MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero-ashish-reddy0be070a4-0a69-4388-a699-48cf8a528609-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero-ashish-reddy0be070a4-0a69-4388-a699-48cf8a528609-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎప్పటికప్పుడు కొత్త హీరోలు తెరంగ్రేటం చేస్తూనే ఉంటారు. ఇక పరిశ్రమలో నిర్మాతల కొడుకులు, దర్శకుల కుమారులు, హీరోల వారసులు ఇలా చాల మంది సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ ప్రొడ్యూసర్లలో ఒక్కరు దిల్ రాజు. గత 20 ఏళ్ల నుంచి ఆయన ఘన ప్రస్థానం కొనసాగుతోంది.hero ashish reddy;devi sri prasad;dil raju;geetha;prasad;tollywood;cinema;sangeetha;telugu;sree harsha konuganti;saaho;producer;king;producer1;hero;reddy;dil;ashish vidyarthiదిల్ రాజు ఇంటి నుండి టాలీవుడ్ లోకి కొత్త హీరోదిల్ రాజు ఇంటి నుండి టాలీవుడ్ లోకి కొత్త హీరోhero ashish reddy;devi sri prasad;dil raju;geetha;prasad;tollywood;cinema;sangeetha;telugu;sree harsha konuganti;saaho;producer;king;producer1;hero;reddy;dil;ashish vidyarthiFri, 12 Feb 2021 12:00:00 GMTదిల్ రాజు. గత 20 ఏళ్ల నుంచి ఆయన ఘన ప్రస్థానం కొనసాగుతోంది. తెలుగులో ఎంతోమంది హీరోలను ఆయన పరిచయం చేశాడు. ఎంతోమంది హీరోలను తన సినిమాల ద్వారా స్టార్లను చేశాడు. ఇప్పుడు ఆయన కుటుంబం నుంచి కూడా ఒక హీరో రాబోతుండటం విశేషం.

ఇక తాజాగా టాలీవుడ్ ప్రొడ్యూసర్ కొడుకు హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. దిల్ రాజుకు ఇతను కొడుకు కాదు కానీ, కొడుకు లాంటి వాడే. టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు తమ్ముడి కొడుకు ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెడుతున్నాడు. దిల్ రాజుతో పాటు సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించే శిరీష్ రెడ్డి కొడుకు ఆశిష్ రెడ్డి హీరోగా పరిచయం అవ్వడానికి సిద్ధం అయ్యాడట. ఈ కుర్రాడిని హీరోగా పరిచయం చేయడం కోసం కొన్నేళ్ల ముందు నుంచే సన్నాహాలు జరుగుతున్నాయి. హీరో కావడం కోసం అన్ని రకాలుగా అతను సన్నద్ధమయ్యాడు. ఎట్టకేలకు అతడి లాంచింగ్‌కు రంగం సిద్ధమైంది. ఆశిష్ తొలి సినిమా ఇప్పటికే చిత్రీకరణ దశలోనూ ఉంది.

ఇక ఇప్పటికే సినిమా చిత్రీకరణ మొదలైందని టాక్ వినిపిస్తుంది. ఆశిష్ రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాకి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా సాహో చిత్రానికి పనిచేసిన కెమెరామెన్ మది ఛాయాగ్రాహకుడిగా ఉన్నారు. హుషారు సినిమాతో యూత్ ఫుల్ సినిమా తీసి అందరి ప్రశంసలు అందుకున్న శ్రీ హర్ష ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.అయితే ఫస్ట్ సినిమానే బడా టెక్నీషియన్స్ తో ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు దిల్ రాజు. ఆశిష్ రెడ్డి సరసన కుర్రభామ అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నట్లు చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి.


వీధిలో నిలబెట్టి రేషన్ ఇస్తే కుదరదు.. ఇంటింటికీ వెళ్లాల్సిందే..

జగడ్డ : నిమ్మగడ్డతో అసలైన టెన్షన్ అక్కడే ఉంది...?

ఆ ఏపీ మంత్రికి సొంత పంచాయ‌తీ టెన్ష‌న్‌... ప‌రువు ఉంటుందా... పోతుందా ?

టీడీపీ - జ‌నసేన చీక‌టి పొత్తులు.. `పంచాయ‌తీ`పై బీజేపీ ఆగ్ర‌హం..!

ఏపీ మంత్రి కుటుంబంలో టికెట్ల‌ చిచ్చు.. రీజ‌నేంటి ?

వైసీపీ దూకుడు.. ఎస్ ఈసీ బ్రేకులు... అధికార పార్టీకి అదిరే షాక్ ?

కాపు వేద‌న‌: రాజా వారి ఏలుబ‌డిలోనూ... కాపుల క‌ష్టాలు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>