PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsbb15b80e-40a1-43de-8e53-fd6c57eb1185-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsbb15b80e-40a1-43de-8e53-fd6c57eb1185-415x250-IndiaHerald.jpgఅధికార పార్టీ కూడా రెండో విడత ఎన్నికల సందర్భంగా ప్రచారాలను పెద్ద ఎత్తున చేపట్టింది. ఏపీలో ఈ రెండు పార్టీలు గ్రామ పంచాయతీ ఎన్నికలను చాలెంజ్ గా తీసుకొని ప్రచారాల్లో స్పీడ్ ను పెంచాయి. అయితే నేడు రెండవ విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయిjagan-nimmagadda-elections;varsha;telugu desam party;andhra pradesh;telugu;kanna lakshminarayana;panchayati;tdp;ycp;party;mantraజగడ్డ: ఈరోజు ఎన్నికల్లో బాబోరి టీడీపీ వైసీపీకి పోటీ ఇచ్చేనా...?జగడ్డ: ఈరోజు ఎన్నికల్లో బాబోరి టీడీపీ వైసీపీకి పోటీ ఇచ్చేనా...?jagan-nimmagadda-elections;varsha;telugu desam party;andhra pradesh;telugu;kanna lakshminarayana;panchayati;tdp;ycp;party;mantraSat, 13 Feb 2021 08:02:43 GMTఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీల మధ్య దూకుడు మరింత పెంచుతున్నాయి. గత వారంలో జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో వెలువడిన ఫలితాల ప్రకారం ...అధికార పార్టీ వైఎస్ఆర్సిపి అత్యధిక మెజారిటీతో గెలుపొందగా ప్రత్యర్ధి పార్టీ టీడీపీ చిత్తుగా ఓడిపోయిన సంగతి తెలిసిందే... ఫలితాల ప్రకారం చూస్తే మిగిలిన పార్టీలు తూతూ మంత్రంగా నిలిచాయి. దాంతో టిడిపి నాయకులు తదుపరి రెండో విడత ఎన్నికలకు దూకుడు పెంచారు. ప్రచారాల్లో వారి సత్తా చాటుతూ హోరెత్తించారు. ప్రజలపై వరాల వర్షం కురిపిస్తామంటూ హామీలు ఇచ్చారు.

అధికార పార్టీ కూడా రెండో విడత ఎన్నికల సందర్భంగా ప్రచారాలను పెద్ద ఎత్తున చేపట్టింది. ఏపీలో ఈ రెండు పార్టీలు గ్రామ పంచాయతీ ఎన్నికలను చాలెంజ్ గా తీసుకొని ప్రచారాల్లో స్పీడ్ ను పెంచాయి.  అయితే నేడు రెండవ విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి విడతకు కేటాయించిన సమయం లాగే... రెండవ విడత ఎన్నికలకు కూడా ఉదయం  6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌  సమయం కేటాయించారు ఎన్నికల అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 13 జిల్లాల్లోని 18 డివిజన్లలో 167 మండలాల్లోని 2786 పంచాయితీలకి ఎన్నికలు  జరగనున్నాయి.

సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు  ప్రారంభం కానుంది. అనంతరం ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల‌ నిర్వహణకి 18387 పెద్ద బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేసింది అధికార యంత్రాంగం. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సెన్సిటివ్ ప్రదేశాల్లో ఫుల్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదిలా ఉంటే.... తెలుగుదేశం పార్టీ రెండవ విడత పంచాయితీ ఎన్నికల పై భారీ అంచనాలే పెట్టుకుంది. అందుకు తగ్గట్టు ప్రచారాలు కూడా గట్టిగానే చేసింది. మరియు ప్రజలు టిడిపిని ఎంతవరకు ఆదరిస్తారో తెలియాల్సి ఉంది. అసలు టెన్షన్ సాయంత్రం నాలుగు గంటలకు మొదలు కానుంది. మరి చూద్దాం ఈరోజైనా టీడీపీ వైసీపీ అభ్యర్థుల కన్నా ఎక్కువ స్థానాలు గెలుస్తారో లేదో వేచి చూడాలి.


మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నమ్మకాన్ని నిలబెట్టాడబ్బా..!

ఉప్పెన కృతి శెట్టి.. మరో సమంత అవుతుందా..?

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..

శ్రీరామ రాజ్యం చిన్నారి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>