PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ktr-ghmc-mayor01d0f72e-ea8d-4f09-9be4-34d60158f43c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ktr-ghmc-mayor01d0f72e-ea8d-4f09-9be4-34d60158f43c-415x250-IndiaHerald.jpgభారతీయ జనతా పార్టీ నేతలు ఈ మధ్య కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు కాస్త అధికార తెరాస పార్టీని ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవం. రాజకీయంగా బిజెపి ఎప్పుడైతే తెలంగాణా మీద ఫోకస్ చేసిందో అక్కడి నుంచి కూడా సిఎం కేసీఆర్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుంది. దుబ్బాక ఉప ఎన్నికలు అలాగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత బిజెపి మరింత స్పీడ్ పెంచింది. ఈ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన తర్వాత బిజెపి నేతలు కాస్త స్పీడ్ గా అడుగులు వేస్తున్నారు. ప్రతీ అంశంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఇక ఇప్పుడు ktr;kcr;ktr;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;minister;sircilla;partyకేసీఆర్ ని తిడితే ఊరుకోను... కేటిఆర్ వార్నింగ్కేసీఆర్ ని తిడితే ఊరుకోను... కేటిఆర్ వార్నింగ్ktr;kcr;ktr;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;congress;minister;sircilla;partyFri, 12 Feb 2021 15:06:13 GMTభారతీయ జనతా పార్టీ నేతలు ఈ మధ్య కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు కాస్త అధికార తెరాస పార్టీని ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవం. రాజకీయంగా బిజెపి ఎప్పుడైతే తెలంగాణా మీద ఫోకస్ చేసిందో అక్కడి నుంచి కూడా సిఎం కేసీఆర్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుంది. దుబ్బాక ఉప ఎన్నికలు అలాగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత బిజెపి మరింత స్పీడ్ పెంచింది. ఈ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన తర్వాత బిజెపి నేతలు కాస్త స్పీడ్ గా అడుగులు వేస్తున్నారు. ప్రతీ అంశంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు. 

ఇక ఇప్పుడు బిజెపి పై తెరాస నేతలు కూడా కాస్త గట్టిగానే ఎదురు దాడి చేస్తున్నారు. ప్రతీ అంశానికి కూడా తమను విమర్శించడంతో ఇన్ని రోజులుగా బిజెపి విషయంలో సైలెంట్ గా ఉన్న తెరాస పార్టీ నేతలు తమ వైఖరి మార్చుకుని విమర్శలు చేస్తున్నారు. తాజాగా మంత్రి కేటిఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కార్యకర్తల విస్త్రతస్థాయి సమావేశంలో పాల్గొన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కెటిఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఓపికకు హద్దులుంటాయి అని అన్నారు. మేం తిరగబడితే ప్రధాన మంత్రిని కూడా విడిచిపెట్టం అని వార్నింగ్ ఇచ్చారు. 

గతంలో ముఖ్యమంత్రులను ఉరికించినం అని అన్నారు. ఇప్పుడున్న బీజేపీ, కాంగ్రెస్ ల బతుకెంత అని ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీలో బిజెపి, కాంగ్రెస్ పరిస్థితి గంజిలో ఈగల కంటే అద్వాన్నం అని ఆయన ఆరోపించారు. ఉద్యమం లో కాంగ్రెస్ నేతలు పారిపోయారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. నోటి కొచ్చినట్టు కేసీఆర్ పై మాట్లాడితే ఊరుకుంటానా అని ప్రశ్నించారు. ఒక్క సీటు గెలిచి బీజేపీ ఎగిరిపడుతోంది అని అన్నారు. కులాల పేరిట బీజేపీ కుంపట్లు పెడుతుంది అన్నారు. ఇరవై ఏళ్లలో చాలా చూశాం అని ఆయన పేర్కొన్నారు. చేతులు కట్టుకుని నిలబడ్డ కాంగ్రెస్ నేతలా మా గురించి మాట్లాడేది అని మండిపడ్డారు.



మీరేమైనా పతివ్రతలా...? తెరాస మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఉప్పెన : రివ్యూ

వ్యాపార రంగంలోకి శ్రీముఖి.. ల‌వ‌ర్స్ డే రోజు సంచ‌ల‌న నిర్ణ‌యం

ఇక "ఆర్ ఆర్ ఆర్" తరువాత ఎన్టీఆర్ పెద్ద పాన్ ఇండియా స్టార్ అవ్వడం ఖాయం...!!

జగడ్డ : జగన్ కి ఉద్యోగ సంఘాల తొలి నిరసన గళం.. నిమ్మగడ్డ ఇచ్చిన ధైర్యమేనా ?

జగడ్డ : నిమ్మగడ్డతో అసలైన టెన్షన్ అక్కడే ఉంది...?

ఆ ఏపీ మంత్రికి సొంత పంచాయ‌తీ టెన్ష‌న్‌... ప‌రువు ఉంటుందా... పోతుందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>