MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh5ed7dc01-5a2a-45e4-8499-abcf5c37f2b5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh5ed7dc01-5a2a-45e4-8499-abcf5c37f2b5-415x250-IndiaHerald.jpgరాజమౌళి ప్రస్తుతం ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ క్లైమాక్స్ చిత్రీకరణలో చాల బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ ను వచ్చేనెల 2వ వారానికి పూర్తి చేసి ఆతరువాత ఈమూవీ విజువల్ ఎఫెక్ట్స్ పై దృష్టి పెట్టబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా విజువేల్ ఎఫెక్ట్స్ కోసం జక్కన్న విదేశాల నుంచి వచ్చిన ఒక ప్రముఖ కంపెనీ టీమ్ తో చర్చలు జరుపుతున్నట్లు టాక్.సాధారణంగా తాను దర్శకత్వం వహించే మూవీ విడుదల అయ్యేంత వరకు రాజమౌళి తాను చేయబోయే మరో సినిమా గురించి ఆలోచనలు చేయడు. అయితే ఈసారి ఈ తీరుకు భిన్నంగా ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల కాకుండానే రాmahesh;mahesh;prasad;rajamouli;rrr movie;cinema;hero;k v vijayendra prasad;fatherమహేష్ కోసం శ్రమిస్తున్న రాజమౌళి !మహేష్ కోసం శ్రమిస్తున్న రాజమౌళి !mahesh;mahesh;prasad;rajamouli;rrr movie;cinema;hero;k v vijayendra prasad;fatherFri, 12 Feb 2021 08:14:35 GMTరాజమౌళి ప్రస్తుతం ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ క్లైమాక్స్ చిత్రీకరణలో చాల బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ ను వచ్చేనెల 2వ వారానికి పూర్తి చేసి ఆతరువాత ఈమూవీ విజువల్ ఎఫెక్ట్స్ పై దృష్టి పెట్టబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా విజువేల్ ఎఫెక్ట్స్ కోసం జక్కన్న విదేశాల నుంచి వచ్చిన ఒక ప్రముఖ కంపెనీ టీమ్ తో చర్చలు జరుపుతున్నట్లు టాక్.


సాధారణంగా తాను దర్శకత్వం వహించే మూవీ విడుదల అయ్యేంత వరకు రాజమౌళి తాను చేయబోయే మరో సినిమా గురించి ఆలోచనలు చేయడు. అయితే ఈసారి ఈ తీరుకు భిన్నంగా ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల కాకుండానే రాజమౌళి మహేష్ కోసం తన టీమ్ లో కొన్ని మార్పులు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


‘ఆర్ ఆర్ ఆర్’ తరువాత మహేష్ తో రాజమౌళి సినిమా ఉంటుంది అన్నది ఓపెన్ సీక్రెట్. ఇప్పటికే ఈ మూవీ కథకు సంబంధించిన ఒక లైన్ ను కూడ రాజమౌళి విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేసారు. అయితే ఇప్పుడు ఈ లైన్ కు సంబంధించిన టోటల్ స్క్ర్పిట్ ను తయారు చేయడానికి రాజమౌళి తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కు సహాయకులుగా ఒక కొత్త టీమ్ ను ఎంపిక చేసినట్లు టాక్.


ప్రస్తుతం వీరంతా విజయేంద్ర ప్రసాద్ ఆద్వర్యంలో ఈ రైటర్స్ టీమ్ పనిచేస్తూ మహేష్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ను తయారు చేసే పనిలో చాల బిజీగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ‘సర్కారు వారి పాట’ విడుదల తరువాత ఇక ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా మహేష్ రాజమౌళిల మూవీ ప్రాజెక్ట్ ప్రారంభం అవుతుందా అన్న సందేహాలు వస్తున్నాయి. సాధారణంగా రాజమౌళితో సినిమా అంటే ఒక హీరో కనీసం రెండు సంవత్సరాలు అతడి వద్ద బందీగా ఉండాలి. దీనితో ‘సర్కారు వారి పాట’ తరువాత మహేష్ మరొక ప్రాజెక్ట్ ఒప్పుకునే అవకాశం లేదు అని అనిపిస్తోంది..





శివుడిలో ఐక్యం అంటూ యూపీలో మ‌హిళ స‌జీవ‌ స‌మాధి.. అంత‌లోనే...

జగడ్డ: జగనోరి ఎమ్మెల్యే పై నిమ్మగడ్డ సీరియస్.. కారణం అదే?

అమరావతిని అమ్మేస్తారా..?

ఉప్పెన బజ్.. మెగా మేనియా అంటే ఇదే బాసు..!

ఉప్పెన ఫస్ట్ టాక్.. మెగా హీరో సినిమా ఎలా ఉంది..?

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు ఆనందానికి అసలు కారణం ఇదేనా ?

టాప్‌ సీక్రెట్‌: వై.ఎస్‌.షర్మిలను.. ఆర్కే ఎందుకు కలిశాడంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>