MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/radhe-shyam1b6e963e-67a5-4c80-9ad9-dac92ee0e19b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/radhe-shyam1b6e963e-67a5-4c80-9ad9-dac92ee0e19b-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు రాధేశ్యామ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి బాహుబలి తర్వాత సాహో సినిమా రిలీజ్ కావడానికి చాలా సమయం పట్టింది.. ఈసారి అలా చేయని వీలైనంత త్వరగా సినిమాలు చేస్తానని చెబుతూ ఈ సినిమా ప్రారంభించాడు ప్రభాస్. ఏ ముహూర్తాన ప్రారంభించాడో కానీ ఈ సినిమా గతంలో ఎప్పుడూ లేనంతగా లేట్ అవుతూ వచ్చింది. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల పాటు వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఇప్పుడిప్పుడే కొంచెం ఇస్తూ వస్తున్నారు మేకర్స్. తాజా అప్ డేట్ ప్రకారం radhe shyam;prabhas;geetha;krishnam raju;shyam;cinema;sangeetha;bahubali;saaho;tamil;kannada;hindi;audience;februaryరాధే శ్యామ్ నుండి ఆసక్తికర అప్డేట్.. సౌత్ కు ఒకరు, నార్త్ కు ఇద్దరు.. ఇదెక్కడి స్ట్రాటజీ ?రాధే శ్యామ్ నుండి ఆసక్తికర అప్డేట్.. సౌత్ కు ఒకరు, నార్త్ కు ఇద్దరు.. ఇదెక్కడి స్ట్రాటజీ ?radhe shyam;prabhas;geetha;krishnam raju;shyam;cinema;sangeetha;bahubali;saaho;tamil;kannada;hindi;audience;februaryFri, 12 Feb 2021 11:00:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు రాధేశ్యామ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి బాహుబలి తర్వాత సాహో సినిమా రిలీజ్ కావడానికి చాలా సమయం పట్టింది.. ఈసారి అలా చేయని వీలైనంత త్వరగా సినిమాలు చేస్తానని చెబుతూ ఈ సినిమా ప్రారంభించాడు ప్రభాస్. ఏ ముహూర్తాన ప్రారంభించాడో కానీ ఈ సినిమా గతంలో ఎప్పుడూ లేనంతగా లేట్ అవుతూ వచ్చింది. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల పాటు వాయిదా పడింది. 

ఎట్టకేలకు ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఇప్పుడిప్పుడే కొంచెం ఇస్తూ వస్తున్నారు మేకర్స్. తాజా అప్ డేట్ ప్రకారం ఈ రాధేశ్యామ్ టీజర్ ఫిబ్రవరి 14వ తేదీన వాలంటైన్స్ డే కానుకగా అందిస్తున్నారు. ఒక రకంగా ఈ టీజర్ కోసం ప్రభాస్ అభిమానులతో కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అయితే నిన్న ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా యూనిట్ నుంచి ఒక ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. అదేమంటే ఈ సినిమాకి రెండు డిఫరెంట్ మ్యూజిక్ ఆల్బమ్స్ రెడీ చేయించామని అంటూ పేర్కొన్నారు. నిజానికి ఈ సినిమా మొత్తానికి ఐదు భాషల్లో రిలీజ్ అవుతోంది. 

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుండగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలకు జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ ఇస్తున్నారు. అలాగే హిందీ వెర్షన్ కు మాత్రం మిధున్, మనన్ భరద్వాజ్ అనే ఇద్దరు సంగీతం అందిస్తున్నారని ప్రకటించారు. అయితే ఇలా ప్రకటించడం వెనుక ఒక స్ట్రాటజీ ఉందని అంటున్నారు. ఈ స్ట్రాటజీ వెనుక బలమైన కారణమే ఉందని అంటున్నారు. అదేమంటే ఈ సినిమాని తెలుగు హిందీ భాషల్లో డైరెక్ట్ గా తెరకెక్కిస్తున్నారు.. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కి డబ్ చేస్తున్నారు. అన్ని భాషలలో కంటే హిందీ భాషలో ఎక్కువగా రెవెన్యూ జనరేట్ అవుతుందని భావిస్తున్న మేకర్స్ అక్కడి ఆడియన్స్ దృష్టిని ఆకర్షించడానికి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ని రంగంలోకి దింపారు అనే వాదన వినిపిస్తోంది. ఇది ఎంతవరకు నిజం అనేది తెలియదు కానీ ఈ అప్డేట్ మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.




టీడీపీ - జ‌నసేన చీక‌టి పొత్తులు.. `పంచాయ‌తీ`పై బీజేపీ ఆగ్ర‌హం..!

ఏపీ మంత్రి కుటుంబంలో టికెట్ల‌ చిచ్చు.. రీజ‌నేంటి ?

వైసీపీ దూకుడు.. ఎస్ ఈసీ బ్రేకులు... అధికార పార్టీకి అదిరే షాక్ ?

కాపు వేద‌న‌: రాజా వారి ఏలుబ‌డిలోనూ... కాపుల క‌ష్టాలు..!

ఉప్పెన ప్రివ్యూ: సినిమా చూడాల్సిందే.. కార‌ణాలు ఇవే..!?

టీచర్ల వెతలు: వీళ్లు మనుషులు కారా..? వీళ్లకు కుటుంబాలు ఉండవా..?

వకీల్ సాబ్ కు అజ్ఞాతవాసి వ్యూహాలు నిరాశలో అభిమానులు !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>