PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/teera-sma91a264e0-140f-4c25-8d24-05b9aa2e4b04-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/teera-sma91a264e0-140f-4c25-8d24-05b9aa2e4b04-415x250-IndiaHerald.jpgఈ సృష్టి చాలా విచిత్రమైంది.. కొందరు పుట్టుకతోనే నిరుపేదలు.. మరికొందరు పుట్టుకతో ధనవంతులు.. కొందరు పుట్టుకతోనే అనారోగ్యంతో పుడతారు. ఇంకొందరు.. సంపూర్ణ ఆరోగ్యంతో పుడతారు. కానీ.. ఇవేవీ మనిషి చేతుల్లో ఉండవు. కొందరు దురదృష్టవంతులు అంతు తెలియని లోపాలతో పుట్టి నెలల వ్యవధిలోనే కన్నుమూస్తారు. అలాంటి ఓ చిన్నారి కథే ఇది.. ఈ ఫోటోలోని ఐదు నెలల చిన్నారికి ఓ ప్రత్యేకమైన జబ్బు వచ్చింది. ఈ పాప ఇంకో నెల మాత్రమే బతుకుతుందని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం హాస్పిటల్ లో ఉంది. ఇవేమీ తెలియని ఆ పాప…చావుబతుకుల మధ్య చిరుteera-sma;chiranjeevi;priya;manu;poorna;priyanka;mediaఈ పాప బతకాలంటే.. రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్‌ చేయాలి..?ఈ పాప బతకాలంటే.. రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్‌ చేయాలి..?teera-sma;chiranjeevi;priya;manu;poorna;priyanka;mediaFri, 12 Feb 2021 10:09:17 GMT
ఈ పాప ఇంకో నెల మాత్రమే బతుకుతుందని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం హాస్పిటల్ లో ఉంది. ఇవేమీ తెలియని ఆ పాప…చావుబతుకుల మధ్య చిరునవ్వులు చిందిస్తోంది. ఆ చిరునవ్వులు ఇలాగే ఎల్లకాలం ఉండాలంటే.. ఓ ప్రత్యేకమైన ఇంజక్షన్ వేయాలి. దాని ధర ఎంతో తెలుసా.. అక్షరాల 16 కోట్లు. అది కూడా ఫారిన్ నుంచి తెప్పించుకోవాలి. ఆ ఇంజక్షన్ పేరు జాల్ గెన్జ్ మా. తలో చేయి వేసి ఆ పదహారు కోట్లను జమచేశారు. ఇక మిగిలింది ఇంజక్షన్ తెప్పించడమే.  ఆ ఇంజక్షన్ వేసినా.. ఫిఫ్టీ ఫిఫ్టీ చాన్స్ అంటున్నారు డాక్టర్లు.

పాప తల్లిదండ్రులు మిహిర్ , ప్రియాంక అష్టకష్టాలు పడుతున్నారు. తీరా ప్రస్తుతం ముంబైలోని ఎస్‌ఆర్‌సీసీ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటోంది. పాపకు వచ్చిన జబ్బు పేరు  స్పైనల్ మస్కులర్ అట్రోఫీ. వెన్నెముక కండరాల క్షీణతే ఈ వ్యాధి ప్రధాన లక్షణం. తీరా ప్రస్తుతం ఈ జబ్బు టైప్ 1 తో బాధపడుతోంది. ఇప్పటికే చిన్నారి ఊపిరితిత్తులలో ఒకటి పని చేయడం మానేసింది. తీరాను ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉంచారు.

ఈ తీరా విషాద గాధ.. క్రమంగా సోషల్ మీడియాకు చేరింది. అలా అలా ఈ టీరా కథ బాగా వైరల్ అయ్యింది. దీంతో చాలా మంది దాతలు ముందుకొచ్చారు. అలా తీరా కోసం సోషల్ మీడియాలో ఓ ఉద్యమమే నడిచింది.. అలా మొత్తం 16 కోట్ల రూపాయలు సోషల్ మీడియా ద్వారానే విరాళాల రూపంలో వచ్చి చేరాయి. మనుషుల్లో మానవత్వం చనిపోలేదని చెప్పేందుకు ముందుకొచ్చిన ఈ మానవతామూర్తులే ఓ ఉదాహరణ.




ఉప్పెన ప్రివ్యూ: సినిమా చూడాల్సిందే.. కార‌ణాలు ఇవే..!?

టీచర్ల వెతలు: వీళ్లు మనుషులు కారా..? వీళ్లకు కుటుంబాలు ఉండవా..?

వకీల్ సాబ్ కు అజ్ఞాతవాసి వ్యూహాలు నిరాశలో అభిమానులు !

మైత్రీ మూవీ మేకర్స్ లైన్ అప్ చూసి షాక్ లో ఇండస్ట్రీ వర్గాలు !

ఉప్పెన 'బేబమ్మ' చితక్కొట్టేసింది.. పూజా హెగ్దే, రష్మిక పక్కకు తప్పుకోవాల్సిందేనా..!

జగడ్డ: జగనోరి ఎమ్మెల్యే పై నిమ్మగడ్డ సీరియస్.. కారణం అదే?

అమరావతిని అమ్మేస్తారా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>