LifeStyleSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/brinjal-curd-curryc81bf717-f881-42ab-b50f-bc62fdccb6a2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/brinjal-curd-curryc81bf717-f881-42ab-b50f-bc62fdccb6a2-415x250-IndiaHerald.jpgపెరుగు లో ఎన్నో పోషకాలు దాగివున్నాయి. వేడిని తగ్గించడం లో ఈ పెరుగు చక్కని ఔషధం అని చెప్పాలి. అందుకే ప్రతి రోజూ రెండు స్పూన్ల పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి ఎటు వంటి డోకా ఉండదని నిపుణులు అంటున్నారు. అయితే పెరుగు తో పులుసు లేదా చారు చేసుకుంటారు. లేదు అంటే మసాలా రైస్ , కూరల లో వాడుతారు. అయితే ఇప్పుడు వంకాయ కూర కూడా పెరుగు వేసి చేసుకోవచ్చు అని అంటున్నారు. ఇప్పుడు ఆ వంకాయ పెరుగు కూరను ఎలా చేసుకుంటారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. brinjal curd curry;tara;onion;ginger;oil;garlic;cumin;brinjal;kadai;coriander.;hing;masalaవంకాయ పెరుగు కూరను ఎలా చేస్తారంటే?వంకాయ పెరుగు కూరను ఎలా చేస్తారంటే?brinjal curd curry;tara;onion;ginger;oil;garlic;cumin;brinjal;kadai;coriander.;hing;masalaSat, 13 Feb 2021 19:00:00 GMTమసాలా రైస్ , కూరల లో వాడుతారు. అయితే ఇప్పుడు వంకాయ కూర కూడా పెరుగు వేసి చేసుకోవచ్చు అని అంటున్నారు. ఇప్పుడు ఆ వంకాయ పెరుగు కూరను ఎలా చేసుకుంటారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..


వంకాయ పెరుగు కూరకు కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం..

కావలసిన పదార్థాలు..


 పెరుగు: ఒకటిన్నర కప్పు,
 
నూనె: అయిదు చెంచాలు,

వంకాయలు: ఆరు,


జీలకర్ర: చెంచా,

బిర్యానీ ఆకు: ఒకటి,

ఉల్లిపాయ: ఒకటి,

 అల్లంవెల్లుల్లి ముద్ద: చెంచా,
 

సెనగపిండి: రెండు చెంచాలు,

పసుపు: పావు చెంచా,

కారం: చెంచా,

దనియాలపొడి: అరచెంచా,

గరంమసాలా: పావుచెంచా,

నీళ్లు: అరకప్పు,

ఉప్పు: తగినంత,

కసూరీమేథీ: చెంచా,

కొత్తిమీర: కట్ట,

ఇంగువ: కొద్దిగా.


తయారీ విధానం:


స్టౌమీద కడాయి పెట్టి మూడు చెంచాల నూనె వేసి... వంకాయ ముక్కల్ని వేయించి తీసుకోవాలి. అదే బాణలిలో మిగిలిన నూనె వేసి జీలకర్ర, బిర్యానీ ఆకు, ఇంగువ వేయించి ఉల్లిపాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద వేయాలి. అవి కూడా వేగాక సెనగపిండి వేసి వేయించి, పసుపు, కారం, దనియాలపొడి, గరంమసాలా, నీళ్లు పోసి బాగా కలపాలి. నిమిషమయ్యాక పెరుగు వేసి కలిపి ఉప్పు, వేయించిన వంకాయముక్కలు వేసి స్టౌని సిమ్‌లో పెట్టాలి. ఇది ఉడుకు తున్నప్పుడు కసూరీమేథీ, కొత్తిమీర తరుగు వేసి దింపేయాలి. ఇది రోటీల్లోకే కాదు, అన్నంలోకీ బాగుంటుంది.. వంకాయలతో ఏం చేసుకున్నా అదిరిపోతుంది.. భోజన ప్రియులు ఎక్కువగా ఇష్టపడే వంకాయ కూరను ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఇలా చేసుకొని చూడండి..అందరికీ నచ్చుతుంది.. చూసారుగా ఎంత ఈజీగా చేసుకోవచ్చునో  మీకు ఈ వంట నచ్చితే మీరు కూడా ట్రై చేయండి..




షాకింగ్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కమ్మ సామాజిక వర్గ నేత...?

రీ ఎంట్రీ కి సిద్ధమైన స్టార్ హీరో భార్య..

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఊపేసిన ఫ్యాన్..!

రెండవ పెళ్ళికి సిద్దమైన బాలీవుడ్ హాట్ హీరోయిన్...

వ‌ర్క‌వుట్ కాని.. బాబు.. `ఆందోళ‌న`‌.. రెండో విడ‌త దారుణం..!

బ్రేకింగ్‌: నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక‌.. టీడీపీ అభ్య‌ర్థి ఖ‌రారు

కొడాలి ఇలాకాలో ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ... వింత గెలుపు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>