PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/almondf6701f2c-ade0-49a3-a76b-14b69c3e828e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/almondf6701f2c-ade0-49a3-a76b-14b69c3e828e-415x250-IndiaHerald.jpgబాదం పప్పు ఆరోగ్యానికి చాల మంచిది. చాల మంది బాదం పప్పును రాత్రి నానబెట్టి ఉదయాన్నే తింటారు. బాదంని తినడం వలన రోగనిరోధక శక్తిని పెంపొందించేందకు, మెదడు ఏకాగ్రతను మెరుగుపరిచేందుకు శరీరానికి కావాల్సిన శక్తిని అందించేందకు బాదం బాగా ఉపయోగపడుతుందని అందరికీ తెలిసిందే. అంతేకాదు వీటిలో ఆరోగ్యకరమైన విటమిన్లు, పోషకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా వీటిలో విటమిన్-ఇ, ఒమేగా-3 సమృద్దిగా లభిస్తాయి. almond;samatha;tiru;vitamin;aqua;almondsబాదంను పొట్టు తీసి తింటే మంచిదా.. తీయకుండా తినాలా..!?బాదంను పొట్టు తీసి తింటే మంచిదా.. తీయకుండా తినాలా..!?almond;samatha;tiru;vitamin;aqua;almondsFri, 12 Feb 2021 06:00:00 GMT
ఇలా కాకుండా వీటిని రాత్రి నానబెట్టి ఉదయం తినే వారి సంఖ్య మరింత ఎక్కువ ఉంటుంది. అయితే అందరికి ఇక్కడ ప్రశ్న ఏంటంటే.. నానబెట్టిన బాదంలను పొట్టు తీసి తినాలా..? లేదంటే పొట్టుతో కలిపి తినేయాలా..? అని. ఈ అనుమానం మీకూ వచ్చిందా..? అయితే ఇంకా ఎందుకు ఆలస్యం ఈ వార్త చదివేయండి మరి.

ఇక బాదం పప్పులో ఎలా అయితే ఆరోగ్యకరమైన పోషక విలువలు ఉంటాయో అలాగే. బాదం పొట్టులో కూడా విటమిన్- ఇతో పాటు ఫైబర్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి వీటిని పొట్టు తీసి తినాల్సిన అవసరం లేదంటున్నారు పోషకాహార నిపుణులు. నానబెట్టిన బాదం పప్పులను అలాగే నేరుగా పొట్టుతో కలిపి తినేయచ్చు అనడంలో సందేహం అవసరం లేదు. కాకపోతే..  మీలో ఎవరైనా అజీర్ణంతో బాధపడుతుంటే అప్పుడు బాదం పొట్టు తీసి తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

అయితే బాదంలో అజీర్తి సమస్య ఉన్నవారు పొట్టును తినడం వల్ల కొన్నిసార్లు సమస్య తీవ్రతరం అయ్యే అవకాశాలున్నాయి. ఇక బాదం పప్పులతో పాటు.. నువ్వులు, గుమ్మడికాయ, పుచ్చకాయ గింజలు, పొద్దుతిరుగుడు గింజలను రాత్రి నానబెట్టుకుని ఉదయం తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో ఇనుము ఎక్కువగా లభిస్తుంది. హార్మోన్ల సమతుల్యత కోసం నల్ల ఎండుద్రాక్షలను కూడా నానబెట్టుకుని తినచ్చని నిపుణులు సూచిస్తున్నారు.


నక్క తోక తొక్కిన దుర్గారావు... అందులో అవకాశం కొట్టేశాడు..!

హెరాల్డ్ ఎడిటోరియల్ : షర్మిల Vs బ్రాహ్మణి ?

విజయ్ దేవరకొండ..పవర్ స్టార్ కు పోటీ వస్తాడా ..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : షర్మిల జిల్లాల పర్యటన ఎందుకో తెలుసా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : పవన్ ఢిల్లీకి వెళ్ళింది దీనికేనా ?

కాంబినేషన్ సెట్ చేయడంలో మామయ్యలని మించిపోయాడు..!

మూడు భారీ డిజాస్టర్ల తరువాత బాలయ్య మార్కెట్ కు షాక్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>