Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/wuhan-labee89568d-5ae0-4899-81db-16f27b6abb68-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/wuhan-labee89568d-5ae0-4899-81db-16f27b6abb68-415x250-IndiaHerald.jpgకరోనా పుట్టుకపై గత కొంత కాలంగా దర్యాప్తు చేస్తున్న డబ్ల్యూహెచ్‌వో తాజాగా ఓ విచిత్రమైన విషయాన్ని వెల్లడించింది. చాలా రోజుల నుంచి ఇదే విషయాన్ని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది. ఇప్పడు చైనాలో విచారణ అనంతరం కూడా అదే విషయాన్ని చెప్పుకొచ్చింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. కరోనా పుట్టినిల్లుగా..wuhan lab;australia;fire;wuhan;coronavirusచైనా నుంచి కాదట.. ఆస్ట్రేలియా నుంచి వచ్చిందట.. కరోనాపై డబ్ల్యూహెచ్‌వోచైనా నుంచి కాదట.. ఆస్ట్రేలియా నుంచి వచ్చిందట.. కరోనాపై డబ్ల్యూహెచ్‌వోwuhan lab;australia;fire;wuhan;coronavirusFri, 12 Feb 2021 14:57:55 GMTఇంటర్నెట్ డెస్క్: కరోనా పుట్టుకపై గత కొంత కాలంగా దర్యాప్తు చేస్తున్న డబ్ల్యూహెచ్‌వో తాజాగా ఓ విచిత్రమైన విషయాన్ని వెల్లడించింది. చాలా రోజుల నుంచి ఇదే విషయాన్ని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది. ఇప్పడు చైనాలో విచారణ అనంతరం కూడా అదే విషయాన్ని చెప్పుకొచ్చింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. కరోనా పుట్టినిల్లుగా ప్రపంచం భావిస్తున్న చైనాలో ఆ మహమ్మారి వైరస్ పుట్టలేదట.. ఆస్ట్రేలియాలో పుట్టిందట. తాజాగా ఈ షాకింగ్ విషయాన్ని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది.

కోల్డ్‌ చైన్‌ ఉత్పత్తుల ద్వారా కరోనా వ్యాపించి ఉండొచ్చని ఇదివరకు చెప్పిన డబ్ల్యూహెచ్‌వో.. తాజాగా ఆస్ట్రేలియా బీఫ్‌ లాంటి ఉత్పత్తుల నుంచి వైరస్‌ వచ్చి ఉండొచ్చని చెప్పింది. దీనిపై పరిశోధన చేయాల్సి ఉందని, పరిశోధనల అనంతరం పూర్తి అవగాహన వస్తుందని పేర్కొంది. అయితే చైనాలోని ల్యాబ్‌లో మాత్రం వైరస్ పుట్టలేదని స్పష్టం చేసింది.

చైనాలో పర్యటిస్తున్న డబ్ల్యూహెచ్‌వో బృంద లీడర్‌ పీటర్‌ ఎంబరేక్‌ కరోనా ఎక్కడ పుట్టిందనే విషయంపై స్పందించాడు. వుహాన్‌ ల్యాబ్‌ నుంచి కరోనా వ్యాపించే అవకాశం చాలా తక్కువని చెప్పారు. ఆ దిశగా ఇక పరిశోధనలు కూడా ఉండబోవని స్పష్టం చేశారు. వైరస్‌ చైనాలో పుట్టలేదని, వేరే దేశం నుంచి తమ దేశానికి వచ్చి వుహాన్‌లో తొలికేసు నమోదైందని చాలాకాలంగా చైనా వాదిస్తోంది. తాజాగా అదే విషయాన్ని డబ్ల్యూహెచ్‌వో చెప్పింది.

ఇదిలా ఉంటే చైనా ఎప్పటినుంచో చెబుతున్న విషయాన్నే డబ్ల్యూహెచ్‌వో ఉద్ఘాటించడంతో అనేకమంది మండిపడుతున్నారు. చైనాకు కొమ్ము కాసేందుకే డబ్ల్యూహెచ్‌వో ఇలాంటి ప్రకటనలు చేస్తోందని నిప్పులు చెరుగుతున్నారు.

బ్రిటన్ స్ట్రెయిన్ చాలా ప్రమాదకరం..
బ్రిటన్‌లోని కెంట్‌లో కనుగొన్న కరోనా వైరస్ వేరియంట్ అత్యంత ప్రమాదకరమని కొవిడ్‌ 19 జీనోమిక్స్‌ యూకే కన్సార్షియం డైరెక్టర్‌ షారోన్‌ పీకాక్‌ హెచ్చరించారు. ప్రస్తుత కొవిడ్‌ వ్యాక్సిన్లకూ ఈ ఈ రకం కరోనా లొంగే అవకాశం తక్కువగా ఉందని, అందుకు తగ్గట్టుగా తనను తాను ఈ వైరస్ మార్చుకుంటోందని పేర్కొన్నారు.బ్రిటన్‌లో ఈ కొత్త స్ట్రెయిన్ బలంగా ఉందని, క్రమంగా ప్రపంచమంతా వ్యాపించే ప్రమాదం కూడా ఉందని షారోన్ పీకాక్ చెప్పారు.


కేసీఆర్ ని తిడితే ఊరుకోను... కేటిఆర్ వార్నింగ్

ఉప్పెన : రివ్యూ

వ్యాపార రంగంలోకి శ్రీముఖి.. ల‌వ‌ర్స్ డే రోజు సంచ‌ల‌న నిర్ణ‌యం

ఇక "ఆర్ ఆర్ ఆర్" తరువాత ఎన్టీఆర్ పెద్ద పాన్ ఇండియా స్టార్ అవ్వడం ఖాయం...!!

జగడ్డ : జగన్ కి ఉద్యోగ సంఘాల తొలి నిరసన గళం.. నిమ్మగడ్డ ఇచ్చిన ధైర్యమేనా ?

జగడ్డ : నిమ్మగడ్డతో అసలైన టెన్షన్ అక్కడే ఉంది...?

ఆ ఏపీ మంత్రికి సొంత పంచాయ‌తీ టెన్ష‌న్‌... ప‌రువు ఉంటుందా... పోతుందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>