EditorialParisa Rama Krishna Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/all-about-political-equationsb5451b3e-aafc-4933-9283-6717ce9eaea7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/all-about-political-equationsb5451b3e-aafc-4933-9283-6717ce9eaea7-415x250-IndiaHerald.jpgఇక పిజేర్ కూతురు విజయ రెడ్ది తొలి నుంచి మేయర్ గద్దెపై కూర్చోవాలని ఆశలు పెట్టుకుంది. ఆమె కూడా రెడ్డే. అయినా అధికారం ఆమడ దూరం జరిగింది. అంతా రిజర్వేషన్ మాయాజాలం. హైదరాబాద్ మేయర్ స్థానానికి ఏలాంటి రెజర్వేషన్ తో పనిలేదు. కాని నగర మేయర్ పదవి వెనుక బడిన కులాలకిచ్చామని చెప్పు కోవటానికి చూపే బడాయి. కొద్దిగా అదిక సంఖ్యలో ఉన్న కాపుల ఓటు బ్యాంక్ పట్టేయటానికి. కులం పరంగా చెప్పాలంటే గద్వాల విజయలక్ష్మి మరియు విజయా రెడ్డి ఇద్దరు ఒక కులం వాళ్ళే సాంకేతికంగా. కాపులను వలేసి పట్టేయటానికి కేకే కూతురికి మేయర్ పదవి కటall about political equations;kcr;kk;munna;vijayalakshmi;hyderabad;korcha;bank;doctor;letter;dogs;father;reddyఎడిటోరియల్: టీఅరెస్ మస్లిజ్ కవలలు - మరీ మాట్లాడితే సయామీ కవలలు - అని మరోసారి ఋజువైంది!ఎడిటోరియల్: టీఅరెస్ మస్లిజ్ కవలలు - మరీ మాట్లాడితే సయామీ కవలలు - అని మరోసారి ఋజువైంది!all about political equations;kcr;kk;munna;vijayalakshmi;hyderabad;korcha;bank;doctor;letter;dogs;father;reddyFri, 12 Feb 2021 09:00:00 GMT
గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నికలో నగరం "మేడి పండు పొట్టవిప్పి చూసింది - అన్నీ పాత పురుగులే" అని గమనించింది. ఇంకేం అన్నీ పురుగులే - రానున్న ఎన్నికల్లో ఈ పురుగుల్ని ఏరేయటం ఖాయం అనుకున్నారు.


ఇక టిఆరెస్ పాత కథే. మార్పు లేదు "నీవు లేక నేను లేను" అనుకుంది. అంతే “కారు స్టీరింగ్ మస్లిజ్” కు ఇచ్చింది. ఇంకేం అధికారం మాదే నంది. దోస్తీ “రెన్యువల్” అయింది. ‘మార్పు లేదు కుక్కతోక వంకరే’ మస్లిజ్ హాపీస్.


"కనకపు సింహాసనం మీద ఏ కుక్క కూర్చుంటేనేం పాలన మాదే" అనుకుంది మస్లిజ్. మస్లిజ్ ఓటేసి టిఆరెస్ కు జిహెచ్ఎంసి అధికారం భౌతికంగా పువ్వుల్లో పెట్టి ఇచ్చేసింది. 'గేదె ఎక్కడ కట్టిందనేది ప్రధానం కాదు ఎక్కడ ఈనిందనేది ప్రధానాంశం'. మొత్తం మీద టీఅరెస్ అనే గేదె జిహెచ్ఎంసి లో అధికారం. అనే అక్రమ సంతానానికి జన్మ నిచ్చింది. అక్రమం అని ఎందుకు అన్నామంటే "ఎంఐఎం కు టిఆరెస్ కు ఎలాంటి సంబంధం లేదు" అని ప్రచారం చేసుకున్నందుకు.  


అధికారం పంపకంలొ కొంచెం విఙ్ఞత ప్రదర్శించినా బాగుండేది. టిఆరెస్ నాయకత్వానికి అదీలేదు. డాక్టర్ కంచర్ల కేశవరావు ఉరఫ్ కేకే కూతురు గద్వాల విజయలక్ష్మి కి అధికారం కట్టబెట్టారు. అదే జిహెచ్ఎంసి మేయర్ చేశారు. ఈమె బిసి అన్నారు కెకె కూతురు కదా! కెకె కాపు తెలంగాణా మున్నురు కాపు. ఎన్నోయేళ్లుగా వివిధ రంగాల్లో అధికారం పొందుతూ డాక్టరేట్ ఉన్న కేకె - కాపు బిసి- అంటే నిజమైన వెనకబడిన జాతులు గుడ్ల నీరు కుక్కుకుంటాయ్.


