముడిపెడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇదే పద్ధతిలో అంటే ప్రభుత్వం మరియు ప్రైవేట్ భాగస్వామ్యంలో తొలిసారి దేశంలో ప్రయివేట్ రైళ్లు నడపడానికి కేంద్రం సిద్ధమవటమే కాకుండా ఇందుకు సంబంధించిన విధి, విధానాలను కూడా గతంలోనే ప్రకటించింది. అయితే తాజాగా, దీనిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ శుక్రవారం అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో త్వరలో 150 ఆధునిక రైళ్లు నడపనున్నట్లు గోయెల్‌ వెల్లడించారు. ఇందు కోసం ప్రతిపాదనలు కోరామని, ఇందుకు 12 క్లస్టర్‌ రూట్లను ఎంపిక చేశామని ఆయన తెలిపారు.



ప్రయాణ ఛార్జీలు నిర్ణయించుకునే స్వేచ్ఛ, వాటిని ఏయే స్టేషన్లలో నిలపాలనే నిర్ణయం కూడా ప్రైవేటు ఆపరేటర్లకే కేంద్రం కట్టబెట్టింది. మొత్తం 109 మార్గాల్లో 150కిపైగా ప్రయివేట్ రైళ్లు నడపడానికి రైల్వే శాఖ అనుమతించింది. ఆ మార్గంలో రైల్వే శాఖ నడుపుతున్న అత్యంత వేగవంతమైన రైళ్ల కంటే ప్రైవేట్ రైళ్ల స్టాప్‌లు ఎక్కువ ఉండవు. 2023 నాటికి కార్యకలాపాలు ప్రారంభించబోయే ప్రైవేట్ రైళ్ల ఛార్జీలను రైల్వే శాఖ నియంత్రించదు. మార్కెట్ పరిస్థితులను బట్టి ప్రైవేట్ ఆపరేటర్లు నిర్ణయించుకోవచ్చు. ప్రైవేట్ రైళ్లను నడపడానికి ఆసక్తి చూపిన 23 సంస్థలలో బొంబార్డియర్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇండియా, సిమెన్స్ లిమిటెడ్, ఆల్సోటామ్ ట్రాన్స్‌పోర్ట్ ఇండియా లిమిటెడ్ తదితర సంస్థలు ఉన్నాయి. ఇక, తెలుగు రాష్ట్రాల్లోని 14 మార్గాల్లో ప్రయివేట్ రైళ్లు నడవనున్నాయి. విజయనగరం- పూరి (వారానికి మూడు సర్వీసులు), హౌరా- విజయవాడ-చెన్నై (ప్రతి రోజూ), సికింద్రాబాద్‌- శ్రీకాకుళం (ప్రతి రోజూ), హైదరాబాద్‌- తిరుపతి (ప్రతి రోజూ), గుంటూరు- హైదరాబాద్‌ (ప్రతి రోజూ), తిరుపతి- సికింద్రాబాద్‌-వారణాసి (వారానికి రెండుసార్లు), తిరుపతి- నర్సాపూర్‌ వయా విజయవాడ (బైవీక్లీ), విశాఖపట్నం-బెంగళూరు (బైవీక్లీ), విశాఖపట్నం- విజయవాడ (ప్రతి రోజూ), హౌరా- సికింద్రాబాద్‌ (ప్రతిరోజూ), చెన్నై- తిరుపతి (వీక్లీ), పాండిచ్చేరి- కాచిగూడ (ప్రతి రోజూ), మైసూరు- విజయవాడ- భువనేశ్వర్‌ (ప్రతి రోజూ), హౌరా- బెంగళూరు (ప్రతి రోజూ) మార్గాల్లో ఆధునిక రైళ్లు నడవనున్నాయి.


ముఖ్యమంత్రి ఇంటి కోడలిగా అడుగుపెట్టబోతున్న మెహ్రీన్ ..నిశ్చితార్థం ఎప్పుడో తెలుసా..?

రీ ఎంట్రీ కి సిద్ధమైన స్టార్ హీరో భార్య..

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఊపేసిన ఫ్యాన్..!

రెండవ పెళ్ళికి సిద్దమైన బాలీవుడ్ హాట్ హీరోయిన్...

వ‌ర్క‌వుట్ కాని.. బాబు.. `ఆందోళ‌న`‌.. రెండో విడ‌త దారుణం..!

బ్రేకింగ్‌: నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక‌.. టీడీపీ అభ్య‌ర్థి ఖ‌రారు

కొడాలి ఇలాకాలో ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ... వింత గెలుపు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>