PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpgతెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ త్వరలోనే పాదయాత్ర చేసే అవకాశాలున్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతున్నది. ఎప్పుడు పాదయాత్ర చేస్తున్నారు ఏంటి అనే దానిపై ఇంకా స్పష్టత లేకపోయినా త్వరలోనే దీనికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉండవచ్చని భావిస్తున్నారు. అంతేకాకుండా బీజేపీ కీలక నేతలు కొంతమంది ఆయనతో కొన్ని అభిప్రాయాలను కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రథయాత్ర చేస్తే మంచిది అనే భావనను కొంతమంది కీలక నేతలు ఆయనకు సూచనలు చేశారు. బిజెపి నిజామాబbandi sanjay;allu aravind;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;mp;district;nalgonda;ranga reddy;partyతెలంగాణా రాజకీయాల్లో సంచలనం... రథయాత్ర మొదలుపెట్టేస్తున్న బండి సంజయ్...?తెలంగాణా రాజకీయాల్లో సంచలనం... రథయాత్ర మొదలుపెట్టేస్తున్న బండి సంజయ్...?bandi sanjay;allu aravind;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;mp;district;nalgonda;ranga reddy;partyFri, 12 Feb 2021 21:00:00 GMTతెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ త్వరలోనే పాదయాత్ర చేసే అవకాశాలున్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతున్నది. ఎప్పుడు పాదయాత్ర చేస్తున్నారు ఏంటి అనే దానిపై ఇంకా స్పష్టత లేకపోయినా త్వరలోనే దీనికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉండవచ్చని భావిస్తున్నారు. అంతేకాకుండా బీజేపీ కీలక నేతలు కొంతమంది ఆయనతో కొన్ని అభిప్రాయాలను కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రథయాత్ర చేస్తే మంచిది అనే భావనను కొంతమంది కీలక నేతలు ఆయనకు సూచనలు చేశారు.

బిజెపి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా పాదయాత్ర చేస్తే మంచిది అని చెప్పినట్లుగా సమాచారం. దీంతో రథయాత్ర చేయాలా పాదయాత్ర చేయాలా అనే దానిపై బండి సంజయ్ ఇప్పుడు మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది. అయితే బండి సంజయ్ పాదయాత్ర చేస్తే మంచిది అనే భావనను కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పాదయాత్ర ఎప్పుడు మొదలు పెడతారు ఏంటనే దానిపై స్పష్టత లేకపోయినా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనే దానిపై మాత్రం ఒక క్లారిటీ ఉందని అంటున్నారు.

ఇప్పుడు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధిస్తే అధికార టీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి బండి సంజయ్ ఇప్పుడు ఉమ్మడి జిల్లాల మీద దృష్టి పెట్టారని సమాచారం. ఖమ్మం జిల్లా నుంచి యాత్రను మొదలు పెట్టాలని ఖమ్మం జిల్లా మీదుగా నల్గొండ అలాగే హైదరాబాద్  మీదుగా రంగారెడ్డి వరకు వెళ్ళాలి అని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయ తీరాలకు చేరడానికి ఆయన పాదయాత్ర, లేదా రథయాత్ర ఏదో ఒకటి ఎంచుకుని ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎన్నికలకు సమయం లేదు కాబట్టి ఇప్పుడు రథయాత్ర చేస్తే మంచిదనే భావనలో ఆయన ఉన్నట్టుగా తెలుస్తోంది.


నిమ్మగడ్డను కుక్కతో పోల్చిన సజ్జల

షర్మిళ కీలక నిర్ణయం..!

పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్స్ వీళ్ళే

బిగ్ అనౌన్స్ మెంట్ : రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ ఆయనతో ఫిక్స్ .....!!

ఊరి పేరే సినిమా పేరు.. అందులో ఎన్ని హిట్..ఎన్ని ఫట్..

శ్రీరామ రాజ్యం చిన్నారి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ప్రియాంక చోప్రా..షాక్ లో భర్త నిక్ జోనస్.. ??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>