PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/nimmagadda-wins-over-jagan-in-first-phase-elections8fa485e5-4fb0-4508-860e-28946f832409-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/nimmagadda-wins-over-jagan-in-first-phase-elections8fa485e5-4fb0-4508-860e-28946f832409-415x250-IndiaHerald.jpgఇప్పుడు ప‌రువు పోగొట్టుకున్నారు. కృష్ణాజిల్లా పెడ‌న ఎమ్మెల్యే జోగి ర‌మేష్‌పై ఎస్ ఈసీ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఆయ‌న ఓ గ్రామంలో మాట్లాడుతూ.. రెండో విడ‌త పోలింగ్ జ‌ర‌గ‌నున్న క్ర‌మంలో.. నామినేష‌న్లు వేసేవారికి కొన్ని హెచ్చ‌రిక‌లు చేశార‌నే టీడీపీ ఫిర్యాదు మేర‌కు ఎస్ ఈసీ క‌ఠిన ఆదేశాలు జారీ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఈ నెల 17 వ‌ర‌కు జోగి ర‌మేష్‌.. మీడియాతో మాట్లాడ‌కుండా చూడాల‌ని.. క‌లెక్ట‌ర్‌, జిల్లా ఎస్పీకి ఎస్ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అయితే.. గ‌తంలో జ‌రిగిన ప‌రిణామాల‌పై కొంద‌రికి nimmagadda jagan;kumaar;district;high court;village;court;mla;minister;audio;letter;tdp;ycp;election commission;reddyవైసీపీ దూకుడు.. ఎస్ ఈసీ బ్రేకులు... అధికార పార్టీకి అదిరే షాక్ ?వైసీపీ దూకుడు.. ఎస్ ఈసీ బ్రేకులు... అధికార పార్టీకి అదిరే షాక్ ?nimmagadda jagan;kumaar;district;high court;village;court;mla;minister;audio;letter;tdp;ycp;election commission;reddyFri, 12 Feb 2021 10:55:00 GMTవైసీపీ నేత‌ల దూకుడు మొత్తానికే ఎస‌రు తెస్తోందా?  పంచాయ‌తీ ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం చూపిస్తోందా? అం టే.. తాజాగా జ‌రిగిన ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న వారు ఔన‌నే అంటున్నారు. ఈ నెల 3న మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిపై రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం కొర‌డా ఝ‌ళిపించింది. అధికారుల‌ను బెదిరిస్తున్నార‌ని.. పంచాయ‌తీ ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం ప‌డేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ.. ఆయ‌న‌ను ఏకంగా గృహ నిర్బంధం చేయాల‌ని ఆదేశిస్తూ.. రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ ఆదేశించారు. అంతేకాదు.. మీడియాతోనూ మాట్లాడొద్దంటూ.. నిర్దేశించారు.

అయితే.. ఈ ఆదేశాల‌పై హైకోర్టుకు వెళ్లిన పెద్దిరెడ్డికి నిబంధ‌న‌లు, ల‌క్ష్మ‌ణ రేఖ‌లు దాటొద్ద‌న్న నిర్దేశాల‌తో కూడిన రిలీఫ్ ల‌భించి 24 గంట‌లు కూడా గ‌డ‌వ‌కముందుగానే.. వైసీపీలో మ‌రో కీల‌క నాయ‌కుడు.. ఇప్పుడు ప‌రువు పోగొట్టుకున్నారు. కృష్ణాజిల్లా పెడ‌న ఎమ్మెల్యే జోగి ర‌మేష్‌పై ఎస్ ఈసీ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఆయ‌న ఓ గ్రామంలో మాట్లాడుతూ.. రెండో విడ‌త పోలింగ్ జ‌ర‌గ‌నున్న క్ర‌మంలో.. నామినేష‌న్లు వేసేవారికి కొన్ని హెచ్చ‌రిక‌లు చేశార‌నే టీడీపీ ఫిర్యాదు మేర‌కు ఎస్ ఈసీ క‌ఠిన ఆదేశాలు జారీ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.

ఈ నెల 17 వ‌ర‌కు జోగి ర‌మేష్‌.. మీడియాతో మాట్లాడ‌కుండా చూడాల‌ని.. క‌లెక్ట‌ర్‌, జిల్లా ఎస్పీకి ఎస్ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అయితే.. గ‌తంలో జ‌రిగిన ప‌రిణామాల‌పై కొంద‌రికి ఎస్ ఈసీ నిమ్మ‌గ‌డ్డ‌పై ఆగ్ర‌హం వ‌చ్చి ఉంటే ఉండొచ్చు .. కానీ.. పెద్ది రెడ్డి విష‌యంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను గ‌మ‌నిస్తే.. ఎన్నిక‌ల‌ను ప్ర‌భావితం చేసే అధికారం ఎవ‌రికీ లేద‌నే విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఈ క్ర‌మంలో పెద్దిరెడ్డిపై జ‌రిగిన కోర్టు విచార‌ణ స్వ‌యంగా తెలిసి కూడా జోగి ర‌మేష్ నోరు పారేసుకోవ‌డం.. అంటే.. తెలిసే చేశారా?  లేక ఎస్ ఈసీ ఏం చేస్తుంద‌నే దీమానా? అనే చ‌ర్చ సాగుతోంది.

వైసీపీకి వ్య‌తిరేకంగా పోటీ చేసేవారికి జ‌గ‌న‌న్న అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను నిలిపివేయాల‌ని జోగి ర‌మేష్ ఆదేశించిన‌ట్టుగా వ్యాఖ్య‌లు చేసిన ఆడియో.. మీడియాలోనూ ప్ర‌సార‌మైంది. మొత్తంగా చూస్తే.. ఒక‌వైపు కోర్టులు మొట్టికాయ‌లు వేస్తున్నా.. మ‌రోవైపు ఎస్ ఈసీ.. నిర్బంధాలు పెడుతున్నా.. వారిలో మార్పు రావ‌డం లేదా? అనే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.




టీడీపీ - జ‌నసేన చీక‌టి పొత్తులు.. `పంచాయ‌తీ`పై బీజేపీ ఆగ్ర‌హం..!

ఏపీ మంత్రి కుటుంబంలో టికెట్ల‌ చిచ్చు.. రీజ‌నేంటి ?

కాపు వేద‌న‌: రాజా వారి ఏలుబ‌డిలోనూ... కాపుల క‌ష్టాలు..!

ఉప్పెన ప్రివ్యూ: సినిమా చూడాల్సిందే.. కార‌ణాలు ఇవే..!?

టీచర్ల వెతలు: వీళ్లు మనుషులు కారా..? వీళ్లకు కుటుంబాలు ఉండవా..?

వకీల్ సాబ్ కు అజ్ఞాతవాసి వ్యూహాలు నిరాశలో అభిమానులు !

మైత్రీ మూవీ మేకర్స్ లైన్ అప్ చూసి షాక్ లో ఇండస్ట్రీ వర్గాలు !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>