MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mega-heroes9b83fa2d-e0c3-4607-8c0a-8742a9fae170-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mega-heroes9b83fa2d-e0c3-4607-8c0a-8742a9fae170-415x250-IndiaHerald.jpg2020 సంవత్సరంలో కరోనా దెబ్బతో నష్టపోయిన ఫిలిం ఇండస్ట్రీ ఆనష్టాలను పూర్తిగా తీర్చుకునే దిశలో ఈసంవత్సరం వరసపెట్టి సినిమాలను విడుదల చేయబోతోంది. అత్యంత భారీ మధ్య తరహా చిన్నతరహా సినిమాలు ఇలా వరసగా ఒకదానిపై ఒకటి పోటీ పడుతూ ప్రేక్షకుల పై దండెత్తబోతున్నాయి. ఈఏడాది సంక్రాంతిని మొదలుకొని వచ్చే సంక్రాంతి వరకు టాలీవుడ్ సినిమాల డైరీ ఫుల్ అయింది. ప్రతి హీరో ఫిలిం మేకర్ కూడ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.ఇది ఇలా ఉండగా ఒక్క మెగా ఫ్యామిలీ నుంచే దాదాపు 12 సినిమాలు ఈఏడాది ప్mega heroes;sports;pawan;chiranjeevi;ntr;venkatesh;rana;ram charan teja;allu arjun;allu sirish;kalyaan dhev;kalyan;kranthi;kranti;niharika konidela;ram pothineni;varun;varun sandesh;varun tej;makar sakranti;tollywood;rrr movie;cinema;sankranthi;2020;film industry;industry;remake;director;february;super machi;october;hero;daggubati venkateswara rao;june;nandamuri taraka rama rao;vaishnav tej;arjun 1;lieటాలీవుడ్ ను హెచ్చరిస్తున్న మెగా దాడి !టాలీవుడ్ ను హెచ్చరిస్తున్న మెగా దాడి !mega heroes;sports;pawan;chiranjeevi;ntr;venkatesh;rana;ram charan teja;allu arjun;allu sirish;kalyaan dhev;kalyan;kranthi;kranti;niharika konidela;ram pothineni;varun;varun sandesh;varun tej;makar sakranti;tollywood;rrr movie;cinema;sankranthi;2020;film industry;industry;remake;director;february;super machi;october;hero;daggubati venkateswara rao;june;nandamuri taraka rama rao;vaishnav tej;arjun 1;lieFri, 12 Feb 2021 11:00:00 GMT2020 సంవత్సరంలో కరోనా దెబ్బతో నష్టపోయిన ఫిలిం ఇండస్ట్రీ ఆనష్టాలను పూర్తిగా తీర్చుకునే దిశలో ఈసంవత్సరం వరసపెట్టి సినిమాలను విడుదల చేయబోతోంది. అత్యంత భారీ మధ్య తరహా చిన్నతరహా సినిమాలు ఇలా వరసగా ఒకదానిపై ఒకటి పోటీ పడుతూ ప్రేక్షకుల పై దండెత్తబోతున్నాయి. ఈఏడాది సంక్రాంతిని మొదలుకొని వచ్చే సంక్రాంతి వరకు టాలీవుడ్ సినిమాల  డైరీ ఫుల్ అయింది. ప్రతి హీరో ఫిలిం మేకర్ కూడ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.


ఇది ఇలా ఉండగా  ఒక్క మెగా ఫ్యామిలీ నుంచే దాదాపు 12 సినిమాలు  ఈఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న ‘ఉప్పెన’ తో  ఈ సంవత్సరం మెగా దాడి మొదలు కాబోతోంది. ఈమూవీ ఫిబ్రవరి 12న విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఆతరువాత పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ ఏప్రిల్ 9న విడుదల కానుంది. ఆపై ఒక నెల గ్యాప్ తీసుకుని ‘ఆచార్య’ మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.


హీరో సాయి తేజ్ డైరెక్టర్ దేవకట్టా కలయికలో వస్తున్న ‘రిపబ్లిక్’ సినిమా కూడా ఈ సమ్మర్ లోనే వస్తోంది. జూన్ 4న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘గని’ కూడ జూలై 30న విడుదల చేస్తున్నారు. అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీని ఆగస్ట్ 13న విడుదల చేయడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి.  రామ్ చరణ్ ఎన్టీఆర్ లు కలసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీని అక్టోబర్ 13న రిలీజ్ చేస్తున్నాన్నారు.




ఇదిచాలదు అన్నట్లుగా పవన్ కళ్యాణ్ దగ్గుబాటి రానా కాంబోలో వస్తున్న ‘అయ్యప్పనమ్ కోషియమ్’ కూడా ఈ సంవత్సరమే విడుదల కానుంది అన్న సంకేతాలు వస్తున్నాయి. ఆపై చిరంజీవి ‘లూసిఫర్' రీమేక్ కూడా ఈ సంవత్సరం చివరిలో విడుదల అంటున్నారు. వైష్ణవ్ తేజ్ నటిస్తున్న మరొక మూవీ ‘కొండపొలం’ రిలీజ్ కు రెడీగా ఉంది. అలాగే అల్లు శిరీష్ హీరోగా రూపొందుతున్న సినిమా మెగా డాటర్ నిహారిక ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ కూడా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలుస్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన ‘సూపర్ మచ్చి’ ‘కిన్నెరసాని’ సినిమాలు కూడా ఈ ఏడాదే రిలీజ్ అంటున్నారు. ఇలా ఈ లెక్కలు అన్నీ చూస్తుంటే ఈ సంవత్సరం మెగా ఫ్యామిలీ హీరోల నుండి 12 సినిమాలు విడుదల కావడమే కాకుండా ఈ సంవత్సరం అంతా ప్రతి నేలలోను మెగా హంగామా కనిపించే ఆస్కారం ఉంది..




టీడీపీ - జ‌నసేన చీక‌టి పొత్తులు.. `పంచాయ‌తీ`పై బీజేపీ ఆగ్ర‌హం..!

ఏపీ మంత్రి కుటుంబంలో టికెట్ల‌ చిచ్చు.. రీజ‌నేంటి ?

వైసీపీ దూకుడు.. ఎస్ ఈసీ బ్రేకులు... అధికార పార్టీకి అదిరే షాక్ ?

కాపు వేద‌న‌: రాజా వారి ఏలుబ‌డిలోనూ... కాపుల క‌ష్టాలు..!

ఉప్పెన ప్రివ్యూ: సినిమా చూడాల్సిందే.. కార‌ణాలు ఇవే..!?

టీచర్ల వెతలు: వీళ్లు మనుషులు కారా..? వీళ్లకు కుటుంబాలు ఉండవా..?

వకీల్ సాబ్ కు అజ్ఞాతవాసి వ్యూహాలు నిరాశలో అభిమానులు !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>