అమెరికాలో చదివిన విద్యావంతురాలు కావచ్చు. సాంకేతికంగా ఆమె రెడ్ది. ఆమె వివాహం రెడ్ది వరునితో జరిగింది. అయినా అధికారం కోసం బిసీ గా ఉండిపోవటానికి నిశ్చయించుకుంది. మనం బాగుంటే చాలు అనే తత్వం.


ఇక పిజేర్ కూతురు విజయ రెడ్ది తొలి నుంచి మేయర్ గద్దెపై కూర్చోవాలని ఆశలు పెట్టుకుంది. ఆమె కూడా రెడ్డే. అయినా అధికారం ఆమడ దూరం జరిగింది. అంతా రిజర్వేషన్ మాయాజాలం. హైదరాబాద్ మేయర్ స్థానానికి ఏలాంటి రెజర్వేషన్ తో పనిలేదు. కాని నగర మేయర్ పదవి వెనుక బడిన కులాలకిచ్చామని చెప్పు కోవటానికి చూపే బడాయి. కొద్దిగా అదిక సంఖ్యలో ఉన్న కాపుల ఓటు బ్యాంక్ పట్టేయటానికి. కులం పరంగా చెప్పాలంటే గద్వాల విజయలక్ష్మి మరియు విజయా రెడ్డి ఇద్దరు ఒక కులం వాళ్ళే సాంకేతికంగా. కాపులను వలేసి పట్టేయటానికి కేకే కూతురికి మేయర్ పదవి కట్టబెట్టారు.
 

ఇకపోతే డిప్యూటి మేయర్ మోతే శ్రీ లతా రెడ్డి - కేసీఆర్ కు ఉద్యమంలో సహకరించారట వాళ్ల నాన్న శోభన్ రెడ్డి. అటు రెడ్డి వర్గం ఇటు సొంత ప్రయోజనం. ఇదీ ఈక్వేషన్. రెడ్లంతా వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీలొకి వరదలాగ పోతారని భయంతో ఇది రెడ్డి వర్గానికి వేసిన తాయిలం గాలం.  అదే తాయిలం ఇతర వర్గాలకు కంటగింపుగా మారింది.


ఇకపోతే ఎంఐఎం తో దోస్తీ ఋజువైంది. ఇప్పటి వరకు అలాంటి సంబంధం లేదని మాటల్లో చెపిన  కేసీఅర్ చేతల్లో మాది విడదీయ రాని బంధం అని,  మేం కవలలం మాత్రమే కాదు. సయామీ  కవలలం (అతుక్కుని పుట్టిన కవలలు) అని ఋజువు చేశారు.


ఇప్పుడు తెలంగాణా ప్రజలు ఒకటి అర్ధం చేసుకోవాలి. "ఎంఐఎం కు ఓటేసినా టిఆరెస్ కు ఓటేసినా ఒకటే" అన్ని ఓట్లు ఒక బ్యాంక్ ఖాతా లోనే జమ అవుతాయన్నది నిజం నూరుపాళ్లు నిజం.  


     


షాక్... టీడీపీలోకి వైసీపీ నేతల క్యూ

ఉప్పెన 'బేబమ్మ' చితక్కొట్టేసింది.. పూజా హెగ్దే, రష్మిక పక్కకు తప్పుకోవాల్సిందేనా..!

జగడ్డ: జగనోరి ఎమ్మెల్యే పై నిమ్మగడ్డ సీరియస్.. కారణం అదే?

అమరావతిని అమ్మేస్తారా..?

ఉప్పెన బజ్.. మెగా మేనియా అంటే ఇదే బాసు..!

ఉప్పెన ఫస్ట్ టాక్.. మెగా హీరో సినిమా ఎలా ఉంది..?

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు ఆనందానికి అసలు కారణం ఇదేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Parisa Rama Krishna Rao]]>