PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vijay-saireddy-sensational-comments-on-pulivendula-7e5ec42a-7952-47bc-95a3-c8b1a1bbc62a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vijay-saireddy-sensational-comments-on-pulivendula-7e5ec42a-7952-47bc-95a3-c8b1a1bbc62a-415x250-IndiaHerald.jpg ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌కు ఎవ‌రి నుంచి కూడా ఇలాంటి ప‌రిణామం ఎదురు కాలేదు. దీంతో స్పందించిన ఆయ‌న ఈ విష‌యాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్తాన ‌ని.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాల సీతారామ‌న్ ద‌గ్గ‌ర‌కు ప‌రిశ్ర‌మ కార్మికుల బృందాన్ని కూడా తీసుకువెళ్తాన ‌ని హామీ ఇచ్చారు. అయినా వారు వెన‌క్కి త‌గ్గ‌కుండా.. ప్ర‌ధాని మోడీతోనే త‌మ‌కు భేటీ ఏర్పాటు చేయించాల‌ని.. అక్క‌డే విష‌యం తేల్చుకుంటామ‌ని చెప్పారు. దీంతో స‌రేన‌న్నారు. అయితే.. ఇది అంత తేలిక కాదు.. ఇటీవ‌ల కాలంలో విజ‌య‌సాయికి ప్ర‌ధాని అప్పాయింట్ మెంట్ ఇవ్వ‌డంvijaya sai reddy;bharatiya janata party;mp;vishakapatnam;minister;letter;tdp;central government;ycpవిజ‌యసాయికి అగ్ని ప‌రీక్షే... తేడా వ‌స్తే అంతే సంగ‌తి ?విజ‌యసాయికి అగ్ని ప‌రీక్షే... తేడా వ‌స్తే అంతే సంగ‌తి ?vijaya sai reddy;bharatiya janata party;mp;vishakapatnam;minister;letter;tdp;central government;ycpFri, 12 Feb 2021 11:57:00 GMTవైసీపీ కీల‌క నాయ‌కుడు, జాతీయ స్థాయిలో చ‌క్రం తిప్పుతున్న ఎంపీ విజ‌య‌సాయిరెడ్డికి.. విశాఖ ఉక్కు ప‌రిణామాలు పెద్ద ఎత్తున సెగ పుట్టిస్తున్నాయి. విశాఖ ఉక్కును పోస్కో సంస్థ‌కు విక్ర‌యించేందుకు జ‌రు గుతున్న ప‌రిణామాల వెనుక విజ‌య‌సాయిరెడ్డి కూడా ఉన్నారంటూ.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ పెద్ద  ఎత్తు న ‌ప్ర‌చారం చేస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న దీని నుంచి బ‌య‌ట ప‌డేందుకు తీవ్రంగానే శ్ర‌మిస్తున్నారు. ఇటీవల ఆయ‌న విశాఖ ఉక్కు కార్మికుల‌ను ప‌రామ‌ర్శించేందుకు విశాఖ వెళ్లారు. దీంతో అక్క‌డి కార్మికులు.. పార్టీల‌కు అతీతంగానే ఆయ‌న కాన్వాయ్‌ను చుట్టుముట్టారు. విష‌యం తేల్చాల‌ని ప్ర‌శ్నించారు.

నిజానికి విజ‌య‌సాయికి ఇది ఊహించ‌ని ప‌రిణామం. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌కు ఎవ‌రి నుంచి కూడా ఇలాంటి ప‌రిణామం ఎదురు కాలేదు. దీంతో స్పందించిన ఆయ‌న ఈ విష‌యాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్తాన ‌ని.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాల సీతారామ‌న్ ద‌గ్గ‌ర‌కు ప‌రిశ్ర‌మ కార్మికుల బృందాన్ని కూడా తీసుకువెళ్తాన ‌ని హామీ ఇచ్చారు. అయినా వారు వెన‌క్కి త‌గ్గ‌కుండా.. ప్ర‌ధాని మోడీతోనే త‌మ‌కు భేటీ ఏర్పాటు చేయించాల‌ని.. అక్క‌డే విష‌యం తేల్చుకుంటామ‌ని చెప్పారు. దీంతో స‌రేన‌న్నారు.

అయితే.. ఇది అంత తేలిక కాదు.. ఇటీవ‌ల కాలంలో విజ‌య‌సాయికి ప్ర‌ధాని అప్పాయింట్ మెంట్ ఇవ్వ‌డం లేదు. ఆమాట‌కొస్తే.. బీజేపీ కీల‌క నేత‌లు ఎవ‌రూ కూడా సాయిరెడ్డితో మాట్లాడ‌డం లేదు. ఇటీవ‌ల రాజ్య‌స‌భ చైర్మ‌న్‌, ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌పై విజ‌య‌సాయిరెడ్డి నోరు పారేసుకున్నారు. దీనిపై బీజేపీ నాయ‌కులు గుర్రుగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బీజేపీ అగ్ర‌నేత‌లు కూడాడిమాండ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో సాయిరెడ్డికి ప్ర‌ధాని నుంచి అప్పాయింట్‌మెంట్ ఆశించ‌డం అంటే.. అది అంత తేలిక విష‌యం కాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మ‌రోవైపు ముంచుకొస్తున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో విశాఖ పీఠంపై వైసీపీ ఆశ‌లు పెట్టుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు కూడా అన్నీతానై వ్య‌వ‌హ‌రించిన సాయిరెడ్డి.. ఇప్పుడు విశాఖ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీని గట్టెక్కించాల్సిన అవ‌స‌రం ఉంది. అయితే.. ఇప్పుడు న్న ప‌రిస్థితిలో అది కూడా సాధ్య‌మేనా? అనేది కీల‌క ప్ర‌శ్న‌. ఇలా ఏవిధంగా చూసుకున్నా.. విశాఖ ఉక్కు.. విజ‌యసాయిరెడ్డికి అగ్ని ప‌రీక్ష‌గా మారింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.  


వీధిలో నిలబెట్టి రేషన్ ఇస్తే కుదరదు.. ఇంటింటికీ వెళ్లాల్సిందే..

టీడీపీ - జ‌నసేన చీక‌టి పొత్తులు.. `పంచాయ‌తీ`పై బీజేపీ ఆగ్ర‌హం..!

ఏపీ మంత్రి కుటుంబంలో టికెట్ల‌ చిచ్చు.. రీజ‌నేంటి ?

వైసీపీ దూకుడు.. ఎస్ ఈసీ బ్రేకులు... అధికార పార్టీకి అదిరే షాక్ ?

కాపు వేద‌న‌: రాజా వారి ఏలుబ‌డిలోనూ... కాపుల క‌ష్టాలు..!

ఉప్పెన ప్రివ్యూ: సినిమా చూడాల్సిందే.. కార‌ణాలు ఇవే..!?

టీచర్ల వెతలు: వీళ్లు మనుషులు కారా..? వీళ్లకు కుటుంబాలు ఉండవా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>