TechnologyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/whatsapp-jobs-hi-messagee88bcaff-440b-40b5-a863-f2417baa91d8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/whatsapp-jobs-hi-messagee88bcaff-440b-40b5-a863-f2417baa91d8-415x250-IndiaHerald.jpgఎన్నో సంవత్సరాల నుండి కష్టపడి చదివి , వేలకు వేలు ఫీజులు కట్టి,చదువు ముగిసాక ఉద్యోగం కోసం చెప్పులు అరిగేలా తిరుగుతున్నప్పటికి జాబ్ గతి లేదు. ఇప్పుడు ఏమో హాయ్ అని మెసేజ్ చేస్తే చాలు జాబ్ ఇస్తాం అంటున్నారేంటి అని అనుకుంటున్నారా..? అవునండీ .. నిజమే 7208635370 నెంబర్ కు హాయ్ అని పంపిస్తే చాలు ఖాళీల వివరాలు, కార్మికుల కోసం శ్రామిక్ శక్తి మంచ్ పోర్టల్,ఆ పోర్టల్ తో చిన్న,మధ్య తరహా పరిశ్రమల లింక్, కార్మికులకు సొంత రాష్ట్రంలో ఉపాధి కల్పన కల్పించడం కోసం ఫిబ్రవరి 11న ఆవిష్కరించారు. కరోనా సమయంలో వలస కూలీలwhatsapp,jobs,hi,message;technology;tiru;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;industries;smart phone;whatsapp;job;hindi;february;central government;shakti"బుల్లిపిట్ట " ఈ నెంబర్ కు హాయ్ అని వాట్సప్ చేస్తే చాలు.. జాబ్ మీ సొంతం.!"బుల్లిపిట్ట " ఈ నెంబర్ కు హాయ్ అని వాట్సప్ చేస్తే చాలు.. జాబ్ మీ సొంతం.!whatsapp,jobs,hi,message;technology;tiru;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;industries;smart phone;whatsapp;job;hindi;february;central government;shaktiFri, 12 Feb 2021 13:00:00 GMTఎన్నో సంవత్సరాల నుండి కష్టపడి చదివి , వేలకు వేలు ఫీజులు కట్టి,చదువు ముగిసాక ఉద్యోగం కోసం చెప్పులు అరిగేలా తిరుగుతున్నప్పటికి జాబ్ గతి లేదు. ఇప్పుడు ఏమో హాయ్ అని మెసేజ్ చేస్తే చాలు జాబ్ ఇస్తాం అంటున్నారేంటి అని అనుకుంటున్నారా..?
అవునండీ .. నిజమే  7208635370 నెంబర్ కు హాయ్ అని పంపిస్తే చాలు  ఖాళీల వివరాలు, కార్మికుల కోసం శ్రామిక్ శక్తి మంచ్ పోర్టల్,ఆ  పోర్టల్ తో చిన్న,మధ్య తరహా పరిశ్రమల లింక్, కార్మికులకు సొంత రాష్ట్రంలో ఉపాధి కల్పన కల్పించడం కోసం ఫిబ్రవరి 11న ఆవిష్కరించారు. కరోనా సమయంలో వలస కూలీలు దుర్భర పరిస్థితి మళ్లీ తలెత్తకూడదన్న ఉద్దేశంతో, కేంద్ర ప్రభుత్వం కృత్రిమ మేధ సహాయంతో ,సరికొత్త పోర్టల్ శ్రామికశక్తి మంచ్ కు ఈ రూపకల్పన చేసింది.

ఈ నెంబర్ కు హాయ్ అని మెసేజ్ చేస్తే చాలు,సొంత రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఉన్నాయో ఆ ఉద్యోగాలకు అర్హులో,కాదో తెలుసుకోవచ్చు. పైన ఇచ్చిన నెంబర్ కు వాట్సాప్ లోకి వెళ్లి హాయ్ అని మెసేజ్ చేస్తే చాలు దానంతట అదే పోర్టల్ కు కనెక్ట్ అవుతుంది. అందులో వచ్చే ప్రశ్నలకు సమాధానం ఇస్తే చాలు, మన నైపుణ్యానికి తగిన ఉద్యోగాలు, ఖాళీల వివరాలను వెల్లడిస్తుంది.


వాట్సాప్ చాట్ బోట్ ను డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ( డీ ఎస్ టీ ) బుధవారం నాడు ప్రారంభించారు. డీ ఎస్ టీ కి చెందిన టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఫోర్ కాస్టింగ్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్ ( టి ఐ ఎఫ్ ఎ సీ ) శ్రామిక్ శక్తి మంచ్ పోర్టల్ ను రూపొందించారు . ఇది సూక్ష్మ ,చిన్న,మధ్య తరహా పరిశ్రమల లో పనిచేసే కార్మికులతో వాట్సప్ ద్వారా అనుసంధానం పొంది ఉంటుంది.

అంతేకాకుండా పరిశ్రమల వివరాలు, వాటి లోకేషన్, ఉద్యోగాల ఖాళీలా వివరాలు, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందులో పేర్కొంటారు. ఒక్కసారి కార్మికులు ఈ నెంబర్ కి హాయ్ అని మెసేజ్ చేస్తే మన నైపుణ్యం, అనుభవం, తదితర ప్రశ్నలు వస్తాయి. తర్వాత దగ్గరలోని పరిశ్రమ యాజమానికి,కార్మికుడికి అనుసంధానం చేస్తుంది . ప్రస్తుతం హిందీ,ఇంగ్లీష్ భాషలో మాత్రమే ఈ పోర్టల్ ఉంది. అంతేకాకుండా స్మార్ట్ ఫోన్ లేనివారు 022-67380800 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చి, వివరాలు తెలుసుకోవచ్చు.  అయితే ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా హాయ్ అని మెసేజ్ పెట్టండి.




టీడీపీలో ఎస్ఈసీ హీరో.. చంద్ర‌బాబు జీరో... అదే ట్విస్ట్ ?

జగడ్డ : నిమ్మగడ్డతో అసలైన టెన్షన్ అక్కడే ఉంది...?

ఆ ఏపీ మంత్రికి సొంత పంచాయ‌తీ టెన్ష‌న్‌... ప‌రువు ఉంటుందా... పోతుందా ?

టీడీపీ - జ‌నసేన చీక‌టి పొత్తులు.. `పంచాయ‌తీ`పై బీజేపీ ఆగ్ర‌హం..!

ఏపీ మంత్రి కుటుంబంలో టికెట్ల‌ చిచ్చు.. రీజ‌నేంటి ?

వైసీపీ దూకుడు.. ఎస్ ఈసీ బ్రేకులు... అధికార పార్టీకి అదిరే షాక్ ?

కాపు వేద‌న‌: రాజా వారి ఏలుబ‌డిలోనూ... కాపుల క‌ష్టాలు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>