SpiritualitySS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/spent-for-the-construction-of-ayodhya-rama-mandirb3d39b72-9655-4158-be57-efb459df84ea-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/spent-for-the-construction-of-ayodhya-rama-mandirb3d39b72-9655-4158-be57-efb459df84ea-415x250-IndiaHerald.jpgశ్రీరాముడి జన్మభూమి అయిన అయోధ్యలో అద్భుతమైన రామాలయాన్ని నిర్మించేందుకు యావత్తు దేశం విరాళాలు అందజేస్తోంది.దేశవ్యాప్తంగా జనవరి 15న విరాళాల సేకరణ ప్రారంభం కాగా.. ఇది ఫిబ్రవరి 27 వరకు కొనసాగనుంది. అయితే, నిర్దేశిత గడువుకు ముందే శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ లక్ష్యాన్ని చేరుకుంది. రామాలయం నిర్మాణం కోసం ఇప్పటి వరకూ కేవలం 28 రోజుల్లోనే రూ.1,511 కోట్లు విరాళాలుగా అందాయి. ayodhya;dharma;govi;nidhi;thirtha;bharatiya janata party;narendra modi;2019;telugu;january;prime minister;november;february;central government;ayodhya;narendraఅయోధ్య రామాలయ నిర్మాణానికి కేవలం 28 రోజుల్లోనే 15 వందల కోట్లకు పైగా విరాళాల సేకరణఅయోధ్య రామాలయ నిర్మాణానికి కేవలం 28 రోజుల్లోనే 15 వందల కోట్లకు పైగా విరాళాల సేకరణayodhya;dharma;govi;nidhi;thirtha;bharatiya janata party;narendra modi;2019;telugu;january;prime minister;november;february;central government;ayodhya;narendraSat, 13 Feb 2021 23:20:00 GMTకేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం శ్రీరాముడి జన్మభూమి అయిన అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకు అనుగుణంగానే ప్రతీ పనిలోనూ అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఇక ఆలయ నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా జనవరి 15న విరాళాల సేకరణ ప్రారంభం కాగా.. ఇది ఫిబ్రవరి 27 వరకు కొనసాగనుంది. అయితే, నిర్దేశిత గడువుకు ముందే శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ లక్ష్యాన్ని చేరుకుంది. రామాలయం నిర్మాణం కోసం ఇప్పటి వరకు రూ.1,511 కోట్ల విరాళాలుగా అందాయి. ఈ మేరకు శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి వెల్లడించారు. దేశవ్యాప్తంగా నాలుగు లక్షల గ్రామాలను సందర్శించి, ప్రజల నుంచి విరాళాలను సేకరించాలని నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. స్వామి గోవింద్ దేవ్ గిరి సూరత్‌లో మీడియాతో మాట్లాడుతూ... ‘అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు రూ.1,511 కోట్ల విరాళాలు వచ్చాయి. జనవరి 15న ప్రారంభమైన నిధి సేకరణ కార్యక్రమం ఫిబ్రవరి 27తో ముగియనుంది. దేశవ్యాప్తంగా నాలుగు లక్షల గ్రామాలను, 11 కోట్ల కుటుంబాలను కలిసి, నిధిని సేకరించాలన్నది లక్ష్యం.. 492 సంవత్సరాల తర్వాత రామాలయాన్ని నిర్మించే అవకాశం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు.



శ్రీరాముడి జన్మభూమి అయిన అయోధ్యలో అద్భుతమైన రామాలయాన్ని నిర్మించేందుకు యావత్తు దేశం విరాళాలు అందజేస్తోందని చెప్పారు. ధర్మం కోసం ఏదైనా చేసే అవకాశం ప్రజలకు దక్కిందన్నారు. ఇక, 2019 నవంబరులో సుప్రీంకోర్టు తీర్పుతో ఆయోధ్యలో రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం అయ్యింది. ఫిబ్రవరి 2020లో ఆలయ ట్రస్ట్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. గతేడాది ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇక, విరాళాల సేకరణ ప్రారంభమైన తర్వాత కేవలం 25 రోజుల్లోనే రూ.1,000 కోట్ల మార్క్ చేరుకుంది. మొత్తం 1.50 లక్షల మంది వీహెచ్‌పీ కార్యకర్తలు ఈ విరాళాల సేకరణలో భాగస్వామ్యలయ్యారు. సేకరించిన విరాళాలను డిపాజిట్ చేసే బాధ్యతలను 35 మంది వాలంటీర్లకు అప్పగించారు. మారుమూల పల్లెలకు సైతం వీహెచ్‌పీ కార్యకర్తలు వెళ్లి విరాళాలు సేకరిస్తున్నారు.




చరణ్, శంకర్ మూవీ లో మరో టాప్ స్టార్ కు స్థానం ఉందా ..??

రీ ఎంట్రీ కి సిద్ధమైన స్టార్ హీరో భార్య..

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఊపేసిన ఫ్యాన్..!

రెండవ పెళ్ళికి సిద్దమైన బాలీవుడ్ హాట్ హీరోయిన్...

వ‌ర్క‌వుట్ కాని.. బాబు.. `ఆందోళ‌న`‌.. రెండో విడ‌త దారుణం..!

బ్రేకింగ్‌: నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక‌.. టీడీపీ అభ్య‌ర్థి ఖ‌రారు

కొడాలి ఇలాకాలో ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ... వింత గెలుపు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>