MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uppena3222dc46-5583-4bba-ba62-a6167b9725d8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uppena3222dc46-5583-4bba-ba62-a6167b9725d8-415x250-IndiaHerald.jpgసినిమాకు మాయ కమ్మింది. సినీ దేవుళ్ళు ఉండే థియేటర్లను ఆడియన్స్ ఆలయాలు అని అంతా భావిసారు. అవి ఒక్కసారిగా మూతపడ్డాయి. సినిమా అన్నది ఒక హిస్టరీగా మిగిలిపోతుందా అన్న బెంగ అయితే అందరిలో పట్టుకుంది. కరోనా వైరస్ చేసిన విద్వంసానికి అంతా చిన్నాభిన్నం అయింది. uppena;deva;kranthi;kranti;maya;prema;makar sakranti;tollywood;cinema;sankranthi;love;audience;director;hero;heroine;coronavirusఉప్పెనతో టాలీవుడ్ కి ఆ డౌట్ తీరిందిగా ?ఉప్పెనతో టాలీవుడ్ కి ఆ డౌట్ తీరిందిగా ?uppena;deva;kranthi;kranti;maya;prema;makar sakranti;tollywood;cinema;sankranthi;love;audience;director;hero;heroine;coronavirusSat, 13 Feb 2021 19:30:00 GMTమాయ కమ్మింది. సినీ దేవుళ్ళు ఉండే థియేటర్లను ఆడియన్స్  ఆలయాలు అని అంతా భావిసారు. అవి ఒక్కసారిగా మూతపడ్డాయి. సినిమా అన్నది ఒక హిస్టరీగా మిగిలిపోతుందా అన్న బెంగ అయితే అందరిలో పట్టుకుంది. కరోనా వైరస్ చేసిన విద్వంసానికి అంతా చిన్నాభిన్నం అయింది.

ఇపుడు అలాంటి పరిస్థితుల్లో సంక్రాంతి వచ్చింది, సినిమా హాళ్ళు సందడి చేశాయి. అంతే కాదు భారీ కలెక్షన్లు కూడా నమోదు అయ్యాయి. ఇపుడు దానిని మించి ఉప్పెన కలెక్షన్లు అదరగొట్టాయి. ఈ నెల నుంచి మొత్తం ఫుల్ సీటింగ్ కి థియేటర్లలో అనుమతి ఇవ్వడంతో జనం వెల్లువలా వచ్చి పడ్డారు. సినిమా వ్యామోహం తమకు ఇంకా తగ్గలేదని చాటి చెప్పారు.

మెగా మేనల్లుడు నటించిన ఉప్పెన సిన్మాకు జనం ఉప్పెనలాగానే వచ్చారు. సంక్రాంతి వేళ థియేటర్ల ముఖాలు చూడని ఫ్యామిలీ ఆడియన్స్ ఉప్పెన సినిమాకు రావడంతో టాలీవుడ్ పెద్దలు చాలా హాపీగా ఫీల్ అవుతున్నారు. మంచి బొమ్మ రిలీజ్ చేస్తే తప్పకుండా జనాలు థియేటర్లకు వస్తారు అన్నది కూడా రుజువు అయింది.

ఇక ఫ్యామిలీస్ కి కరోనా భయాలు ఉన్నాయన్న అనుమానాలు కూడా ఉప్పెన సినిమా పటాపంచాలు చేసింది. ఈ మూవీ ప్రేమ కధతో తీయడంతో ఫ్యామిలీ జనాలు బాగా కనెక్ట్ అవుతారని ముందే ఊహించారు. కానీ చాలా పెద్ద ఎత్తునే జనాల‌ రెస్పాన్స్ రావడం చూసిన సినీ జనాలు ఆనదం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇక మీదట ధైర్యంగా అన్ని రకాల జోనర్లతో కూడిన సినిమాను రిలీజ్ చేయవచ్చునని కూడా ఫిల్మ్ మేకర్స్ ఆలోచిస్తున్నారు. మొత్తానికి ఉప్పెన టాలీవుడ్ కి ఉన్న టోటల్ డౌట్లు అన్నీ ఒక్క దెబ్బతో తీర్చేసింది అంటున్నారు. తొలి రోజే ఉప్పెన మూవీ అయిదు కోట్లు వసూల్ చేయడాన్ని కూడా ఒక రికార్డుగా చూస్తున్నారు. ఒక కొత్త హీరో, హీరోయిన్, డైరెక్టర్ సినిమాకు ఇంత స్పందన వచ్చిందంటే కచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అంటున్నారు.






షాకింగ్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కమ్మ సామాజిక వర్గ నేత...?

రీ ఎంట్రీ కి సిద్ధమైన స్టార్ హీరో భార్య..

జగడ్డ : ఉత్తరాంధ్రాలో ఊపేసిన ఫ్యాన్..!

రెండవ పెళ్ళికి సిద్దమైన బాలీవుడ్ హాట్ హీరోయిన్...

వ‌ర్క‌వుట్ కాని.. బాబు.. `ఆందోళ‌న`‌.. రెండో విడ‌త దారుణం..!

బ్రేకింగ్‌: నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక‌.. టీడీపీ అభ్య‌ర్థి ఖ‌రారు

కొడాలి ఇలాకాలో ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ... వింత గెలుపు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>