Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sree-shanth274e4640-8ec6-4b49-ac0d-fa6d5a7a0b50-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sree-shanth274e4640-8ec6-4b49-ac0d-fa6d5a7a0b50-415x250-IndiaHerald.jpgఏడేళ్ల తరువాత మళ్లీ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన శ్రీశాంత్.. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆడాలని తెగ ఉవ్విళ్లూరాడు. దీనికోసం తన వంతు ప్రయత్నంగా వేలంలో పాల్గొనేందుకు తన పేరును కూడా రిజిస్టర్ చేసుకున్నాడు. త్వరలో తనను ఎవరో ఒకరు వేలంలో..sree shanth;bcci;sreesanth;indianశ్రీశాంత్‌కు షాకిచ్చిన ఐపీఎల్.. ఆక్షన్‌కు నో..శ్రీశాంత్‌కు షాకిచ్చిన ఐపీఎల్.. ఆక్షన్‌కు నో..sree shanth;bcci;sreesanth;indianFri, 12 Feb 2021 13:04:45 GMTఇంటర్నెట్ డెస్క్: ఏడేళ్ల తరువాత మళ్లీ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన శ్రీశాంత్.. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆడాలని తెగ ఉవ్విళ్లూరాడు. దీనికోసం తన వంతు ప్రయత్నంగా వేలంలో పాల్గొనేందుకు తన పేరును కూడా రిజిస్టర్ చేసుకున్నాడు. త్వరలో తనను ఎవరో ఒకరు వేలంలో కొనుగోలు చేస్తారని, మళ్లీ ఐపీఎల్‌లో ఆడాలని ఆశపడ్డాడు. కానీ అతడి ఆశలపై బీసీసీఐ నీళ్లు చల్లింది. ఆటగాళ్ల జాబితా నుంచి అతడి పేరును తొలగించింది.
           
ఐపీఎల్ 2021 వేలం జాబితాలో బీసీసీఐ శ్రీశాంత్ పేరును చేర్చలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్, సీజన్ 14 వేలం కోసం శ్రీశాంత్ గతేడాది తన పేరును నమోదు చేసుకున్నాడు. రూ.75 లక్షల బేస్ ధరను ఆశించాడు. కానీ శ్రీశాంత్‌కు బీసీసీఐ షాకిచ్చింది. తుది జాబితాలో శ్రీశాంత్ పేరును చేర్చలేదు. ఫ్రాంచైజీలు ఏవీ ఆసక్తి కనబరచకపోవడం వల్లనే అతడి పేరు నమోదు చేయలేదని బీసీసీఐ అధికారి పేర్కొన్నారు.

ఈ విషయంపై ఇన్‌స్టాగ్రామ్ వేదికగా శ్రీశాంత్ స్పందించాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో స్థానం సంపాదించలేకపోయినందుకు బాధపడడం లేదని, వచ్చే ఏడాది కచ్చితంగా ఆడేలా ప్రయత్నస్తానని శ్రీశాంత్ తన పోస్టులో పేర్కొన్నాడు. ఇప్పటివరకు 8 ఏళ్లు ఎదురు చూశానని, మరో ఏడాది కూడా ఎదురు చూడగలనని శ్రీశాంత్‌ ధీమాగా చెప్పాడు.

ఇదిలా ఉంటే ఐపీఎల్14 కోసం మొత్తం 1114 మంది ఆటగాళ్లు పేర్లను నమోదు చేసుకున్నారు. వారిలో 292 మంది ఆటగాళ్ల పేర్లను ఫైనలైజ్ చేస్తూ బీసీసీఐ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి తుది జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 164 మంది దేశీ ఆటగాళ్లు ఉండగా.. మిగతా 138 మంది విదేశీ ఆటగాళ్లు. ఈ ఏడాది ఐపీఎల్ ఎప్పటిలానే మార్చిలో ప్రారంభమయ్యే అవకావాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాదు ఈ ఏడాది టో్నీకి అభిమానులు కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది.




టీడీపీలో ఎస్ఈసీ హీరో.. చంద్ర‌బాబు జీరో... అదే ట్విస్ట్ ?

జగడ్డ : నిమ్మగడ్డతో అసలైన టెన్షన్ అక్కడే ఉంది...?

ఆ ఏపీ మంత్రికి సొంత పంచాయ‌తీ టెన్ష‌న్‌... ప‌రువు ఉంటుందా... పోతుందా ?

టీడీపీ - జ‌నసేన చీక‌టి పొత్తులు.. `పంచాయ‌తీ`పై బీజేపీ ఆగ్ర‌హం..!

ఏపీ మంత్రి కుటుంబంలో టికెట్ల‌ చిచ్చు.. రీజ‌నేంటి ?

వైసీపీ దూకుడు.. ఎస్ ఈసీ బ్రేకులు... అధికార పార్టీకి అదిరే షాక్ ?

కాపు వేద‌న‌: రాజా వారి ఏలుబ‌డిలోనూ... కాపుల క‌ష్టాలు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>